26, ఆగస్టు 2012, ఆదివారం

ఒక విషాద గాధ

ఒకప్పుడు ఆ దేశం పేరు చెకోస్లోవేకియా. అక్కడి బలవంతపు కమ్యూనిస్ట్ పాలన అంతం అయ్యాక, చెక్ రిపబ్లిక్ మరియు స్లోవేనియా అనే   రెండు దేశాలుగా విడిపోయింది. ఇవ్వాళ ఆదివారం కావటంతో  సావకాశంగా ఉండి, ఒక స్నేహితుడు ఇచ్చిన ఒక డాక్యుమెంట్రీ చూస్తున్నాను. ఆ  డాక్యుమెంట్రీ మూడు భాగాలుగా ఉన్నది.  ఒకప్పుడు కమ్యూనిజం అమలులో ఉన్న దేశాల్లో అప్పట్లో  ప్రజలు ఎలా జీవించారు అన్న విషయం మీద, బి బి సి వారు, అక్కడ దొరికిన అనేక ఆర్ఖైవ్ ఫిల్మ్స్ మరియు ఇతర మెటీరియల్ తో కలిపి  ప్రపంచానికి చూపారు.   అందులో రెండు విషయాలు బ్లాగులో అందరితో పంచుకుందామని అనిపించింది.
మిలాడో హోరాకోవ స్మృతి చిహ్నం 
 పై ఫోటో Geniums Loci Czech Republic(క్లిక్) అనే పేరు గల బ్లాగ్ నుండి గ్రహింపబడినది
ఆవిడ ఒక మహిళా రాజకీయవేత్త, చెకోస్లోవేకియా లో  సోషల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన పార్లమెంట్ మెంబరు. ఆవిడ పేరు మిలాడా హోరాకోవా. కమ్యూనిస్టులు "కూప్" ద్వారా (ఎన్నికలూ కాదు ప్రజా (!) విప్లవమూ కాదు) ప్రభుత్వం లోకి వచ్చిన తరువాత ఆమెను  అరెస్ట్ చేసి  తూ తూ మంత్రంగా విచారణ వంటిది జరిపి ఆమెకు రాజద్రోహ నేరం కింద మరణ శిక్ష విధించారు. ఆమె ఉరి శిక్షను తగ్గించ మని అప్పటి ప్రపంచ ప్రముఖులు రాజకీయ నాయకులైన చర్చిల్, రూజ్‌వెల్ట్ లే కాక ప్రముఖ సైంటిస్ట్ ఐన్‌స్టీన్ కూడా  అర్ధించారు. చేకోస్లోవాకియా ను జెర్మనీ ఆక్రమించిన కాలంలో జర్మన్ బలగాలను రహస్యంగా ఎదిరించిన "రెసిస్టన్స్" లో భాగాస్తురాలైన  ఈవిడను  అప్పట్లో నాజీలు అరెస్ట్ చేసి మరణ శిక్ష విధించారు, ఆ తరువాత ఆ శిక్షను రద్దు చేసారు. కాని స్వంత దేశపు పాలకులు ఉరి శిక్ష అమలు చేసేశారు. ఈ విధంగా కమ్యూనిజానికి  బలైపోయే నాటికి ఆవిడ వయస్సు 48. 

ఒక ఇజానికి బలైపోయిన ఆమె ఆత్మకు శాంతి కలుగు గాక.

 ఆమె తన మరణ దండన అమలు జరగటానికి ముందు తన ఏకైక కుమార్తె కు వ్రాసిన లేఖ, దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, చెకోస్లోవేకియా లో కమ్యూనిస్ట్ పాలన అంతం అయిన తరువాత మాత్రమె  ఆమె కూతురికి అందించ గలిగారు. అంటే ఎంతటి రాక్షసంగా పరిపాల ఉండేదో ఊహించవచ్చు.  మిగిలిన విషయాలు, నేను వ్రాయటం కంటే ఈ కింది ఫిలిం  క్లిప్ చూసి  బాగా తెలుసుకోవచ్చు. 

పైన చూసిన చదివిన విషాద గాధ  తరువాత ఆ మూడ్ లోనుంచి,  ఆ విచారం లోనుండి  ప్రయత్నం చేసి కాని బయటకు రాలేము. అందుకని, చెకోస్లోవేకియాలో కమ్యూనిస్ట్  పాలకులు అమెరికా జీవన విధానాన్ని కోకో కోలా పానీయాన్ని, ముఖ్యంగా అమెరికన్ కౌ బాయ్ కథలను ఎద్దేవా చేయిస్తూ తీసిన సినిమాలో "లేమనేడ్ జో" గా నటించిన అప్పటి చెక్ నటుడు చేప్పిన విశేషాలు చూడండి.

 

పైన ఉన్న రెండు వీడియోలు బి బిసి వారి డాక్యుమెంటరీ నుండి బ్లాగుకు సరిపొయ్యే విధంగా కన్వర్ట్ చేసి ఇవ్వబడింది ఇక్కడ ఇవ్వి చూపటం      బి బి సి వారి సౌజన్యం.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.