11, ఆగస్టు 2012, శనివారం

ఈనాటి మీడియాను నమ్మవచ్చునా

పాఠకుని/ప్రేక్షకుని కళ్ళు నోరు మూసివేస్తున్న మీడియా
 పై బొమ్మ మాల్దీవ్స్ కు చెందిన "హసన్ లైవ్ " అనే బ్లాగు నుండి గ్రహింపబడినది. ఆయన వ్రాసిన ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి స్వేచ్చాయుతమైన మీడియా (చదవటానికి క్లిక్ చెయ్యండి) అన్న వ్యాసం చిన్నదైనా చాలా చక్కటి అభిప్రాయాలను కలిగి ఉన్నది.

 ఒక్కొక్క పత్రికకు చానెల్ కు ఒక్కొక్క  ఎజెండా, కొన్ని పత్రికలైతే ఎంత మాత్రం సంకోచం లేకుండా ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఉండటం  చూస్తూనే ఉంటాము. ఆ విధంగా పత్రికా స్వేచ్చ పేరిట ఎవరి "పొయ్యి" వాళ్ళు వెలిగించి "ప్రచారాన్ని"  వార్తల పేరిట మన నెత్తిన రుద్దుతూ, ఇదే పత్రికా స్వేచ్చ  అని కూడ నమ్మబలుకుతున్నారు. అటువంటి మీడియాను ఎంతవరకూ నమ్మవచ్చు. ఈ మీడియాలో ఇప్పుడు కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నది కాని, చాలా వరకు చైనా-రష్యాలు కమ్యూనిజంగా ప్రచారం చేసే ఒక ఇజం అంటే పడి చచ్చే  వాళ్ళు ఎక్కువగా ఉండి, వాళ్ళు తమ తమ వాక్‌-స్వాతంత్ర్యం, లేదా తమ అభిప్రాయాలను వెల్లడించే స్వతంత్రం పేరిట, ప్రచురించాల్సిన  వార్తలను వామపక్ష వాదనే అద్భుతమైనది అనేటువంటి శబ్దం వచ్చేట్టుగా దశాబ్దాలు పాటు తమ తమ పత్రికా రచన చేశారు. కాని పాపం వాళ్ళ వ్రాతలు నీటి మీద వ్రాతలయినాయి ప్రజలు అది ప్రోపగాండాలో భాగం అని మొదటినుంచీ గమనించి తమకు కావలిసినది మాత్రమే పత్రికలనుండి తీసుకోవటం అలవాటు చేసుకున్నారు.

మన ఆకాశవాణి కూడా మొదటి నుంచి, ప్రభుత్వ పరంగానే తమ ప్రసారాలను కొనసాగించింది. సహజంగా ప్రభుత్వ సంస్థ అవటం వల్ల, అది వాళ్ళకు తప్పలేదు. ఆల్ ఇండియా రేడియోని ప్రభుత్వం కొమ్ము కాస్తున్నది అని విమర్శించిన పత్రికలే, దూరదర్శన్ ప్రభుత్వ వాణి అని నిరసించిన చానెళ్ళే, ఈ రోజున ఏమి చేస్తున్నాయి? తమ పధ్ధతిలో తమ తమ "ప్రచారాలను" వార్తలుగా మన మీదకు వదులుతున్నారు. ఇటివంటి మీడియాను నమ్మవచ్చా?

ఒకప్పుడు వార్తను వార్తగానే ప్రచురించేవారు. ఇప్పుడు  అలా కాదు, ప్రతి వార్తలోనూ అది వ్రాసిన వ్యక్తి లేదా ఆ పత్రికాధినేత అభిప్రాయాలను జొప్పించి మరీ పాకేజీ చేసి మన మీద ప్రయోగిస్తున్నారు.
ఈ రోజున పత్రికలకు సంపాదకులు అన్న మాట లేకుండా పొయ్యింది. పత్రికాధిపతులకు "స్టెనో" లుగా  మారిపోయి, ఆ అధిపతులు ఏ పక్కకు వ్రాయమంటే ఆ పక్కకు సంపాదకీయాలు వ్రాయబడుతున్నాయి . ఈ మీడియాను నమ్మవచ్చా !! ఇదా పత్రికా స్వేచ్చ అంటే!! ఇది పత్రికా స్వేచ్చ కాదు, పత్రికాధిపతుల స్వేచ్చ తప్ప మరొకటి కాదు.

పాఠకులకు నిజాలను తెలుసుకునే హక్కు ఉన్నట్టుగా ఈ పత్రికా స్వేచ్చ పండితులకు తట్టినట్టు లేదు. ఇప్పటికే చాలా మంది పత్రికలను చదవటం, వార్తా చానెళ్ళను చూడటం  ఆరోగ్యరీత్యా మంచిది కాదని నిర్ణయించుకున్నారు. 


