15, ఆగస్టు 2011, సోమవారం

అరవై నాలుగేళ్ల స్వాతంత్ర్యం!



స్వాతంత్ర్య దినోత్సవం రోజున మనం చెయ్యగలిగినది ఏమిటి, ఝెండా ఎగరేసి,ఒక సెల్యూట్ (చేతయితే) కొట్టి వచ్చేయటమేనా! ఇంకా ఏమన్నా ఉన్నదా!

అరవై నాలుగు సంవత్సరాల ప్రతి పంద్రాగాష్టుకు ఒక్కొక్క ప్రతిన పూని, మాటమీదే ప్రజలంతా ఉండగలిగిఉంటే, పాటికి "అవినీతి దయ్యం" మన్ని ఇలా పీడిస్తూ ఉంటుందా ?

ఏది ఐకమత్యత? కొందరికి విదేశీ ఇజాల మీద మోజు! మోజులో శత్రు దేశాలతో సైతం చేతులు కలపటం వాళ్ళకి తప్పు అనిపించదు!! పాపము శమించు గాక!

ప్రజాస్వామ్యం లో మొట్టమొదటి "బాధ్యత" ఓటు వెయ్యటం. స్వాతంత్ర్య దినోత్సవానికి, రాబొయ్యే ఎన్నికలు, ఏమైనా సరే, పంచాయితీ, కార్పోరేషన్, మునిసిపాలిటీ, శాసన సభ, పార్లమెంట్ అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేద్దామని ప్రతిన పూనుదాం. ధన,కనక ,వస్తు, వాహన, కుల, మత, భాష లకు అతీతంగా మనకు ఇష్టమైన వ్యక్తికి ఓటు వేసి తీరాలని పట్టుదలతో అందరూ ఉంటే, ఎన్నికలు విజయవంతం అవుతాయి. లేకపోతె ఏభై అరవై శాతంగా ఉండి, అందులో మెజారిటీ అంటే ఒక పదిహేనో, పదిహేడో శాతం వచ్చిన వాళ్ళు గెలవటం. అంటే, మొత్తం వంద శాతం ఓటర్లలో వ్యక్తి గెలవాలని అనుకున్నది పది శాతం కూడ లేరన్నమాట, మిగిలిన తొంభై శాతం మంది ఉద్దేశ్యం ఏమిటి?? విధంగా ఎన్నికైన వాళ్ళ సముదాయమైన మన చట్ట సభలు, మన ఆశలను, ఆశయాలను, కోరికలను విధంగా వ్యక్తీకరించగలరు!? మనది ప్రపంచంలో విధంగా అతి పెద్ద ప్రజాస్వామ్యం ఆవుతుంది ??!!

ఒక్క చిన్న ప్రయత్నం, నూట పదికోట్ల మంది చేస్తే, సమాజంలో సూది మొనపాటి లేని విదేశీ శక్తులు, అవినీతి పరులు, సంఘ వ్యతిరేక శక్తులు మటుమాయం అయిపోతాయి.













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.