24, మే 2012, గురువారం

అలనాటి అద్భుత రేడియో కార్యక్రమం "బావగారి కబుర్లు"


బావగారి కబుర్ల ద్వయం శ్రీ చివుకుల రామమోహనరావు గారు, శ్రీ నండూరి సుబ్బారావుగారు
(PHOTO COURTESY SHRI N SASIMOHAN)

ఒకప్పటి మంచి కాలాన్ని చూసిన తరువాత ఆ మంచి కాలాన్ని "అవ్వొక రోజులూ" అనుకోవటం సహజమే. ఈ మధ్య కాలంలో, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రతిరోజూ వచ్చే ఒక అద్భుత కార్యక్రమం "బావగారి కబుర్లు" మాటి మాటికీ గుర్తుకు వస్తున్నది. అప్పట్లో అంటే 1971 దాదాపు 1975 వరకూ బావగారి కబుర్లు అనే సంభాషణ మీద ఆధారపడిన ఒక కార్యక్రమం సాయంత్రం ఆరు ఏభైకి అనుకుంటాను ఒక పదినిమిషాలు వచ్చేది. ఆ కార్యక్రమానికి ఆద్యులు అలనాటి అద్భుత రేడియో కళాకారులు శ్రీయుతులు నండూరి సుబ్బారావు గారు, చివుకుల రామమోహనరావు గారు. వీళ్ళిద్దరూ కూడా స్క్రిప్ట్ వ్రాసుకునేవారో లేక అప్పటికప్పుడు వాళ్ళకు ఇవ్వబడిన విషయం మీద చక్కగా మైక్ ముందు కూచుని ఈ కబుర్లు కార్యక్రమం నిర్వహించేవారో తెలియదు కాని, వినటానికి మాత్రం ఎంతో సొంపుగా ఉండి అప్పటి రాజకీయాలు, ఇతర విషయాల మీద ఎంతో ఆసక్తి కలిగించేవాళ్ళు.
ఈ ఇద్దరూ కలిసి 1971 యుధ్ధం జరుగుతున్నప్పుడు, బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగినప్పుడు అంటే డిసెంబర్ 1971 లో ఆ యుధ్ధ వార్తలు, విశేషాలు, తమ కబుర్ల ద్వారా ప్రజల్లోకి ఎంతో చక్కగా తీసుకుని వెళ్ళారు.నండూరి సుబ్బారావుగారు బావగారూ అంటూ పిలవటం, వెంటనే రాం మోహనరావు గారు అందుకుని సంభాషణ మొదలు పెట్టటం చాలా బాగుండేది.

అప్పటి ఆ బావగారి కబుర్లు కార్యక్రమాలన్నీ కూడా రికార్డ్ చేసి జాగ్రత్తగా పదిలపరిచి ఉండి ఉంటే అప్పటి చరిత్ర మొత్తం ఇప్పటి తరానికి చక్కగా అవగతమయ్యేది.కాని మనకు ఆ అదృష్టం ఏది, ఆకాశవాణి అధికార్లకు ముందు చూపు లేక అప్పటి రికార్డింగులన్నీ కూడా చెరిపేసి తరువాతి కార్యక్రమాలకు వాడేసుకున్నారుట.బావగారి కబుర్లు కార్యక్రమం, విజయవాడ కేంద్రం నుండి కొన్ని సంవత్సరాలు ప్రసారం అయ్యినా, ఒక్క రికార్డింగ్ కూడా వాళ్ళ దగ్గర లేదుట ఇప్పుడు. అసలు మన ఆకాశవాణి వారికి ఆర్ఖైవ్స్, ఆ ఆర్ఖైవ్స్ కుండవలసిన విధి విధానాలు ఎంత మాత్రం తెలిసినట్టుగా లేవు. అప్పటి అధికార్లు కొద్దిగా ముందు చూపు చూపించి ఉంటే ఎన్నెన్నో అద్భుత మైన రేడియో కార్యక్రమాలు మనకు ఇవ్వాళ దొరికేవి. నెట్లో వేరే దేశాల రేడియో కార్యక్రమాలు ఎప్పటివో 1930ల నుంచి కూడ కనపడుతూ ఉంటే అసూయ కలుగుతుంది.

సరే ఎంత బాధపడి ప్రయోజనం ఏమున్నది. అప్పటి ఆ బావగారి కబుర్ల ద్వయం శ్రీ నండూరి సుబ్బారావు మరియు చివుకుల రాం మోహనరావు గార్లను ఈ బ్లాగ్ ద్వారా తలుచుకుని ఆనదించటమే గొప్ప పని ఈ రోజున.

ఇంకా ముంబాయిలో స్థిరపడలేదు, ఇంటర్నెట్ లేదు ఇంట్లో, అయినా సరే పైనున్న అపురూపమైన ఫోటో దొరికిన ఆనందంలో ఎల్లాగోలా ఈ పోస్ట్ వేసేశాను

7 కామెంట్‌లు:

  1. ‘ఏమండోయ్ బావగారూ.. ’; ‘ఆ..రావాల్రావాలి’ అంటూ మొదలయ్యే ఈ కార్యక్రమం చిన్నప్పటి చక్కని జ్ఞాపకం. ఈ కార్యక్రమం సిగ్నేచర్ ట్యూనేనా ‘ఈల’? దాని బాణీ మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది.

    రిప్లయితొలగించండి
  2. బావగారి కబుర్లకు ఆద్యులు శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి మరియు శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ శాస్త్రి గార్లు అని గమనించండి

    రిప్లయితొలగించండి
  3. సుధామ గారూ నాకు తెలియని విషయాన్ని తెలియచేసినందుకు కృతజ్ఞతలు. ప్రయాగ గారివి, తాడేపల్లి వారివి ఫొటోలు మీ దగ్గర ఉంటే పంపగలరు. బావ గారి కబుర్లు కార్యక్రమం ఆద్యులైన వారి గురించి రేడియో అభిమాని బ్లాగులో ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది.

    నాకు తెలిసేప్పటికి బావగారి కబుర్లు నండూరి సుబ్బరావు, సి రాం మోహనరావుగార్లు మాత్రమే చేస్తున్నారు.

    ఎప్పుడో బాగా చిన్నతనంలో ప్రయాగ వారి వినోదాల వీరయ్య విన్నట్టు లీలగా జ్ఞాపకం.

    వేణు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఇప్పటి 'డీడీ 'కంటే
    అప్పటి 'ఆకాశవాణి' అద్భుత ,మది మీ
    కిప్పటికీ స్మృతి పథమున
    చొప్పడి యుండుటలు చూడ చోద్యం బయ్యెన్.

    బ్లాగు : సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  5. లక్కాకుకల వారికి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. హెడ్డింగు చూసి ఆ ఆడియోలు ఉన్నాయేమో అనీ మహా సంబరపడిపోయాను. ప్చ్! ఏం చేస్తారు మీరు మాత్రం. ఆ "ఆకాశవాణి" గొప్ప అవకాశాన్ని మనకు దక్కకుండా చేసినందుకూ -- దాన్ని నడ్డి మీద చంపెయ్యాలి.
    gksraja.blogspot.com

    రిప్లయితొలగించండి
  7. "నడ్డి మీద చంపెయ్యాలి"

    అవును నిజం నిజం, ఆకాశవాణి పలికింది

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.