26, డిసెంబర్ 2011, సోమవారం

జమున-జమునారాణి ఆంధ్ర ప్రభ ప్రకారం ఒక్కరే!

పైన  ఉన్నది ఆంధ్ర ప్రభ వారి వెబ్ సైటు నుంచి 

శనివారం గాయని శ్రీమతి జమునారాణి గురించి తెలుసుకుందామని గూగులిస్తూ ఉంటే ఆంధ్ర ప్రభ వారు ఆన్ లైన్లో ప్రచురించిన ఒక వ్యాసం దొరికింది. ఆ వ్యాసం బాగోగులు అంటూ చెప్పుకోవాల్సినవి  ఏమీ లేకపోగా, అక్కడ వారు ప్రచురించిన బొమ్మ చూసి ఆశ్చర్యపోయ్యాను. 

ఆంధ్ర ప్రభ వ్యాసంలో జమునా రాణి గారి గురించి వ్రాస్తూ, నటి జమున చిత్రాన్ని ప్రచురించారు. మన గాయనీ గాయకుల గురించిన జ్ఞానం ఒక పత్రికలో అదీ బాగా పాత పత్రిక ఐన  "ఆంధ్ర ప్రభ" లో ఇలా ఉండటం చాలా శోచనీయం. 

ఒక ప్రముఖ గాయని  గురించి ఒక పత్రిక వారు ఆమె ఫోటో కూడా ఏమిటో తెలియకుండా చోటు నింపటానికి తూ తూ మంత్రంగా వ్రాసిన వ్యాసం(!!) ఈ కింది లింకు నొక్కి చూడండి.

అక్కడ ఉన్న తేదీ ప్రకారం ఈ వ్యాసం(?) ఈ సంవత్సరం మే నెలలో ప్రచురించినట్టుగా తెలుస్తున్నది. పైన "Last updated" అని ఈరోజు తేదీ ఉన్నది. శనివారం నాడు, వారి  చేసిన తప్పు గురించి ఎద్దేవా చేస్తూ  నేను ఒక కామెంటు పెట్టాను.  అయినా సరే ఏ విధమైన స్పందన లేదు.   వాళ్ళ దృష్టిలో "Updated" అంటే ఏమిటో కదా!!

నా చిన్నతనం నుండి తెలిసి ఉన్న ఆంధ్ర ప్రభ పత్రిక ఈ రోజున ఆన్ లైన్ ఎడిషన్ పేరిట ఇలాంటి తప్పు చేస్తుందని  ఎప్పుడూ అనుకోలేదు. ఇటువంటి తప్పు ప్రింట్ ఎడిషన్లో కలలోనైనా జరిగే ఆవకాశం  ఉన్నదా!!!!!!! 


 ఇప్పటికైనా ఆంధ్ర ప్రభ వారు తాము చేసిన పొరబాటు సరిచేస్తారని ఆశిద్దాం. అసలు మేము అలా ఎక్కడ వేశాము అని బూకరించాకుండా , ఆ వెబ్ పేజీని పూర్తిగా సేవ్ చేసి ఉంచాను. 

అదే వెబ్ పేజీలో కింద చదువరులకు సూచన ఇస్తూ "వెళ్ళాలి" అని వ్రాయాల్సిన చోట 'వెల్లాలి' అని ప్రచురించారు. ఎంత కంప్యూటర్లో టైపు చేసినా ఒకసారి అది తప్పో ఒప్పో చూసుకోవద్దూ. పిల్ల జమీందార్ సినిమాలో తెలుగు మాష్టారు అందుకే అంత క్షోబించారు .  

జమునా  రాణి గారితో ఒక ఇంటర్వ్యూ యు ట్యూబులో దొరుకుతున్నది చూడండి. 



ఈ  పరిచయం/ఇంటర్వ్యూ మిగిలిన భాగాలు యు ట్యూబ్ లో ఉన్నాయి. పైన ఉన్న టి వి కార్యక్రమంలో, ఆ యాంఖర్ పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నాం  అన్న ఇంగితం లేకుండా వేసిన ఒక తుంటరి ప్రశ్నకు జమునారాణి గారు చక్కటి సమాధానం ఇచ్చారు. 
*****************************************************************************
వాళ్ళ సైటులో వారం రోజుల క్రితం నేను వాళ్ళు చేసిన తప్పు ఎత్తి చూపుతూ ఒక కామెంట్ పెట్టాను. కనీసం అది చూసి ఏమన్నా సరిచేసారేమో అని ఇవ్వాళ (30 12 2011) చూస్తె ఎలా ఉన్న తప్పు అలాగే  ఉన్నది.  కనీసం ఆ పత్రిక సంపాదక వర్గం అనే పేర్తో ఎవరో ఒకరు ఉండి ఉంటారన్న ఆశతో, ఒక  మెయిలు వాళ్లకి పంపాను. ఆ మెయిలు నకలు ఈ కింద ఇవ్వబడినది.  

