8, నవంబర్ 2011, మంగళవారం

పత్రికా స్వేచ్చ!


మనకు  పత్రికా  స్వేచ్చ   ఉన్నదా అన్న మీమాంస చాలా కాలంబట్టి ఉన్నది. మనం పరాయి పాలనలో ఉన్నప్పుడు, మనం మనకోసం పత్రికలు స్థాపించుకుని , మనకు కావలిసిన విషయాలను గురించి వ్రాసుకునే సందర్భంలో, ఆ వ్రాతలలో తమకు అభ్యంతరకరంగా ఉన్నవి అనీ, తమ పరిపాలనకు ఎదురు   మాట్లాడే తీరులో ఉన్నాయని అప్పటి ప్రభుత్వాలు అడ్డు తగులుతూ ఉంటే, అలా వాళ్ళు అడ్డు తగలకుండా ఉండటమే "పత్రికా స్వేచ్చ" అని అనుకోవటం జరిగింది. అనేక పోరాటాలు జరిగాయి, అనేక మంది పత్రికాధిపతులు, సంపాదకులు రకరకాల కష్ట నష్టాలకు ఓర్చి,  స్వాతంత్ర సమరంలో తమ వంతు పాత్ర తాము పోషించి, దేశ స్వాతంత్ర్య సముపార్జనలో పాటుబడ్డారు. 

సరే  మనకు స్వాతంత్ర్యం వచ్చింది అని కొంత సంతోషపడిన మాట వాస్తవమే కాని, కొంతకాలానికి ఈ పత్రికా స్వేచ్చ అంటే ఏమిటి అన్న మీమాంస మళ్ళీ మొదలయ్యింది. ఇప్పుడు పరాయి పాలన లేదు. మనకంటూ ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారం కొన్ని ప్రాధమిక హక్కులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది భావ ప్రకటనా హక్కు . ఈ   హక్కు మూలకంగానే పత్రికల్లో సంపాదకీయాలు వగైరా వగైరా వ్రాస్తూ ఉంటారు, అలా వ్రాస్తూ వారికి అవసరం అనుకున్న చోట ప్రబుత్వ విధానాలను కూడా విమర్శిస్తూ ఉంటారు. అలా చేయబడ్డ విమర్సల వల్ల అనేక సార్లు ప్రభుత్వ  విధానాలే మారిన సంఘటనలు ఉన్నాయి. 

ఇక   మామూలు వార్తలు వార్తలుగా వ్రాసేయ్యటానికి పత్రికా స్వేచ్చ అనే మాట వాడాల్సిన అవసరం లేదు. ఏదో ఉన్న విషయం ఉన్నట్టుగా ఒక చోట జరిగిన విషయం అందరికీ తెలియచెయ్యటానికి కూడా భావ ప్రకటనా హక్కు వాడుకోవాలా? ఒక్కొక్క సారి ఈ భావ ప్రకటన వల్ల ఒక చోట జరిగిన సంఘటన, మరొక చోట గొడవలకు దారి తియ్యవచ్చు. బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన ప్రపంచ వ్యాప్తంగా టేలివైజ్ కాకుండా ఉంది ఉంటే ఆ విషయం ఇంత ప్రాముఖ్యతను తెచ్చుకుని, అక్కడ జరిగిన దానికి వేల రెట్ల అల్లర్లను తెచ్చిపెట్టేది కాదు. 

కాబట్టి సంపాదకీయ  రూపకంగా ప్రభుత్వ  విధానాలను విమర్శించినా, ఒక చోట జరిగిన సంఘటనలను ప్రచురించే ప్రయత్నంలోనూ, రెండిటిలోనూ, పత్రికా స్వేచ్చ అనే అంశం ఉన్నది. 
ఈ రెండు విషయాలనూ ఎవరు నియంత్రిస్తారు. ఈ నియంత్రణ పత్రికలు తమకు తాము చేసుకునేదే ఎక్కువ. ప్రస్తుతానికి ప్రభుత్వ నియంత్రణ ప్రత్యక్షంగా లేదు. కాకపొతే తమకు ఇష్టం లేని "వ్రాతలు" వ్రాసే వారికి ప్రబుత్వ పరంగా ఇచ్చే "ప్రకటనలు" ఇవ్వకుండా వారి ఆదాయం మీద దెబ్బ కొట్టే  ప్రయత్నాలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి, తద్వారా కొంత నియంత్రణ జరుగుతున్న  మాట వాస్తవమే. 

