రెండు మూడు రోజుల క్రితం శ్రీ పేకేటి శివరాం సమర్పించిన ప్రత్యెక జనరంజని మొదటి భాగం(క్లిక్) ఈ బ్లాగులో అందించటం జరిగింది. మిగిలిన భాగాలు ఈ కింద ఇవ్వబడ్డాయి, విని ఆనందించవచ్చు.
రెండవ బాగం
- ఘంటసాల మంచి సంభాషణా చాతుర్యం కలవారు. మంచి హాస్య ప్రియుడు. ఆయనే కనుక హాస్య నటుడు అయ్యి ఉంటే, తమవంటివారు మిగిలే వాళ్ళు కాదు.
- శ్రీ ఘంటసాల స్వయంగా తీసిన భక్త రఘునాథ సినిమా విశేషాలు
- ఘంటసాలను తానూ గాయకునిగా పరిచయం చెయ్యటం
- శ్రీ ఎస్ భావనారాయణ గారు తీసిన తోటలో పిల్ల కోటలో పిల్ల సినిమా గురించి.
మూడవ భాగం
- పాండురంగ మహాత్మ్యం సినిమా షూటిం గులో జరిగిన ఒక సంఘటన
- కులగౌరవం సినిమాకు తానూ దర్సకత్వం వహించటం
- స్వర్గ సీమ సినిమా గురించి
నాలుగవ (చివరి) భాగం
- సాలూరి రాజేశ్వర రావుగారి గురించి
- వెంకటేశ్వర మహాత్మ్యం సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన
విని ఆనందించిన వారందరికీ ఒక్కటే విన్నపం
మీ దగ్గర కానీ, మీ స్నేహితుల వద్ద కానీ, మీ బంధువర్గంలో కాని, మీ ఇరుగుపొరుగు వారివద్ద కాని, సహోద్యోగుల వద్ద కాని, మీకు తెలిసిన మరే ఇతరులవడ్డ కాని, రేడియో కార్యక్రమాల రికార్డింగులు (అంటే కాసేట్లలో కాని ఎం పి 3 లో కాని) ఉంటే సేకరించి అందరితో పంచుకోగలరు. ఆకాశవాణి వద్ద వారి పూర్వపు ప్రసారాల కాపీలు లేవట, శ్రోతలమైన మనమే పూనుకుని మనందరి దగ్గర ఉన్నవి ఒక భాండాగారంగా చేసుకుని మన రేడియో కార్యక్రమ సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకోవాలి.
ఈ రికార్డిం గులు అన్ని అందించిన శ్రీ శ్యాం నారాయణ గారికి కృతజ్ఞతలు
Thanks for sharing the program. I saw Peketi Sivaram in a new angle.
రిప్లయితొలగించండి