12, ఆగస్టు 2012, ఆదివారం

సెక్యూరిటీ అంటే!!




సెక్యూరిటీ  అంటె ఏమిటి? పై బొమ్మలలో చూపించేదేనా లేక మరేమన్నా ఉన్నదా.  దాదాపుగా  రెండు దశాబ్దాల నుండీ కూడ మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య టెర్రరిజం. ఆ పక్కన ఉన్న దేశానికి చెందిన వాళ్ళు ఇక్కడకు రావటం వాళ్ళు దాడి చెయ్యటం, లేదా ఇక్కడే ఉండి మన మధ్య మనవాళ్ళలాగే ఉన్నవాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళచేత చెయ్యకూడని పనులు చేయించటం వల్ల దేశం అనేక సార్లు అతలాకుతలం అయిపోయింది. చివరకు మనం మన నీడను చూసి భయపడె దశకు చేరుకుని, ఎక్కడ చూసినా సెక్యూరిటీ చెక్‌లు, సి సి కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, వాసనతో బాంబులను పసిగట్టె కుక్కలు. ఇదీ ఇవ్వాళిటి పరిస్థితి.

ఇదంతా దేనికి,ఏమన్నా దాడి మళ్ళి జరగకుండా ఉండటానికి తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు. కాని నిజమైన సెక్యూరిటీ అంటే ఏమిటి? రాకూడని వాళ్ళు దేశంలోకి వచ్చేసి, ఇక్కడి వాళ్ళను రెచ్చగొట్టి లేదా తమంత తామే చెయ్య కూడని పని చెయ్యబూనితే  ఈ సెక్యూరిటీ చెక్ లో పట్టుకోవాలని ఈ హడావిడంతానూ!!! అయినా సరే అనేకసార్లు దాడులు జరుగుతూనే ఉన్నాయి. కారణం?!

నిజమైన సెక్యూరిటీ అంటే నాకు చాలా కాలం క్రితం ఇజ్రాయిల్ గురించిన ఒక జోక్ గుర్తుకు వస్తున్నది. 
ఇజ్రాయిల్ కు తూర్పు పక్కన అరబ్బులు, పశ్చిమాన అరబ్బులు, ఉత్తరాన అరబ్బులు దక్షిణాన అరబ్బులు, దేముడు అరబ్బులను రక్షించుగాక. చుట్టూ తమ దేశాన్ని ద్వేషించే దేశాలను ఇరుగు పొరుగుగా ఉన్న ఇజ్రాయిల్, తమ బధ్రత ఎలా  కాపాడుకున్నతో ఒక జోక్ లాగా చెప్పినా నిజ పరిస్థితి అదే.   

 నువ్వు నన్ను తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో  కొడతాను అన్నదే ఇజ్రాయిల్ విధానం. అలా తమ దేశాన్ని అసలైన సెక్యూరిటీ విధానం తో రక్షించుకునే దమ్ము ఉన్నది కాబట్టే ఆ దేశం మనగలిగింది. ఈ విషయంలో భారత్, ఇజ్రాయల్ నుండి నేర్చుకోవాలిసినది ఎంతైనా ఉన్నది. ఊరికే సిబ్బంది కి ట్రైనింగ్, ఆయుధాల కొనుగోలు మాత్రమె కాదు!!   ఆలోచనా విధానంలో రావాలి ఆ మార్పు, మనదేశం మీద ఇతర దేశాలు దాడి కావచ్చు టెర్రరిస్టు దాడి కావచ్చు ఏదైనా సరే జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు చిన్న దేశమైనా ఇజ్రాయిల్ దగ్గర  నేర్చుకోవాలి.

భారతదేశం టెర్రరిజపు దాడులును ఎలా ఎదుర్కొంటున్నదో, నవ్వులాట చేసిపారేసి,  భారత సంతతికి చెందిన ప్రముఖ కెనడియన్ కమీడియన్, రస్సెల్  పీటర్స్ చెప్పిన విధానం చూడండి.  కాని నిజానికి మన సెక్యూరిటీ/విదేశాంగవిధానం రస్సెల్ పీటర్స్ నవ్వులాటకు చెప్పినట్లె ఉన్నది: 

ఎవరైనా సరే మనదేశపు దిక్కుగా చూస్తే దానికి  తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, మనకు జరిగిన నష్టానికి వందరెట్లు నష్టం వాళ్ళకు  కలుగుతుంది అన్న స్థితి తీసుకు వచ్చినపుడే నిజమైన సెక్యూరిటీ. అంతే కాని మనం  పావురాలు ఎగరేస్తూ, కొవ్వొత్తులు  వెలిగిస్తూ కాలం గడిపితే సెక్యూరిటీ అనేది ఎప్పటికీ మనకు రాదు.