పత్రికలు సరే ఇతర సమాచార మాధ్యమాలు అన్నిటికీ స్వేచ్చ ఉన్నది. కాని ప్రేక్షకులమైన మనం,పాఠకులమైన  మనం ఈ పత్రికలు, టి వి ల నుంచి ఎటువంటి స్వేచ్చను అనుభవిస్తున్నాం. చాలా తక్కువ!  

ఏ పత్రికైనా సరే తమకు తమ పత్రికను విమర్శిస్తూ వచ్చే  ఉత్తరాలను ఎంతవరకూ ప్రచురిస్తాయి.  సాధ్యమైనంత వరకూ తమ పత్రికలోనో, చానెల్ లోనో వచ్చిన అంశాలను  మెచ్చు కుంటున్న ఉత్తరాలనీ, అభిప్రాయాలనీ ప్రాచుర్యంలోకి తెస్తాయి. మరి తమకున్న భావ ప్రకటనా స్వేచ్చ తమ పాఠకులకు కూడా ఉండాలి అన్న విషయం అంతగా పట్టించుకున్నట్టు లేదు. ఏ పత్రికన్నా ఒకటో రెండో శాస్త్రానికి విమర్శలు ప్రచురించినా, ఆ చదువరి/ప్రేక్షకుడు వ్రాసిన విషయాన్ని సాధ్యమైనంతగా నీళ్ళు కలిపేసి, ఆ వ్రాసినాయనే గుర్తు పట్టలేనంతగా మార్చి వేస్తారు. ఇది మనకున్న స్వేచ్ఛ.

మనకు స్వాతంత్ర్యం వచ్చినాక, పత్రికా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. అందులో ఒక పార్టీకి చెందిన వాళ్ళు జర్నలిస్టులుగా అన్ని పత్రికల్లోకీ చేరిపోవటం. మనకు పొరుగున ఉన్న ఒక శత్రు దేశపు భావజాలానికి బలైపోయి , అప్పట్లో కొందరు ఆ భావాలను ప్రచారం చెయ్యటానికి జర్నలిజం వృత్తి చేబట్టారు.  ఆవిధంగా తమ భావ జాలాలు ప్రచారం చేసుకోవటానికి పత్రికల్లో చేరి వారికున్న భావాలను పాఠకుల నెత్తిన రుద్దటం, జరిగిన ప్రతి సంఘటననూ, వార్తగా తమ భావజాలానికి అనుకూలంగా  మార్చి వ్రాయటం ఎంతవరకూ పత్రికా స్వేచ్ఛ కిందకు వస్తుంది. రాదు. అది ప్రచారం కిందకు వస్తుంది. 

పత్రికా స్వేచ్చకు మొట్టమొదటి దెబ్బ ఈ వామపక్ష వాదుల చొరబాటుతోనే తగిలింది. వీళ్ళ కంటే తెలివైన వాళ్ళు వీళ్ళను ఉద్యోగాల్లో పెట్టుకున్న వాళ్ళు. వీళ్ళ వంకర టింకర వ్రాతలను తమ ప్రత్యర్ధులను దెబ్బ తీయటానికి వాడుకున్నారు. తమకు ఆధిపత్యం ఉన్న సంస్థలం మీద వీళ్ళ వామపక్ష భావజాల వార్తలను వ్రాయనివ్వ లేదు. ఈ విధంగా పత్రికా ప్రపంచం లో పత్రికా స్వేచ్ఛ అనే మాటకు విలువ లేకుండా పోయింది. 

ఒకప్పుడు కనీసం 1960 ల వరకైనా, పత్రికాధిపతి, సంపాదకుడు వేరు వేరుగా ఉండేవారు. కొన్ని కొన్ని సార్లు సంపాదకుడు వ్రాసిన సంపాదకీయం, పత్రికాధిపతికి  నచ్చకపోయినా ఆ సంపాదకీయం అచ్చు అయ్యి బయటకు వచ్చేది. కాని రాను రాను ఈ ఇద్దరి మధ్య సమన్వయము కుదరక, ఆంగ్లంలో చెప్పాలంటే "conflict of interest" వచ్చి చివరకు చీఫ్ ఎడిటర్ అనే పదవి పుట్టింది. అంటే "ముఖ్య సంపాదకుడు" అనే ఒక వ్యక్తీ అవతరించాడు. ఆయన మరెవరో కాదు ఆ పత్రికాధిపతే ముఖ్య సంపాదక అవతారం ఎత్తి, సంపాదకుణ్ణి తన కింది "ఉద్యోగిగా" మార్చేశాడు. ఇక పత్రికా స్వేచ్ఛ ఎక్కడ? ఎగిరిపోయింది కిటికీలోంచి. 
ఆ తరువాత బాకా పత్రికల పుట్టుక మొదలయ్యింది. ముందు ముందుగా ఎప్పుడెప్పుడు విప్లవం తెచ్చి చైనా అయిపోదామా అని ఉవ్విళ్ళూరిపోతూ, వామ పక్ష వాదులు తాము ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంలోకి రావటం కంటే ప్రజలను "బ్రెయిన్ వాష్" చేసేయ్యటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, తమ తమ పత్రికలను ప్రచురించటం మొదలు పెట్టారు. తద్వారా ఏదో బావుకుందామని  వాళ్ళ తాపత్రయం. ఇటువంటి పత్రికల వల్ల పత్రికా స్వేచ్ఛ సంగతి ఏమో కాని, అసలు పత్రిక అంటే ఏమిటి, పార్టీ కరపత్రం అంటే ఏమిటి అన్న వాటికి తేడా లేకుండా పోయింది. 

