19, జూన్ 2012, మంగళవారం

ఒక విషాద వార్త - ఆగిపోనున్న రేడియో నెదర్లాండ్స్ ఆంగ్ల ప్రసారాలు


నాకు ఎంతో ప్రీతి పాత్రమైన విదేశీ రేడియో స్టేషన్ రేడియో నెదర్ లాండ్స్ మరియు వారి  ఆంగ్ల ప్రసారాలు. వారి డచ్ కార్యక్రమాలు  ప్రసారం చేస్తారు కాని మనకు అర్ధం కావుకదా. డచ్ ఈస్ట్ ఇండీస్ గా పేరొందిన ఆసియాలో ఉన్న కొన్ని దేశాలలో  డచ్  ఇంకా అర్ధం చేసుకోగలిగిన వారు ఉండటం వలన (మన పాండిచ్చేరీ లో ఫ్రెంచ్ బాష అర్ధచేసుకోగల  ఉన్నట్టుగా,  అంతెందుకు మనదేశంలో ఆంగ్లం ప్రాచుర్యంలోనే ఉంది కదా) వారికోసం డచ్ కార్యక్రమాలు కొన్ని గంటలపాటు ప్రసారం చేస్తూనే ఉన్నారు.

మిగిలిన దేశాల వారికోసం ఆంగ్ల ప్రసారాలు కొన్ని దశాబ్దాలుగా రేడియో నెదర్లాండ్స్ వారు చేస్తూ, భారత్ లో వారి శ్రోతల సౌకర్యార్ధం ఒక పోస్ట్ బాక్స్ చిరునామా కూడా ఉంచి మన   స్పందనలను తెలుసుకుంటూ  వారి కార్యక్రమ సరళిని విశ్లేషిస్తూ  సమీక్షించు కుంటూ ఉండే వారు.

ఈ రేడియో నెదర్ లాండ్స్ ఆంగ్ల ప్రసారాలు దాదాపు 1970 లనుండి కూడా వింటూ ఉండేవాడిని, ప్రస్తుతం ఇంటర్నెట్ లో వింటున్నాను. గత  కొద్ది రోజులుగా ఇంటర్నెట్ కు దూరంగా ఉండాల్సి రావటం వల్ల, ఒక దుర్వార్త నా చెవిన పడలేదు కాని ఈ రోజున తప్పలేదు. అదేమిటి అంటే, రేడియో నెదర్లాండ్స్ వారు, వారి ప్రభుత్వ బడ్జెట్ లేక వారి ఆంగ్ల ప్రసారాలను ఆపేస్తున్నారుట. ఈ   జూన్ 29 2012 నుండి ఇక రేడియో నెదర్లాండ్స్ ఆంగ్ల ప్రసారాలు ఉండవు. 

ఈ విషయం మీద పూర్తి  వివరాలు ఈ కింది లింకు నొక్కి చదువు కోవచ్చు.


రేడియో నెదర్లాండ్స్ వారు, వారి ప్రసారాలను ఆపేస్తున్న వార్త  చెబుతూనే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి శ్రోతల నుండి వారి వారి జ్ఞాపకాలను, ఈ విషాద వార్తకు స్పందించాలని కోరారు.  ఈ విషయంలో నేను నా స్పందనను ఈ కింది విధంగా  తెలియ చేసాను.

నా స్పందన  
What a pity! Closing down the English service of Radio Nederlands!!?? Due to Budget Cuts. Barbarous to state it mildly.  I never knew that there was a country called Netherlands and a language called Dutch until I heard Radio Nederlands. 
 I have fond memories of Radio Nederlands right from 1970s of such excellent programmes like Dx Juke Box, His and Hers.  My all time favorite was Happy Station by Tom Mayer which too stopped.

It appears all good things have to go and Radio Nederlands is not an exception to that sad dictum of the world. As long as it was coming, I have been enjoying Radio Nederlands programmes. My sincere request to you is that please keep an MP3 of your last broadcast so that we can fondly hear it for some more time, recollecting the nostalgic memories of Good
Old RADIO NEDERLANDS.

If as a Listener, my word counts with your Government, My vote is to keep the budget coming to Radio Nederlands and continue the English Broadcasts, instead of posting numerous bureaucrats across the world as so called Envoy or Ambassador to create good will about your country.  These bureaucrats can never, I repeat never, create during their entire service even 1/10000th good will Radio Nederland creates in one day.

May God Bless all the Staff of Radio Nederlands.

SIVARAMAPRASAD KAPPAGANTU
FROM INDIA.

I AM 55 YEARS YOUNG.



ఈ బ్లాగు ద్వారా ఈ వార్తను తెలుసుకున్న వారిలో రేడియో నెదర్లాండ్స్ ఆంగ్ల ప్రసారాలు పరిచయం ఉన్న వారు, వారి స్పందనను, జ్ఞాపకాలను పైన ఇచ్చిన లింకు ద్వారా రేడియో నెదర్లాండ్స్ వారికి తెలియచేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.




  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.