25, సెప్టెంబర్ 2011, ఆదివారం

యు ట్యూబ్ లో "బాబు"


శ్రీ కొలను వెంకట దుర్గా ప్రసాద్ "బాబు" (క్లిక్)

"బాబు" అంటే ఎవరో రాజకీయ నాయకుడనుకునేరు! కానే కాదు. "బాబు" అనగా శ్రీ కొలనువెంకట దుర్గా ప్రసాద్, నా అభిమాన తెలుగు కార్టూనిస్టులలో ఒకరు. ఈయన కార్టూన్లు నాకుచిన్నతనం నుండి ఎంతో ఇష్టం. చక్కటి హాస్యం, పొందికైన మాటలతో ఉండి నవ్వుతెప్పించటమే కాదు, ఆలోచింపచేస్తాయి కూడా.

నాకు లాగానే మా తమ్ముడు రాధాకృష్ణకు కూడ "బాబు" అంటే ఎంతో అభిమానం. ఆఅభిమానంతో నే కొన్ని కార్టూన్లను తీసుకుని ఒక వీడియో చేసి యు ట్యూబ్ లోకి ఎక్కించాడు. ఆ చక్కటి వీడియో ఈ కింద ఇస్తున్నాను చూసి ఆనందించండి.

కార్టూన్లు వీడియోలో ఉంచి, అందులో ఉన్న కాప్షన్ సందర్భోచితంగా చదవటం, అవసరమైనసంగీతం/పాట ఉంచటం ఒక కొత్త ప్రక్రియ. మీరు కూడ చూసి ఆనందించండి. ఇదే విధంగారాధాకృష్ణ మరికొన్ని కార్టూన్ వీడియోలు అందచేస్తాడని ఆశిద్దాం.


"బాబు" కు సొంత బ్లాగ్ ఉన్నది. అందులో ఆయన తన కార్టూన్లను ప్రచురిస్తున్నారు . ఈ మధ్య కొన్ని వారాలుగా, దాదాపు నలభై ఏళ్ళ క్రితం ప్రచురించబడిన తన కార్టూన్ ధారావాహిక "వెంకన్నాస్ కోల్డ్" వారానికి రెండుసార్లు ధారావాహికగా తన బ్లాగులో పున:ప్రచురిస్తున్నారు. ఈ కింది లింకు నొక్కి ఇప్పటివరకూ ప్రచురించబడిన భాగాలు అన్నీ చూడవచ్చు.

2 వ్యాఖ్యలు:

  1. హాస్యాన్ని ఆస్వాదించే వారికందరికీ బాబు గారు ఇష్టమే , మీ తమ్ముడు రాధా కృష్ణకు మా వందనాలు , ఎందుకంటే ఒక క్రొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు .

    ప్రత్యుత్తరంతొలగించు
  2. రాజశేఖర్ దాసరి గారు,

    మీ కేప్షన్ "ఏడవడానికి యాభై కారణాలు చూపించే లోకానికి నవ్వడానికి నూరు కారణాలు నువ్వు చూపించు", బాగుంది. నా ప్రయోగం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రయోగానికి మూలం "బాబు" గారు మరియు "శివా" గారు; వారికి నా కృతజ్ఞతలు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.