ఇక మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా ఎవరికీ వాళ్ళు ఒక్కొక్క పత్రిక పెట్టుకోవటమో లేకపోతె ఉన్న పత్రికను తమ అధీనం లోకి తెచ్చుకుని తమకు అనుకూలంగా వార్తలను జాగ్రత్తగా సంధించి వ్రాయటం, లేదా కొన్ని వార్తలను అస్సలు వ్రాయక పోవటం వంటివి చెయ్యటం మొదలు పెట్టారు. ఇలా చెయ్యటం వల్ల పత్రికా స్వేచ్ఛ అనే పదం పూర్తిగా హాస్యాస్పదం అయిపోయింది. 

ఇప్పటికి బ్లాగులు వచ్చినాక మనకు అంటే పాఠకులకు కొంత స్వేచ్ఛ వచ్చింది, మనం అనుకున్నవి వ్రాయవచ్చు అనుకుంటే పొరబాటే. ఈ స్వేచ్ఛ స్వతంగా బ్లాగు ఏర్పాటు చేసుకుని వ్రాయగాలవారికే. బ్లాగులు చదువుతూ, తమ తమ భావాలను ఆయా పత్రికల నిర్వహిస్తున్న బ్లాగుల్లో వ్రాద్దామనుకుంటే, అక్కడా స్వేచ్ఛ లేదు. వ్రాసిన వ్యాఖ్యలను తీసిపారేస్తున్నారు. ఉదాహరణకు ఈ కింది బ్లాగు చూడండి:

http://prajaasakti.blogspot.com/2011/11/blog-post_7973.html 

ఈ బ్లాగులో ఈ కింది వ్యాఖ్యలను చూడండి. అందులో ఒకాయన వ్రాసిన వ్యాఖ్యను మూడు సార్లు తీసేశారు. కారణం ఆయన వ్రాసినది వాళ్లకు నచ్చ లేదు. తమకు నచ్చనిది తమ బ్లాగులోనే వ్యాఖ్యగా  ఉంచలేని   వాళ్ళు పత్రికా స్వేచ్ఛ ఏమి మాట్లాడగలరు!!  లేదా వాళ్ళు వ్రాసిన బంగారు వ్యాసాలూ అస్సలు చర్చ జరగకూడదు, వ్యాఖ్యకు మాకు అక్కర్లేదు అనుకుంటే అవి రాకుండా చేసెయ్యాలి కాని వ్రాసిన వ్యాఖ్యలు తీసెయ్యటం, ఒక దిన పత్రిక అని చెప్పుకుంటూ , అదీ కారణం చూపింకుండా, నా ఉద్దేశ్యంలో ప్రజాస్వామ్య విరుద్ధం.  

