5, నవంబర్ 2011, శనివారం

షావుకారు జానకి ప్రత్యెక జనరంజని



నటీ  నటులకు  తాము  నటించిన మొట్టమొదటి  సినిమానో లేక  తాము బాగా  నటించిన  సినిమానో  పేరులో చేరటం అనేది అరుదుగా జరుగుతుంది . నాకు తెలిసి ఇలా తాము నటించిన సినిమా పేరు తమ పేరులో చేర్చుకున్న మొట్టమొదటి నటి "షావుకారు" జానకి.  షావుకారు సినిమాలో చలాకీగా నటించి గోవిందరాజులు సుబ్బారావుగారు నటించిన పాత్రను తన మాటలతో ముప్పు తిప్పలు పెట్టిన అమ్మాయి అప్పటి కొత్త నటి జానకి. ఆ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ కీర్తితోబాటుగా ఆ సినిమా పేరు ఆమె ఇంటిపేరుగా మారిపోయి, మనందరికీ షావుకారు జానకిగానే పరిచయం అయ్యారు ఆవిడ.  

భావ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆవిడ ఆకాశవాణి హైదరాబాదు కేద్రం నుండి అందించిన ప్రత్యేక జనరంజని ఐదు  భాగాలుగా, శ్రీ శ్యాం నారాయణ గారు అందించారు అవి మీ కోసం.


మొదటి భాగం



రెండవ భాగం



మూడవ భాగం




నాలుగవ భాగం







ఐదవ భాగం 




ఈ రికార్డింగులు అందించిన     శ్రీ శ్యాం నారాయణ గారికి, ఆయనకు అందించిన అజ్ఞాత రేడియో అభిమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 







3 కామెంట్‌లు:

  1. అందించినవారందరికీ ధన్యవాదాలు.

    అప్పటికే రేడియో వినడం మానేయడంవల్ల ఇలాంటి కార్యక్రమాలని మిస్సయ్యాం!

    అయినా మళ్లీ అందిస్తున్నారంటే......నిజంగా ధన్యులు.....ధన్యులం!

    యెటొచ్చీ, ఆ పాటలని ఆవిడకోసం యెంపిక చేసినవారెవరో?!

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది మీ ఆలోచన
    షావుకారు జానకి వాయిస్ రేడియోలో విని మనసు పులకరించింది
    మరిన్ని రేడియో కార్యక్రమాలు సేకరించి పంపించగలరని ఆశిస్తూ................

    రిప్లయితొలగించండి
  3. షావుకారు జానకి గారు స్వయంగా నిర్వహించిన జనరంజని కార్యక్రమం చాలా బావుంది. సమయానుకూలంగా మాట్లాడుతూ చక్కటి పాటలను వేస్తూ మధ్యలో తనగురించి తన సినిమాలగురించి చెప్పటం చాలా చక్కగా వున్నది. శివగారు చాలా చక్కటి కార్యక్రమాన్ని మాకు అందించారు. తరవాత, చిన్న సూచన; కాస్త అక్షరాల సైజు పెంచగలరు. చదవటానికి ఇబ్బందిగా వున్నది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.