21, అక్టోబర్ 2011, శుక్రవారం

ఒక ఇంటర్వ్యూ మీద సమీక్ష


గత వారంలో శ్రీ కే బి కే మోహన్ రాజు గారి గురించి ఒక చిన్న వ్యాసం వ్రాశాను.(క్లిక్) అందులో ఆయన వెబ్ సైటుకు లింకు కూడా ఇవ్వటం జరిగింది. 
అక్కడ ఉన్న ఆడియోల్లో ఒకటి హైదరాబాదు ఆకాశవాణి వారి ఎఫ్ ఎం   స్టేషన్లో మునుపు ప్రసారమైన ఇంటర్వ్యూ ఉన్నది. ఆ ఇంటర్వ్యూ విన్న తరువాత, నాకు కలిగిన భావాలు/బాధ  ఈ కింద వ్రాశాను.
మోహన్ రాజు గారి వెబ్ సైటులో ఉంచిన రేడియో ఇంటర్వ్యూ వింటే చాలా బాధ కలిగింది. ఆ ఇంటర్వ్యూ చేసినాయనకి కొత్తో, లేక ఆయన తీరే అంతో తెలియదు. మోహన్ రాజు గారు ఏదో చెప్పబోతుంటే చాలా అమర్యాదగా కట్ చేసి పారేసి , తన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. 


అదేదో "హార్డ్ టాక్"(క్లిక్) లాటి కార్యక్రమం అయితే అలా ఎగ్రసివ్ గా  టిం సెబాస్టియన్(క్లిక్) లాగా ఉంటే నప్పుతుంది కాని, కళాకారులను అందులో సీనియర్ కళాకారులను ఇంటర్వ్యూ చేసేప్పుడు అలా దురుసుగా ప్రవర్తించటం చాలా తప్పు. ఆ ఇంటర్వ్యూ చేసినాయన తెలుసుకుని  భవిష్యత్తులో  పెద్దవాళ్ళను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఆయనకు ఆకాశవాణి  వారు మళ్ళి ఇస్తే ఆలా  వచ్చిన ఆవకాశం సద్వినియోగ పరుచుకుని అలా చెయ్యబోయే ఇంటర్వ్యూలలో పైన ఉదాహరించిన  తప్పు జరుగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. 


ఇంతకు ముందు ప్రముఖ నటుడు గుమ్మడి గారితో ఒక ఇంటర్వ్యూ(క్లిక్)  గురించి విపులంగా వ్రాశాను. చూడండి. 

పూర్తిగా పైన ఉదహరించిన ఇంటర్వ్యూకు అన్వయించ  లేకపోయినా, సామాన్యంగా ఎక్కువ భాగం ఇంటర్వ్యూలు, ముఖ్యంగా అలనాటి పెద్దలను, ఇప్పటి వారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు జరుగుతున్న విషయాన్ని తేట తెల్లం చేస్తూ ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ "బాబు "వేసిన కార్టూన్.  













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.