వాళ్ళు తొలగించిన కామెంటు ఇది  RADHAKRISHNA చెప్పారు...
ఎవరికి తోచినట్లు వారు ఏదోకటి అనేయట బాగా పరిపాటైయ్యింది. వీరందరూ ఇతర మతాల కధల జోలికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ హేతుబద్ధంగా వుండి ప్రజల మనస్సును చక్కగా తీర్చి దిద్దాయా? అలా అయితే వాటిలోని లోపాలను బహిరంగంగా చెప్పటానికి ఎందుకు  లౌకికతత్వం అనే ముసుగు వెసుకుని భయం లేనట్లు నటిస్తారు? మరి రామాయణ, భారతాలను విమర్శించే వారికి ఇంత ధైర్యాన్ని ఇచ్చిందెవరు? 
అదే భారతీయ సన్స్కృతి; ఈ ఇతిహాసాలను మరియు చక్కటి అనుబంధ పురాణాలను మనకు తెలియకుండా వంట బట్టించుకోబట్టే అందరూ ధైర్యంగా, స్వేచగా మాట్లాడగలుగుతున్నారు, వ్యాఖ్యలు చెయ్యగలుగుతున్నరు.  మన వ్యక్తిత్వంలో ఇంతటి స్వేచ్చనిచ్చిన హిందూ మాతం లాంటిది మరొకటి చూపించి, తరవాత  మనమీద మనం విమర్శ చేసుకొవడం మొదలు పెడితే బావుంటుంది. మన స్వేచ్చను బయట సాన్స్కృతిక దాడికి లోనైన కొందరు అతిగా తీసుకుని కూర్చున్న చెట్టునే నరకాలని చూస్తున్నారు.  మరి ఇంట్లో వాళ్ళనే తిట్టి, అడ్డదారిన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందామని అనుకుంటున్న  ఈ విభీషుణులకి వినపడుందో లేదో!!!  
RADHAKRISHNA చెప్పారు...
నా కామెంటు తొలగించారు కాబట్టి నెను చెప్పిందే నిజమైది.  ప్రజాశక్తి లో "శక్తి" కేవలం నేతిబీరకాయేనన్నమాట. ఈ నిరంకుశత్వానికే నేను వ్యతిరేకం. నచ్చకపోతే నా కామెంటుకి కామెంటు వ్రాసే స్వేచ్చ ప్రజలకివ్వచ్చుగా... "ప్రజల శక్తి" మీద మీకే నమ్మకం లేదా? 
ఒక వేళ సాంకెతిక కారణాల వలన నా వ్యఖ్య పోయినట్లైతే ఇది నా మొదటి కామెంట్:
ఎవరికి తోచినట్లు వారు ఏదోకటి అనేయట బాగా పరిపాటైయ్యింది. వీరందరూ ఇతర మతాల కధల జోలికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ హేతుబద్ధంగా వుండి ప్రజల మనస్సును చక్కగా తీర్చి దిద్దాయా? అలా అయితే వాటిలోని లోపాలను బహిరంగంగా చెప్పటానికి ఎందుకు లౌకికతత్వం అనే ముసుగు వెసుకుని భయం లేనట్లు నటిస్తారు? మరి రామాయణ, భారతాలను విమర్శించే వారికి ఇంత ధైర్యాన్ని ఇచ్చిందెవరు? 
అదే భారతీయ సన్స్కృతి; ఈ ఇతిహాసాలను మరియు చక్కటి అనుబంధ పురాణాలను మనకు తెలియకుండా వంట బట్టించుకోబట్టే అందరూ ధైర్యంగా, స్వేచగా మాట్లాడగలుగుతున్నారు, వ్యాఖ్యలు చెయ్యగలుగుతున్నరు. మన వ్యక్తిత్వంలో ఇంతటి స్వేచ్చనిచ్చిన హిందూ మాతం లాంటిది మరొకటి చూపించి, తరవాత మనమీద మనం విమర్శ చేసుకొవడం మొదలు పెడితే బావుంటుంది. మన స్వేచ్చను బయట సాన్స్కృతిక దాడికి లోనైన కొందరు అతిగా తీసుకుని కూర్చున్న చెట్టునే నరకాలని చూస్తున్నారు. మరి ఇంట్లో వాళ్ళనే తిట్టి, అడ్డదారిన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందామని అనుకుంటున్న ఈ విభీషుణులకి వినపడుందో లేదో!!!  వ్యాఖ్య 
6 నవంబర్ 2011 7:24 సా   
శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...
@Radhakrishna I am really disturbed to note that your comment has been removed by the "Praja Sakti". If it is not a technical glitch but was deliberately removed, it surely shows their impatience towards opinions which need not tally with theirs.
6 నవంబర్ 2011 7:53 సా
RADHAKRISHNA చెప్పారు... నా కామెంటు 3 సార్లు తొలగించటంతో నాకనిపిస్తోంది ఒకవేళ ఇతరుల కామెంటులు సహించే ఓపిక సహనం లేకపోతే మీ ఇంట్లో నొట్ బుక్ లొ వ్రాసుకోండి. అక్కడికి వచ్చి మేము మీ చెయ్య ప్రక్కనుండి వ్రాసే హక్కు మాకు లేదు కనుక. ఇలా పబ్లిక్ గా వచ్చిన దానిలో మీరు తీసేయడం చూస్తే నాకర్ధం అయినదేమంటే ప్రజాశక్తి లో "శక్తి" కంటే నిర్వాహుకుల "బలహీనతే" కనపడుతొంది. 


తరువాయి భాగం త్వరలో taruv

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.