24, డిసెంబర్ 2011, శనివారం

శాంటాక్లాస్ IS COMING TO TOWN

 పాశ్చాత్య  దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో క్రిస్మస్ పండుగను ఎంత సరదాగా జరుపుకుంటారో వాళ్ళ సినిమాలు చూసి ఎంతైనా సరదా పడుతూ ఉంటాము. అలాగే రష్యాలో  కూడా "చుక్ గెక్" అన్నదమ్ములు కథ వంటి పిల్లల పుస్తకాలు చదివి అక్కడ కూడా ఈ పండుగ జరుపుకునే వారు (జరుపుకోనిచ్చేవారు)  అని తెలుసుకుని సంతోషించటం జరిగింది.ఈ పండుగలో  క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టటం ఆ చెట్టు అలంకరణ, క్రిస్మస్ బహుమతులు ముఖ్య ఆకర్షణలు. పిల్లలకు ఈ పండుగ ఒక పెద్ద సరదా, అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నలు తమకేమి బహుమతులు ఇస్తారా అని ఎదురు చూడటం సంవత్సరం పోడుగున్నా జరుగుతూ ఉంటుందని  అనేక కథలు చదివి, సినిమాలు చూసి తెలుసుకున్నాం. క్రిస్మస్ కు సంబంధింనదే శాంటాక్లాస్ కథ. ఈ శాంటాక్లాస్ ముసలి తాత లాగ కనపడుతూ, క్రిస్మస్ బహుమతుల సంచీ  భుజాన వేసుకుని, రైన్ డీర్ లాగుతున్న స్లెడ్జ్ బండీ (క్రిస్మస్ సమయంలో మంచు కురుస్తూ ఉంటుంది మరి)  ఎక్కి వస్తాడని కథ.  ఈ శాంటాక్లాస్ తమ ఇంటి చిమ్నీ నుండి (వంటింటికి ఒకప్పుడు ఉండే పోగ్గూడు) దిగి తమ బహుమతులను క్రిస్మస్ చెట్టుకు కట్టి వెళ్లి పోతాడని, తెల్లారంగానే తీసుకోవచ్చు అని పిల్లల ను సరదా పరుస్తారు. 

ఇదే కథను అనుసరిస్తూ పిల్లలు గొడవ చెయ్యకుండా, అల్లరి పెట్టకుండా ఉండాలని వాళ్లకు ఒక పాట పాడారు ఎడ్డీ ఆర్నాల్డ్. క్రిస్మస్  పాట అనంగానే  తమ మతం గొప్పతనం చెప్పుకోవటం కాకుండా, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళెలా ఉంటే శాంటాక్లాస్ వచ్చి వాళ్లకి బహుమతులు ఇస్తాడు అని అల్లరి పిల్లల్ని ఏమార్చటానికి ఈ పాటా చాలా బాగుంటుంది.

నాకు అభిమాన గాయకుడు అయిన ఎడ్డీ ఆర్నాల్డ్ పాడిన క్రిస్మస్ పాట   మీకోసం అందిస్తున్నాను.


ఈ పాట  సాహిత్యం మామూలు మాటలతో అనవసర పద గాంభీర్యం చూపకుండా పిల్లలకు హాయిగా అర్ధం అయ్యే రీతిలో ఉన్నది. 
Oh you better watch out you better not cry You better not pout I'm telling you why Santa Claus is comin' to town
He's a making a list checking in twice Gonna find out who's naughty and nice Santa Claus is comin' to town
He sees you when you're sleeping he knows when you're awake He knows when you've been bad or good so be good for goodness sake
Oh you better watch out you better not cry You better not pout I'm telling you why Santa Claus is comin' to town
With a little tin horn and a little toy drums A root a toot toot and a rum a tum tums
And curly head dolls that cuddle and coo Elephants boats and kiddie cars too Santa Claus is comin' to town
The kids and girls in boyland will have a jubilee They're gonna build a toyland town all around the Christmas tree
Oh you better watch out you better not cry You better not pout I'm telling you why Santa Claus is comin' to town Santa Claus is comin' to town

ఈ కింది లింకు నొక్కి 25 12 2011 మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఒక శాంతా క్లాస్ వాల్ పేపర్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవచ్చు

శాంటాక్లాస్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.