ఈ సెక్యూరిటీలో మీడియా పాత్ర ఉన్నదా ఉంటే అది ఏమిటి? విషయంలో మీడియా పాత్ర పూర్తిగా గర్హనీయమైనది. ఇది చూపించవచ్చు ఇది చూపించకూడదు అన్న కనీస ఇంగితం కూడ లేదు  పైగ ఒక ఓట్రింపు వాదన, మేము పోలీసు సిబ్బంది ఏర్పరిచిన పికెట్లు దాటి వెళ్ళలేదు కదా అని కుంటిసాకు. పాపం పోలీసులు జరుగుతున్న మారణ కాండలో మరికొందరు బలికాకుండా హడావిడిగా పికెట్లు ఏర్పరుస్తారు. అవ్వే మీడియాకు హద్దులు అనికోవటం మీడియా  అతితెలివి, తెంపరితనాన్ని సూచించటమే కాకుండా, సమాజం పట్ల మీడియా బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తుంది. ముంబాయి మీద 2008 లో టెర్రరిస్టు  దాడి జరిగినప్పుడు, ఆ టెర్రరిస్టులకు చెవులుగా కళ్ళుగా ఘనత వహించిన మన ఎలెక్ట్రానిక్ మీడియా పనిచేసింది. ఆరోజు రాత్రి రెండుగంటలకు నాకు విషయం తెలిసి టి వి పెట్టి చూద్దునుకదా,  నిర్ఘాంతపొయ్యే టి వి కవరేజీ. ఎంతసేపూ, పోలీసులు, వాళ్ళ దగ్గర్నున్న ఆయుధాలు, పోలీసులు కాక ఇంకా ఏ ఏ సెక్యూరిటీ  సంస్థలకు చెందిన సైనికులు రంగంలోకి దిగుతున్నారు, వాళ్ళు ఏ వాహనాల్లో వస్తున్నారు, వాళ్ళు ఏ ఏ ఆయిధాలతో ఉన్నారు, ఎటునుంచి వస్తున్నారు వంటి విషయాలను లైవ్ కవరేజీలో చూపించి పారేశారు. వళ్ళు మండిన నేను అన్ని టి వి చానెళ్ళకు మైలు ఇచ్చాను, "మీరు భారత్ పక్కనా, లేక టెర్రరిస్టుల తరఫునా" అన్ని. నాలాగే కొన్ని వేల, వేల  మైళ్ళు మీడియా కు చేరినాయట. అప్పటికి తాము చేస్తున్న పని అందరూ గ్రహించేశారని తెలిసి, కొద్దిగా తగ్గారు. ఈ విషయంలో కొన్ని వందల మంది సంతకాలు పెట్టి సుప్రీం కోర్టులో ఒక వ్యాజ్యం కూడా వేశారుట. ఆ వ్యాజ్యం ఏమయ్యింది అన్న విషయం, పత్రికా స్వేచ్చ గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఏ పెద్ద పత్రికా సంపాదకుడూ, జర్నలిస్టూ కూడా ఇంతవరకూ రిపోర్ట్ చెయ్యలేదు. 



కాబట్టి మీడియా దేశ బధ్రతకు, సమగ్రతకు చెయ్యవలసినది ఏమన్నా ఉంటే తరువాత చెప్పుకోవచ్చు. కాని వాళ్ళు చెయ్యకూడని పనులు మాత్రం  ఈ విషయంలో అనేకం చేస్తున్నారు. అవ్వి మానుకోవటమే మీడియా సెక్యూరిటీ పాటించటం, దేశానికి వాళ్ళు చెయ్యగలిగిన మేలు

ఎప్పుడు ఏమి జరిగినా వెంటనే బ్రేకింగ్ న్యూస్ అంటూ రంగంలోకి దిగి, ఆ టెర్రరిస్టులకు వాళ్ళకు కావల్సిన పబ్లిసిటీ విపరీతంగా ఇచ్చేస్తున్న మీడియా కూడా కొంత సమయనం  పాటించాలి. అలా
సమయనం పాటిచటం కూడా సెక్యూరిటీలో భాగమే.