మరికొంత కాలం పోతే, పత్రికా స్వేచ్చ కోసం, ప్రజలు మీడియాతోనే  పోరాడాల్సిన విపరీతపు పరిస్థితులు  ఏర్పడబోతున్నాయి అనటానికి, ప్రస్తుతపు మీడియా ధోరణే ఉదాహరణ అని బాధతో భవిష్యత్తును ఊహించుకోవల్సి వస్తున్నది.

ఫేస్ బుక్ లో ప్రస్తుతం చైనా వాళ్ళు ప్రసారంచేసే వార్తల్లో నిజం ఎంత అన్న విషయంలో కొంత చర్చ జరుగుతున్నది. అందులో ఆ చైనా రేడియోలో ఐదేళ్ళు పనిచేసిన కీత్ పెరాన్ ఈ చర్చ మొదలు పెట్టారు. ప్రస్తుతం తమ ప్రచార పంథాను  కొంత మార్చుకుని, తమ టి వి లోనూ, రేడియో లోనూ, బయట దేశాలకు తమ వార్తలు నిజమే అనిపించటానికి తెల్ల వారిని తీసుకుని వారిచేత తమ "ప్రోపగాండా" చదివిస్తున్నారుట. వాళ్ళు డబ్బుకోసం ప్రాకులాడి, ఆ ప్రోపగాండా చదివేస్తున్నారుట. 

ఈ క్రింద చైనా మీడియా మీద జరుగుతున్న చర్చలో  వచ్చిన అభిప్రాయాలను చూడవచ్చు: 
Hi Keith, I totally agree with you, it is...
Thomas J. Passage Jr. 11 ఆగస్టు 00:34
Hi Keith,

I totally agree with you, it is extremely difficult to live in a world, where media people report stories and facts that are not true.


Keith keep up the good work, we need to be able to trust one another. I am extremely happy that, I am not raising small children today. Please believe me, I am deeply concerned about the young people of today, including my 9 year old grandson.


Your listener,


Tom Passage
వ్యాఖ్యల చరిత్ర
Michael Stevenson
Michael Stevenson10 ఆగస్టు 14:45
I am afraid that money comes first with most people these days, they never stop to think about who it may affect in the process!
Victor Goonetilleke
Victor Goonetilleke10 ఆగస్టు 08:29
Well when we listen to CRI we start by telling us that there is no editorial freedom there. Definitely by hiring foreign announcers and I am sure better educated Chinese for the English Service it is pleasanter to listen to them. Also there is a huge change in the style and content of the programming. As to the facts I am always cautious when I listen. Each station/country has its bias and CRI is pushing its agenda, much nicer in its packaging than before.
Dan Hensley
Dan Hensley10 ఆగస్టు 07:49
Keith, thanks for bringing all of this out in the open. As someone who, from an early age has had a love for China, it's people, language, food, culture, and music, I find what you said very useful because as an American I only know what I hear on CRI and CCTV programming since I have not yet visited China or traveled outside of the U.S.

I should ask the important question now: As someone in my position and from my vantage point, how easy would it be to spot made up facts / propaganda as opposed to truth when it comes to China?
Sivaramaprasad Kappagantu
Sivaramaprasad Kappagantu10 ఆగస్టు 07:18
Well Said Keith

శివరామప్రసాదు కప్పగంతు SIVARAMAPARASAD KAPPAGANTU

ముంబాయి భారత్ నుండి
FROM MUMBAI, INDIA
http://naablaagulu.blogspot.
com/
Keith Perron
Keith Perron10 ఆగస్టు 07:13
All they did was hire local English teachers.
View All Comments
Original Post
Keith Perron
Keith Perron10 ఆగస్టు 06:52
I have to admit and be totally honest. But I don't have much respect for any of the foreigners who work for China Radio International and CCTV. Now while it's true I worked at CRI for just over 5 years. From the onset I told them if at anytime they would ask me to read a story that was nothing but propaganda I would walk. Anytime I was given a story to read during a newscast that was rubbish and made up facts I would walk. I have been watching the news programming out of Washington by CCTV International. I'm afraid any of the credibility that foreign presenters had will be lost. During my time at CRI, they even on a few occasions try to pay me more money to read certain items. Did I? Not a chance. I remember when I was at CRI in the English Service there were 14 other foreigners. And they would just do what they were told. This made me sick at times. There was one exception. Jocelyn Ford. She was like me and had principles. I watched the CCTV International news program out of Washington and found 7 stories with facts made up. And that stupid white guy who is hosting doesn't have a problem with that? As far as I'm concerned his credibility is shot. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.