From: SIVARAMAPRASAD KAPPAGANTU
Date: 2011/12/30
Subject: మీ ఆన్ లైన్ పత్రికలో తప్పు
To: feedback@andhraprabha.in


గౌరవ సంపాదక వర్గానికి నమస్కారం

ఈ  మధ్య (ఒక వారం క్రితం అనుకుంటాను)  గాయని జమునా రాణి గురించి గూగులిస్తూ ఉంటే మీ పత్రికలో మే, 2011  లో వ్రాయబడ్డ ఒక వ్యాసం వంటిది కనపడింది. ఆ వ్యాసం బాగోగుల గురించి చెప్పుకోవాల్సినదే ఏమీ లేకపోయినా, ఆ వ్యాసానికి వేసిన ఫోటో మాత్రం శుద్ధ తప్పు. ఈ  కింది  లింకు నొక్కి చూడగలరు:

http://www.prabhanews.com/happybirthdays/article-109375#.TvW4xO6kcsU.email

ఈ  వ్యాసం వ్రాసిన మనిషికి కాని, ఆ వ్యాసాన్ని, ఎడిట్ చేసిన పెద్ద మనిషికి కాని, వెబ్ లోకి అప్లోడ్ చేసిన వాళ్లకి కాని ఏ ఒక్కళ్ళకి కూడా గాయని జమునా రాణి, నటి జమున ఒక్కరు కాదన్న కనీస జ్ఞానం ఉన్నట్టుగా లేదు. పత్రికల్లో ఇంత తెలియని వాళ్ళు పనిచేస్తున్నారా అనిపించి, ఈ  విషయాన్ని నా బ్లాగులో కూడా వ్రాశాను. మీ వెబ్ పేజీలో ఒక కామెంటు పెట్టాను. ఇన్ని రోజులు గడిచినాయి. అయినాసరే,చదువరులు వ్రాసిన కామెంట్ చూసి చేసిన తప్పు దిద్దుకునే సామర్ధ్యం మీ పత్రికకు ఉన్నట్టు లేదు. లేదా, చదువరులు చెబితే మేము వినటం ఏమిటి, మేము ఏది వ్రాస్తే అదే వార్త అన్న భ్రమలో ఉన్నారా అర్ధం కావటం లేదు.

ఈ  మధ్య కుక్క గొడుగుల్లా  వస్తున్న మరే పత్రికలో   ఇటువంటి పొరబాటు జరిగితే, వీళ్ళు ఇంతే  అజ్ఞానులు అనుకునే ఆవకాశం చదువరులకు ఉన్నది. కాని దశాబ్దాలుగా  చదువరుల ఆదరాభిమానాలు చూరగొన్న ఆంధ్ర ప్రభ పత్రికకా  ఈ  గతి!!   అకటా! ఎటువంటి రోజులు వచ్చినాయి?

ఇవ్వాళ, కనీసం పొరబాటు సరిచేసుకున్నారేమో అని మళ్ళి చూశాను. పొరబాటు అలాగే ఉన్నది. కనీసం మీ వెబ్ సైటులో contact ఈ  మెయిలు ఇచ్చారు. ఇక్కడకు సమాచారం ఇస్తే ఏమన్నా ఫలితం ఉండవచ్చు అని సన్నని ఆశ రెపరెపలాడి ఈ  మెయిలు మీకు  ఇస్తున్నాను.

మీ దగ్గర నుంచి జవాబు వస్తుందని ఆశపడటం, ఉట్టి  భ్రమ అని తెలుసు కాని అలా ఆశపడటంలో  తప్పులేదని మీరు అంగీకరించగలరని నా భావన.

--
శివరామప్రసాదు కప్పగంతు
SIVARAMAPARASAD KAPPAGANTU
బెంగుళూరు భారత్ నుండి
FROM BANGALORE, INDIA
http://naablaagulu.blogspot.com/
 

*****************************************************************************
పై  మెయిల్ పంపిన కొద్ది క్షణాల్లో గూగుల్ వారు మెయిలును తాము డెలివర్ చెయ్యలేమని తిప్పి పంపారు. కారణం ఆంధ్ర ప్రభ వారి ఫీడ్ బాక్ సిస్టం అలా ఉన్నదన్న మాట. ఏదో తూ తూ మంత్రంగా ఫీడ్ బాక్ అనటమే  కాని   అది పనిచేస్తున్నదా, లేదా అప్పుడప్పుడూ చూడటం,  అక్కడకు వచ్చిన మైళ్ళకు సమాధానం ఇవ్వటం వంటి మర్యాదలు వీరికి ఉన్నట్టు లేవు. ఏమున్నది ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలకు, ప్రవైటులో అద్భుతాలు చేస్తామంటున్న వారికి తేడా ఏమున్నది?

From: Mail Delivery Subsystem <mailer-daemon@googlemail.com>
Date: 2011/12/30
Subject: Delivery Status Notification (Failure)
To: vu3ktb@gmail.com


Delivery to the following recipient failed permanently:

    feedback@andhraprabha.in

Technical details of permanent failure:
Google tried to deliver your message, but it was rejected by the recipient domain. We recommend contacting the other email provider for further information about the cause of this error. The error that the other server returned was: 550 550 5.7.1 Unable to relay for feedback@andhraprabha.in (state 14).

----- Original message -----

Received: by 10.204.133.207 with SMTP id g15mr9009935bkt.17.
1325245830285;
 Fri, 30 Dec 2011 03:50:30 -0800 (PST)
MIME-Version: 1.0
Received: by 10.204.112.18 with HTTP; Fri, 30 Dec 2011 03:50:09 -0800 (PST)
From: SIVARAMAPRASAD KAPPAGANTU <vu3ktb@gmail.com>
Date: Fri, 30 Dec 2011 17:20:09 +0530
Message-ID: <CAPwTHah8k524MqSptE-GZ8Fn7aQf4JCKuQv3QoR4VHsRkvNsEw@mail.gmail.com>
Subject: =?UTF-8?B?4LCu4LGAIOCwhuCwqOCxjSDgsLLgsYjgsKjgsY0g4LCq4LCk4LGN4LCw4LC/4LCV4LCy?=
       =?UTF-8?B?4LGLIOCwpOCwquCxjeCwquCxgQ==?=
To: feedback@andhraprabha.in
Content-Type: multipart/alternative; boundary=0015175cd088f44b2b04b54dd6c2

1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.