30, అక్టోబర్ 2011, ఆదివారం

ఇ-స్పీక్ - తెలుగు స్క్రిప్ట్ చదివే సాఫ్ట్వేర్


మనకు ఇంటర్నెట్లో ఆంగ్లలో వ్రాసి ఉన్న టెక్స్ట్ చదవటానికి రకరకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి. కాని తెలుగు స్క్రిప్ట్ లో వ్రాసి ఉన్న టెక్స్ట్ చదవటానికి ఏ విధమైన సాఫ్ట్వేర్లు దొరకటంలేదు అని బాధపదుతున్నాం. కాని ఈ లోటు తీర్చటానికి "నవీన్" తన వంతు ప్రయత్నం చేసి ఆ సాఫ్ట్వేర్ ను మనకు అందించారు. ఈ కింద ఇచ్చిన లింకు నొక్కి నవీన్ బ్లాగు చూసి అందులో వ్రాసి ఉన్న వివరాలు చదువుకుని, తెలుగు చదివే ఆ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 



డౌన్లోడ్ చేసుకున్నాక, ఆ బ్లాగులో ఉన్న వివరాల ప్రకారం ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ పేరు ఇ-స్పీక్.   బ్లాగులో వ్రాసిన ప్రకారం ఇన్స్టాల్ చేసినాక, ఇ-స్పీక్ సాఫ్ట్వేర్ ను వాడేప్పుడు, డిఫాల్ట్ గా వచ్చే వాయిస్ కాకుండా, ఇ-స్పీక్ టి (E Speak TE) ను ఎంచుకోవాలి. మీరు చదువదలుచుకున్న టెక్స్ట్ అక్కడే టైపు చెయ్యచ్చు లేదా ఫైలును కూడా ఎంచుకుని చదివించవచ్చు. ప్రస్తుతానికి టెక్స్ట్ ఫార్మాట్ ఫైలు మాత్రమె చదువగాలుగుతున్నది. 

ఇది ఒక చక్కటి అభినందించతగ్గ ప్రయత్నం తెలుగులో చదివి వినిపించే సాఫ్ట్వేర్ లేని లోటు ఇప్పటికి తీరింది. 

శ్రీ నవీన్ కు హృదయపూర్వక అభినందనలు 
ఈ సాఫ్ట్ వేర్ వాడి తెలుగు టెక్స్ట్ చదివిస్తే ఎలా ఉన్నదో ఈ కింది ప్లేయర్లో వినండి.
 
ఈ సాఫ్ట్వేర్ తయారీ ప్రస్తుతానికి మౌలిక స్థాయిలో ఉన్నది. ఈ సాఫ్ట్వేర్లో తెలుగు చదువుతుంటే చాలా యాంత్రికంగా ఉన్నది. తెలుగులో ఉన్న స్క్రిప్ట్ ను సహజ సిద్ధమైన గొంతుతో చదువగలిగే సాఫ్ట్వేర్ త్వరలో తయారు అవుతుందని ఆశిద్దాం. 

శ్రీ నవీన్ గురించిన వివరాలు అందుబాటులో లేవు. ఈయన చేసిన ఈ అద్భుత ప్రయత్నం గురించి ఈనాడు దినపత్రికలో రెండు మూడు రోజుల క్రితం లోపల ఎక్కడో ఒక రెండు అంగుళాల వార్తగా ప్రచురించారుట. పనికిమాలిన రాజకీయ వార్తలు తమ ఊహాగానాలతో నింపే బదులు ఇటువంటి చక్కటి ప్రయత్నం గురించి మొదటి పేజీలో అన్ని దినపత్రికలూ ప్రచురించతగ్గ  విశేషం ఇది.  

ఈ  విషయం గురించిన సమాచారం అందించిన  శ్రీ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు   


1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.