27, నవంబర్ 2011, ఆదివారం

కేబినెట్లో ఉన్న ఏకైక పురుష పుంగవుడిగా పేరొందిన మహిళ

 

రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత బ్రిటన్  లో అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.అందులో లేబర్ ప్రభుత్వాలు, కన్సర్వేటివ్(టోరీ) ప్రభుత్వాలు  ఉన్నాయి. కాని బ్రిటన్ ను మళ్ళి ప్రపంచ  పటంలో ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టి పెరుతెచ్చినది కన్సర్వేటివ్  ప్రభుత్వం అందులోనూ మార్గరెట్  థాచేర్ హయాం లో. ఆ సమయంలో నే ఆవిడ కేబినెట్లో ఉన్న ఏకైక పురుషుడు అని అక్కడి మీడియా అభివర్ణించింది. బ్రిటన్లో చర్చిల్ తరువాత అంత పేరు ప్రపంచ వ్యాప్తంగా తెచ్చుకున్న ప్రధాన మంత్రి. ఆవిడ ఇచ్చిన అనేక ఉపన్యాసాలు ఉన్నాయి, వాటిల్లో ఒకటి ఇరవయ్యో శతాబ్దపు గొప్ప ఉపన్యాసాల జాబితాలో చేరింది. ఆ ఉపన్యాసం ఈ కింది ప్లేయర్ సాయంతో వినవచ్చు.

Great speeches of the 20th century - Margaret 
Thatcher: The lady's not for turning .mp3


ఇతర విశేషాలు 

 • ఇరవయ్యో శతాబ్దంలో మూడుసార్లు వరుసగా ఎన్నికైన బ్రిటిష్ ప్రధాన మంత్రి .
 • యూరోప్ లో మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి.
6 వ్యాఖ్యలు:

 1. నిజమేనండి, మార్గరెట్ థాచర్ గారి వాయుస్ లోనే ఆ కమేండ్ ఉన్నది. మనకి శ్రీమతి ఇందిరా గాంధీ గారు కూడా ఇలాంటి ప్రైం మినిష్టరే. ఇవ్వాళ దాకా ఇందిరా గాంధి లాంటి ప్రై మినిష్టర్ మరొకరు లేరు. ఈ విషయం ఆవిడ బతికున్నంత కాలం తెలియలేదు.... ఆ తరవాత వచ్చిన అనేక మంది ప్రైం మినిష్టర్ల వలన తెలిసి వచ్చింది. ఇందిరా గాంధి మాత్రమే "ఏకైక పురుష పుంగవుడిగా పేరొందిన ప్రైం మినిష్టరు" అని......


  మార్గరెట్ థాచర్ గారి ప్రసంగాలను చూస్తు వినాలని అనుకుంటే ఈ ఈ క్రింది లింకు నొక్కి యూట్యుబులో చూడవచ్చును.

  http://www.youtube.com/watch?v=gbCQMiXdcCw

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బ్రతికి ఉండగా ఎవ్వరూ గుర్తించరులెండి !! ఇందిరా గాంధీ రాజకీయాలకోసం తన వ్యక్తిగత జీవితాన్ని (ప్రేమించి పెళ్ళి చేసుకుని) కూడా కోల్పోయింది. నెహ్రూ చేసిన తప్పిదం వల్ల వాళ్ళ వంశం మొత్తం బాధ పడుతున్నారు.

  ఇండియా పాకిస్థాన్ లు విడిపోవడం గాంధీ కి ఇష్టం లేదు , ఇటు నెహ్రూ అటు జిన్నా లు కలిసి విడగొట్టేసారు. విడిపోయిన వాళ్ళు బాగుపడటం ఎక్కడా జరుగలేదు. బెర్లిన్ గోడే కూలిపోయినపుడు , తల్చుకుంటే వాఘా బోర్డర్ తీసేయలేమా ????

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మార్గరెట్ థాచెర్ ఇంకా జీవించే ఉన్నారు. ఇందిరాగాంధీతో పోలిక ఇద్దరూ మహిళలే. అక్కడే ఆగిపొయింది.ఇంతకంటే నాకు పోలిక పెద్దగా కలవటంలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. "....."బెర్లిన్ గోడే కూలిపోయినపుడు , తల్చుకుంటే వాఘా బోర్డర్ తీసేయలేమా ???"

  ఈ రెండిటికీ పోలికే లేదు. మొదటిది, బలంతో మదమెక్కి కొట్టుకుంటున్న ఒక జాతి ప్రపంచ యుధ్ధానికి ఒక్క ఏభై ఏళ్ళల్లో రెండుసార్లు కారణం అవటంతో కోపగించి ఒకే భాష కలిగిన జాతిని రెండుగా విడతీసి ఒక భాగాన్ని ఒక అసహజ సమాజంగా చెయ్యబొయ్యారు. వాళ్ళు అదిష్టం లేక, తమను రెండుగా చేసిన గోడను తమకు వీలు చిక్కినప్పుడు, నాలుగు దశాబ్దాల తరువాత పగలగొట్టారు,ఒకటే దేశం అయ్యారు. ఇక మనకున్న పక్క దేశం, మతం మాత్రమె ప్రాతిపదికగా వాళ్ళకి కావాలని లాక్కుని విడిపడ్డారు, మనకు శతృ దేశమై మన్ని పీడిస్తున్నది వాఘా బోర్డరు చక్కగా తీసెయ్యచ్చు, ఎప్పుడు, ఆ దేశం మళ్ళి లేవకుండా నడుం విరగ్గొట్టినప్పుడు మాత్రమే. అప్పటివరకూ తప్పనిసరిగా మన దేశానికి బోర్డర్లో చాలా గట్టి కాపల అవసరమే మరి. భారత్, పాకిస్తాన్ కలవటం ఉట్టి రొమాంటిక్ ఐడియా తప్ప నిజానికి ఎప్పటికీ జరగదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బ్రతికుండగా గుర్తించటానికి ఆవిడ చేసినదేదో గొప్ప పనులని నా ఉద్దేశం కాదు. పటేల్ గారు సెంట్రల్ పాకిస్తాను ఎలా లేకుండా చేశారో. అలాగే ఆవిడ చేసిన మంచి పనల్లా మనకి తూర్పు పాకిస్తాను లేకుండా చెయ్యటమే....ఆ తరవాత వచ్చిన ప్రైం మినిస్టర్లందరూ ఇంతటి సమర్ధవంతంగా పాకిస్తాన్ని నిలువరించలేక పోయారు....పోతున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.