ఘంటసాల పాటలు అంటే ఇష్టం లేనిదెవరికి! ఆయన పాడుతుండగా చూసే అదృష్టం ఈ తరం వారికి లేదు. ఆనాటి తరంలో కూడా అందరూ ఆ అదృష్టం చేసుకున్నదీ లేదు. ఆయన భువికేగి ఇప్పటికి దాదాపు నాలు దశాబ్దాలు అయినా, ఆయన పాటలను తలుచుకుని, విని ఆనందిస్తున్నారు అంటే ఆయన పాటలో ఉండే అందం, పొందిక కారణం.
సాంకేతికత మనలాంటి సామాన్యుల చేతికి వచ్చినాక, చెయ్యలేనిది ఏమిటి అనుకుని, తౌటు సంతోష్ కుమార్ ఘంటసాల గారు పాడుతున్నట్టుగా చేసిన ఎనిమేషన్ చూసి తీరవలసినదే. అద్భుతం. ఈ ఎనిమేషన్ కు ఎన్నుకున్న పాటకూడా ఎవర్ గ్రీన్ హిట్, ఘంటసాల గారు తన జీవిత కాలంలో పాడిన చివరి పాటలలో ఒకటి. భక్త తుకారాం సినిమా నుంచి దేవులపల్లి వారి కలం నుండి జాలువారిన, ఘనా ఘన సుందరా.
చూడండి యు ట్యూబ్ వీడియో.
వీడియో చూసి వదిలేయ్యకండి. ఈ కింది లింకు నొక్కి తయారుచేసిన సంతోష్ గారిని అభినందించండి.
ఆయన ఇటువంటి చక్కటి ప్రయోగాలు మరిన్ని చెయ్యాలి.
భక్త తుకారాం సినిమాలో పాటల వివరాలు ఈ కింది లింకు సహాయంతో చూడవచ్చు
పాటల వివరాలు క్లిక్
**********************
ఘంటసాల పాడుతున్న ఫోటోలు కర్టెసీ ఘంటసాల గానామృతం ఫేస్ బుక్ పేజీ
పై పేజీ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయగలరు
**********************
ఘంటసాల పాడుతున్న ఫోటోలు కర్టెసీ ఘంటసాల గానామృతం ఫేస్ బుక్ పేజీ
పై పేజీ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయగలరు
నేను మెడికల్ కాలేజి లో చదువుతూ ఉన్నప్పుడు మా హాస్టల్కి ప్రిన్సిపల్ ఘంటసాలగారిని తీసుకువచ్చేరు.(1952)ఆయన ఆర్చెస్ట్రా లేకుండా కొన్ని పాటలు పాడి .మమ్మల్ని ఆనందింపజేసారు.మళ్ళీ,1956లో వైజాగ్ స్టేడియం లో అర్కెస్ట్రాతో సహ ఆయన పూర్తి కచేరీ వినే అవకాశం కలిగింది.
రిప్లయితొలగించండిgood one.
రిప్లయితొలగించండి