నిన్నటికి నిన్న (11th August, 2012) ముంబాయి  చత్రపతి శివాజీ స్టేషన్ కు దగ్గరలో ఉన్న ఆజాద్ మైదానం లో అస్సాం లో జరుగుతున్న విషయానికి ఇక్కడ నిరసనట, కొంతమంది ఉన్నట్లుండి అందరి మీదా విరుచుకుపడి బీతావహమైన కార్యక్రమం మొదలు పెట్టారు. పోలీసులు ఎంతో  ముందు జాగ్రత్త తీసుకున్నారు కాబట్టి, ఆ అల్లరిని వెంటనే లోకలైజ్ చేసి అణిచిపారేశారు. ఈ అల్లరి అంతా లైవ్ టెలికాస్ట్ జరిపి, ప్రెస్ ఫ్రీడం అంటే ఇదే అని జబ్బలు చరుచుకున్నది మన మీడియా. ఏమి అలాంటివి లైవ్ చెయ్యకపోతే ఎవరన్నా సుప్రీం కోర్టులో కేసు పెడతారా వీళ్ళ మీద. వాళ్ళు  ఇలా చూపిస్తుంటె, ఒక చోట జరిగిన అల్లరి దేశ వ్యాప్తంగా అంటుకునే అవకాశం లేదా. ఎక్కడపడితే అక్కడ మెటల్ డిటెక్టర్లు పెట్టటం ఒక్కటే కాదు సెక్యూరిటీ అంటే! ఏది చూపించాలి ఏది చూపించకూడదు అని మీడియాకు ఉండవలిసిన ఇంగిత జ్ఞానం కూడా సెక్యూరిటీలో భాగమే. 

సెక్యూరిటీ అంటే ఏమిటి  అన్న విషయంలో  అవగాహన లేమి ఎలా ఉంటుంది అనే   విషయం చెప్పటానికి నేను కళ్ళారా చూసిన విషయం ఒకటి చెప్తాను. బెంగుళూరులో నేను మా అబ్బాయి కలిసి ఒక ఆంగ్ల సినిమా చూడటానికి ఒక మాల్ లో ఉన్న సినిమా హాలుకి వెళ్ళాము. మా అబ్బాయి వాడి వాహనాన్ని పార్క్ చెయ్యటానికి తీసుకు వెళ్ళాడు. వాడితోబాటుగా సెక్యూరిటీదాకా వెళ్ళి  అక్కడే నిలబడి జరుగుతున్న తతంగం చూస్తున్నాను. మా అబ్బాయి వాహనాన్ని,  క్షుణ్ణంగా తనిఖీ చేశారు, కింద పక్కన అద్దం పెట్టి చూసి మరీనూ. సరే వాడు ఈ "తంతు" ముగించుకుని పార్క్ చెయ్యటానికి సెల్లార్ లోకి వెళ్ళాడు. ఈ లోగా ఐదారుగురుతో  ఉన్న ఒక డొక్కు వాన్ వచ్చింది. వెనకాల సామనులు వేసి ఉన్నాయి.  ఆ వాన్ ని డ్రైవర్  ముఖం చూసి ఎంత మాత్రం చెక్ చేయ్యకుండా లోపలకి పంపించేశారు సెక్యూరిటీ వాళ్ళుగా చెలామణి అవుతూ యూనిఫారం వేసుకున్న ప్రవైటు సెక్యూరిటీ వాళ్ళు. 

నేను వెంటనే అడిగాను, ఆ వాన్ చెక్ చెయ్యక్కర్లేదా, ఎవరిది ఆ వాన్ అని. వాళ్ళు చెప్పిన విషయం విస్మయాన్ని కలిగించింది. వాళ్ళకు సెక్యూరిటిపట్ల ఉన్న అవగాహనలేమి తెలియచెప్పింది. కారణం ఏమిటిట, ఆ వాన్. మాల్ లో ఉన్న ఒక క్యాంటీన్ వాళ్ళదిట అందుకని చెక్ చెయ్యాల్సిన అవసరం లేదుట. ఇదెక్కడి సెక్యూరిటీ వాదన. ఆ క్యాంటీన్ లో పనిచేసే వాళ్ళఅందరినీ సెక్యూరిటీ చెక్ చేసి, పోలీసు వారి దర్యాప్తు జరిపి వాళ్ళు ఎక్కడివాళ్ళు, ఎలాంటివాళ్ళు ఎక్కడ ఉంటారు,అని చూసి మరీ ఆ క్యాంటీన్ వాడు ఉద్యోగంలోపెట్టుకుని ఉంటాడా. ఎవడు ఎంత తక్కువ  జీతానికి  ఎంత ఎక్కువ పనిచెస్తే వాణ్ణి తీసుకుని ఉంటాడు. అలా పనిచేస్తున్న క్యాంటీన్ మీద ఏమిటీ సెక్యూరిటీ వాళ్ళ భరోసా?!  దశాబ్దాలుగా పనిచేస్తూ మా గురించిన సమాచారం సమగ్రంగా ఉన్న చోటే రోజూ మమ్మల్ని చెక్ చేసి , మా టిఫిన్ బాక్సులను కూడా ఎక్స్ రే మిషన్లో స్కాన్ చేసి కాని లోపలి వదలరే!! కొన్ని వేలమంది వచ్చే మాల్ లో  ఇలాంటి సెక్యూరిటీనా!!??

