30, అక్టోబర్ 2011, ఆదివారం

"అబ్బా" భలే పాట !



 "అబ్బా" భలే పాట!!   ఏమిటో ఆ  బాధ అంటారా. ఇది తెలుగు అబ్బా! కాదు. స్వీడన్ కు చెందిన ఒక సంగీత బృదం పేరు. చాలా చిత్రంగా పెట్టుకున్నారు ఈ పేరు అనుకోవచ్చు. అలా వాళ్ళు పెట్టుకున్న పేరు తెలుగులో మనం అసంకల్పితంగా  అనే మాటల్లో ఒకటి కావటం వల్ల మనకు చిత్రంగా ఉంటుంది. కాని ఈ సంగీత బృందంలో ఉన్న నలుగురు-ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు-వారి పేర్లు ఆంగ్లంలో మొదటి అక్షరాలు తీసుకుని వాళ్ళ బృందానికి ABBA అని పెరు పెట్టేసుకున్నారు. వాళ్ళు పాడిన పాటలు 1974-75 నుంచి దాదాపు 1980-81 వరకూ లోక ప్రసిద్ధం, మరీ అంత కాకపోయినా యూరోపు, ఉత్తర అమెరికాలలో ప్రసిద్ధం, పాశ్చాత్య సంగీతం వినే వాళ్ళు ఉన్న ఇతర దేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందినాయి వాళ్ళ పాటలు.


అప్పట్లో విజయవాడలో "సోనోవిజన్" అని ఒక రేడియో మరియు గ్రామఫోన్ రికార్డులు అమ్మే  షాపు ఉండేది. ఇప్పటికీ ఉన్నది ప్రస్తుతం, వాళ్ళు టి వి లు మరింకా ఇతర ఎలెక్ట్రానిక్ ఉపకరణాలు అమ్ముతున్నారు. రేడియోలు, గ్రామఫోన్ రికార్డులు అంతరించిపోయినాయి. 


1977 లో అనుకుంటాను అక్షరాలా నలభై నాలుగు  రూపాయల ఏభై పైసలు ఖర్చుపెట్టి, మా నాన్నగారు నాకు పుట్టినరోజుకు ఇచ్చిన అదనపు పాకెట్  మనీతో "అబ్బా" వాళ్ళు పాడిన ఒక ఎల్ పి కొన్నాను. కొని ఆ పాటలు ఇంట్లో వింటూ ఆనందించాను, కానీ, మా నాన్న నన్ను ఏమంటారో, అసలే ఆయనకు పాశ్చాత్య సంగీతం అంతగా పడదు అని భయం  వేసి ,  ఆ రికార్డు తీసికెళ్ళి ఎలాగోలా వాళ్లకు తిరిగి ఇచ్చి, ఘంటసాల ప్రవైటు పాటల ఎల్ పి పట్టుకు వచ్చాను. నేను మళ్ళీ ఈ పాటలు స్వంతంగా కొనుక్కోగలిగే అవకాశం వచ్చేప్పటికి, గ్రామఫోను, ఎల్ పి రికార్డులు అన్నీ కనుమరుగయ్యాయి. ప్రస్తుతం సి డి లో విని ఆనందిస్తున్నాను.


విషయం ఏమంటే, ఆనాడు కొన్న "అబ్బా" రికార్డు లో "నీనా ప్రేట్టీ  బలరీనా" అనేపాట నాకు ఆల్ టైం ఫేవరైట్. నెట్లో ఈ పాటకు లింకు ఈ రోజున దొరికింది, మీ కోసం ఈ కింద ఇచ్చాను, వినండి.





ABBA - Nina Pretty Ballerina .mp3


Found at bee mp3 search engine


ఇదే పాటను యు ట్యూబ్ లో కూడా ఈ కింది లింకు నొక్కి చూస్తూ వినవచ్చు


"అబ్బా" పాడిన నినా ప్రెట్టీ బలరీన


ఈ పాట సాహిత్యం ఈ కింది విధంగా ఉన్నది


Every day in the morning on her way to the office
You can see as she catches a train
Just a face among a million faces
Just another woman with no name
Not the girl you'd remember but she's still something special
If you knew her I am sure you'd agree
'Cause I know she's got a little secret
Friday evening she turns out to be...

Nina, pretty ballerina

Now she is the queen of the dancing floor
This is the moment she's waited for
Just like Cinderella
(just like Cinderella)
Nina, pretty ballerina
Who would ever think she could be this way
This is the part that she likes to play
But she knows the fun would go away
If she would play it every day

So she's back every morning to her work at the office

And another week to live in a dream
And another row of early mornings
In an almost never-ending stream
Doesn't talk very often, kind of shy and uncertain
Everybody seems to think she's a bore
But they wouldn't know her little secret
What her Friday night would have in store...

Nina, pretty ballerina

Now she is the queen of the dancing floor
This is the moment she's waited for
Just like Cinderella
(just like Cinderella)
Nina, pretty ballerina
Who would ever think she could be this way
This is the part that she likes to play
She would like to play it every day

Nina, pretty ballerina

Now she is the queen of the dancing floor
This is the moment she's waited for
Just like Cinderella
(just like Cinderella)
Nina, pretty ballerina
Who would ever think she could be this way
This is the part that she likes to play
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.