జులై 31 వతారీకు 2011 ఈనాడులో ఒక వార్త ప్రచురితం అయ్యింది. ఈ వార్త ప్రకారం సుప్రీం కోర్ట్ వారు ఎన్నికల ప్రణాళికలో తయారు చెయ్యటానికి తగిన మార్గదర్శకాలు తయారు చెయ్యాలని ఆదేసించినట్టుగా తెలుస్తున్నది. ఇది ఎంతో హర్షించ తగ్గ విషయం. ఎన్నికల ప్రణాళికలో అన్నీ ఉచితాలు అంటూ ప్రలోభ పెట్టటం గురించి, ఎన్నికల ప్రణాళిక తయారి గురించి, మునుపు వ్రాసిన వ్యాసం ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు
సమాజంలో ఎవరి కష్టం వారు పడి, తనకు కొంత, సమాజంలోని మరెందరికో పనికి వచ్చే పని చెసుకుంటూ బతుకుతూ, అందరికీ కావాల్సిన పనులను చెయ్యటానికి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుని, ఆ ప్రభుత్వం అందరికీ కావాల్సిన పనులు చెయ్యటానికి కావాల్సిన వనరులు సమకూర్చుకోవటానికి తాము సంపాయించుకున్న డబ్బుల లోనుండి కొంత పన్నుగా కట్టటం అనేది జరగాలి. ప్రజలు ఈ విధంగా పన్నులు కట్టటం వరకూ దాదాపు బాగానే జరుగుతున్నదీ, కనీసం మధ్యతరగతి వరకు. ఆ విధంగా సమకూర్చుకున్న పన్ను సొమ్ము, సమాజానికి పనికి వచ్చే పనులకోసం వెచ్చించాలి, ఎలా వెచ్చిస్తున్నారు అన్న విషయం "బడ్జెట్" ద్వారా ప్రభుత్వం ప్రజలకు తెలియ చెయ్యాలి.
కాని జరుగుతున్నది ఏమిటి, ప్రజాస్వామ్యం పేరిట తమకు ఓట్లు వేసే "మందలకు" వాళ్ళను పూర్తిగా సోమరులను చేస్తూ అన్నీ ఉచితాలు అంటూ ప్రకటించి, అవి వాళ్లకు ఇస్తూ పొతే, చివరకు అలా ఇవ్వటానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? కొన్నాళ్ళకు ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నం అయిపోతుంది. ఇప్పటికైనా ఈ ఎన్నికల ప్రణాళికలకు మార్గదర్శకాలు తప్పనిసరిగా రూపొందించాలి, ఆ విధంగా ఏర్పరచబడ్డ మార్గదర్శకాలు, ఎన్నికల కమీషన్ వంటి మంచి వ్యవస్థ ద్వారా అమలు చెయ్యాలి. ఈ విషయం లో కోర్టులు ఒక మంచి తీర్పు ఇస్తాయని ఆశిద్దాం.
ఈ విషయంలో కోర్టులో కేసు వేసిన బాలాజీ గారికి నా అభినందనలు.
ఈ దేశంలో రెండు వర్గాలవారు పన్నులు కట్టరు. ఒకరు పేదవారు, రెండోది పెద్దవారు. మధ్య వర్గంవారే నలిగిపోతూ అన్ని పన్నులూ కడతారు.కాని ఫలాలు మాత్రం ఆ రెండు వర్గాలవారికే. తర్కించి చూస్తే ఇదే నేటి రాజకీయ రామాయణం మూడు ముక్కల్లో.
రిప్లయితొలగించండిబాగా చెప్పారు "బాబు" గారూ.
రిప్లయితొలగించండి