కాబట్టి సెక్యూరిటీకి సంబంధించిన వరకూ పైన  బొమ్మలో కనపడేవి అతి చిన్న విషయాలు. కాని   అవ్వే సెక్యూరిటీ కాదు. 

సెక్యూరిటీ అనేది ముఖ్యంగా మనలో ప్రతి ఒక్కళ్ళూ ఆలోచించే విధానం, ఎవరికి వాళ్ళు తీసుకోవాలిసిన జాగ్రత్తలు, ప్రభుత్వ పరంగా రక్షణ/విదేశాంగ విధానల మీద 99.99 శాతం  ఆధారపడి ఉంటుంది. మిగిలిన 0.01 శాతమే  పై బొమ్మల్లో చూపిన వాటి మీద ఆధారపడాలి. కాని, మనం ఆ నిష్పత్తిని   తలకిందులు చేసి బతుకుతున్నాం. 

అందుకనే రస్సెల్ పీటర్స్ మనను హాస్యం పట్టిస్తున్నాడు,  ప్రేక్షకుల్లో ఎక్కువమంది భారతీయులే ఉండి(ఆ హాస్య ప్రదర్శన లండన్ లో జరిగింది) ఇంకెవరిగురించో అన్నట్టుగా పగలబడి నవ్వుతున్నారు!  జరగకూడనివి జరిగిపోతూనే ఉన్నాయి. 

3 కామెంట్‌లు:

  1. One Gentleman giving himself name "Sarma" put a comment. When verified he does not have any profile.

    As per the policy of this Blog, such comments shall not be posted.

    రిప్లయితొలగించండి
  2. శివా గారు మంచి విషయం మీద వ్రాశారు. మీరు చెప్పినట్లు మన దేశంలో "సెక్యూరిటీ" పేరుతో జరిగే నాటకం అంత ఇంతా కాదు.....దాని వలన సామాన్యుడు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు......ఇంతకీ ఏ టెర్రరిస్టునీ ఆపటానికి ఇవేమీ పని చేయటం లేదు. నిన్న టీవీ 9 లో మాజీ పోలిసు అధికారి అరవిందరావుగారు చెప్పినట్లు....లెఫ్ట్ వింగు టెర్రరిజాన్ని "అవకాశవాదులైన రాజకీయ నాయకులూ", "అవకాశాలులేని ప్రజలూ" ప్రొత్సాహించినంత కాలం మన దేశం గతి ఇలానే ఉంటుంది. ఇలా కాకుండా, టెర్రరిస్టులకి ఒక హెచ్చరిక క్రింద గవర్నమెంటు చర్యలు ఇజ్రాయిల్ దేశంలో లాగా ఉంటే; దెబ్బకి 10 దెబ్బలు పడితే ఏ టెర్రరిజమూ ఉండదూ.....ఏ సెక్యురిటీ వ్యవస్థా అఖర్లేదు......సామాన్యుడికీ అవస్థలూ ఉండవు.

    రిప్లయితొలగించండి
  3. శివా గారు మంచి విషయం మీద వ్రాశారు. మీరు చెప్పినట్లు మన దేశంలో "సెక్యూరిటీ" పేరుతో జరిగే నాటకం అంత ఇంతా కాదు.....దాని వలన సామాన్యుడు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు......ఇంతకీ ఏ టెర్రరిస్టునీ ఆపటానికి ఇవేమీ పని చేయటం లేదు. నిన్న టీవీ 9 లో మాజీ పోలిసు అధికారి అరవిందరావుగారు చెప్పినట్లు....లెఫ్ట్ వింగు టెర్రరిజాన్ని "అవకాశవాదులైన రాజకీయ నాయకులూ", "అవకాశాలులేని ప్రజలూ" ప్రొత్సాహించినంత కాలం మన దేశం గతి ఇలానే ఉంటుంది. ఇలా కాకుండా, టెర్రరిస్టులకి ఒక హెచ్చరిక క్రింద గవర్నమెంటు చర్యలు ఇజ్రాయిల్ దేశంలో లాగా ఉంటే; దెబ్బకి 10 దెబ్బలు పడితే ఏ టెర్రరిజమూ ఉండదూ.....ఏ సెక్యురిటీ వ్యవస్థా అఖర్లేదు......సామాన్యుడికీ అవస్థలూ ఉండవు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.