7, నవంబర్ 2011, సోమవారం

వివేకానంద వాణి



స్వామీ వివేకానంద అమెరికా వెళ్లి చికాగో నగరంలో సర్వ మత సమ్మేళనం లో ప్రసంగించి వంద సవత్సరాలు ఐన సందర్భంగా, 1993 సవత్సరంలో రాజమహేంద్ర నగరం లోని రామకృష్ణ మఠం  వారు శ్రీ వివేకానంద స్వామి బోధనలను  తెలుగులో అందరికీ అందాలన్న సత్సంకల్పంతో ఒక చక్కటి రికార్డింగ్ విడుదల చేసారు. వివేకానందుని వాణి వినిపించగల   గళం ఎవరికి ఉన్నది, ఒక్క కొంగర జగ్గయ్య గారికి తప్ప. కంచు కంఠం గా పేరొందిన జగ్గయ్య గారి గొంతు లో వినగలగటం ఒక చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని మనకు అందిం చిన రామకృష్ణ మఠం  వారికి కృతజ్ఞతలు. వివేకానందుని  బోధనలు రెండు భాగాలుగా ఈ కింద ఇచ్చిన ప్లేయర్లలో వినవచ్చు. 

వివేకానందుని బోధనలలో (వంద సంవత్సరాలు పైబడినా) మనలను అందరినీ ఆలోచింప చేసే విశేషాలు ఎన్నో ఉన్నాయి. 


మొదటి భాగం 
 


రెండవ భాగం 
 



ఈ రికార్డింగులను అందించిన శ్రీ శ్యాం నారాయణ గారికి కృతజ్ఞతలు. ఈ ఆడియో ఫైళ్ళను ఇక్కడ ఉంచటంలో  ఉద్దేశ్యం, వివేకానందుని బోధనలు మరింత ఎక్కువమందికి అందుబాటులోకి తేవటమే కాని, మరే ఇతర ఉద్దేశ్యమూ లేదు.  ఈ ఫైళ్ళకు కాపీ రైట్ ద్వారా హక్కులు ఉన్నవారు ఎవరైనా  అభ్యంతరం తెలియచేస్తే వెనువెంటనే తొలగించబడతాయి. 









2 కామెంట్‌లు:

  1. ధన్యవాదాలు ,
    చాలా మంచి ఆడియో ను అందించారు !
    నా దగ్గర ఇంగ్లిషు ఉపన్యాసం ఉంది , కాని తెలుగులో విన్న తర్వాత ఆ ఆనందమే వేరని అనిపించింది

    రిప్లయితొలగించండి
  2. @RASTRACHETHANA

    మీరు చెప్పే ఆంగ్ల ప్రసంగం ఆడియో ఎవరు చదివినది? ఇంటర్ నెట్లో ఒక ఫైలు వివేకానందుని గొంతు గా చలామణి అవుతున్నది . కాని అది నిజం కాదని నా అభిప్రాయం. 19 శతాబ్దపు చివరలో ఒక ఉపన్యాసం రికార్డు చేసే అవకాశం అమెరికాలో ఐన సరే ఉన్నదా?? లేదు.

    తరువాత, ఇప్పుడు జగ్గయ్యగారి గొంతులో వినబడిన వివేకానంద వాణి, చికాగోలో ఆయన చేసిన ఆంగ్ల ప్రసంగం మక్కీ మక్కీ తలుగు అనువాదం కాదు. వివేకానందుడు చెప్పిన అనేకానేక విషయాలను ప్రధమపురుష లో చదవటం జరిగింది.

    ఆ తరువాత మీరు మీకంటూ ఒక ప్రొఫైల్ తయారు చేసుకుని ధైర్యంగా మీ వ్యాఖ్యలు వ్రాయండి. బారతమాత బొమ్మ పెట్టుకుని పేరు ఊరు లేకుండా వ్రాయటం సరికాదు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.