19, సెప్టెంబర్ 2012, బుధవారం

లైఫ్ ట!! బ్యూటిఫుల్ ట!!

ముంబాయిలో తెలుగు  సినిమాలంటూ వస్తూనేఉన్నాయి. ఏదో ఒక టైములో తెలుగు సినిమాని చూపించే ప్రయత్నంచేస్తూనే ఉన్నారు. నిన్న వెళ్ళాము. మేము హాలులోకి వెళ్ళేప్పటికి, మా కుటుంబం కాక మరొక్క కుటుంబమే ఉన్నది లోపల.  సినిమా మొదలయ్యేసరికి దాదాపుగా ఒక 30-40 మంది పోగయ్యారు అంతే.

ఈ సినిమా గురించి చెప్పవలసినది చాలా కొద్ది మాత్రమే !
  • సినిమాల్లో అప్పుడప్పుడూ వచ్చే డ్రంస్ బీట్ ఎవరు వాయించారో కాని చాలా బాగా వాయించారు  చాలా విన సొంపుగా ఉన్నది.
  • సినిమా కోసం ఒక పెద్ద చెట్టు పడగొట్టేసినందుకు, శెఖర్ కమ్ములను ఎప్పటికి క్షమిచలేను. అది గ్రాఫిక్ అయ్యుండి, ఆ విషయం టైటిల్స్ లోనో లేక చివరకో చూపించి ఉండి , నేను మిస్ అయితే క్షంతవ్యుణ్ణి.
కొంత పేరు వచ్చినాక దర్శకులకు ఉండేఇబ్బంది ఇదే. మొదటి సినిమా తోనే  ప్రేక్షకుల దృష్టిలో ఎంతో ఎత్తున కూచున్న శెఖర్ కమ్ముల  సినిమా అంటె, ఎంతో ఊహించుకుని వెళ్తాం. ఈ సినిమాలో చూడటానికి ఏమీ లేదు అనలేను కాని, ఏదో ఉంటుందని  ఆశించకుండా,  అలా వెళ్ళి మూడు గంటలు (అవును నిజంగా మూడు గంటలే!) పెద్దగా ఎడిటింగ్ చెయ్యకుండా సీన్లన్నీ అతుకేసిన సినిమా చూడటానికి ఐతే  పెద్ద బాధుండదు.

చాలా రోజుల క్రితపు మాట, భారత దేశంలో రీడర్స్ డైజెస్ట్ కు సంపాదకునిగా ఉన్నాయన అన్న మాటలివి-"రీడర్స్ డైజెస్ట్ కి సంపాదకత్వం వహించటం చాలా కష్టమైన పని. పొరబాటున పంక్చుయేషన్ లో ఒక కామా తప్పు పడినా రెండొందల ఉత్తరాలు వస్తాయి ఆ తప్పు చూపిస్తూ!". అంతే మరి! రీడర్స్ డైజెస్ట్ చదివే పాఠకులు ఎవరై ఉంటారు! వాళ్ళ అభిరుచులు, ఏ స్థాయిలో ఉంటాయి? ఆ స్థాయినిబట్టి సంపాదకత్వంలో ఉండే సాధక బాధకాలు ఉంటాయి అని అతి చిన్న తప్పును కూడా సహించరని ఆయన తాత్పర్యం. 


ఈ సినిమాకి కూడా పైన చెప్పిన రీడర్స్ డైజెస్ట్  సంపాదకుని అభిప్రాయం చక్కగా నప్పుతుంది. ఏదో చౌకబారు మూస సినిమా తీసే దర్శకుడి సినిమా అయితే,  ఏదో ఏవరేజి,  బాగున్నది, అతని స్థాయికి మించి తీశాడు అనుకునే పని.  కాని, శేఖర్ కమ్ముల నుంచి ఈ సినిమా చూసిన తరువాత, అతనిలో ఉన్న మంచి దర్శకుడు/రచయిత ఏమయిపోతున్నాడు అన్న భయం పట్టుకుంది. దాదాపుగా మునుపు తనే  తీసిన సినిమా  "హాపీ డేస్" తిరగేసి బోర్లేసి, "లైఫ్ ఈజ్  బ్యూటిఫుల్"  కుట్టేశాడు మరి.

ఒక్క విషయం లో మటుకు శేఖర్ ను అభినందించాలి. ఈ సినిమాకి తనే నిర్మాత కూడాను.  


ఈ సినిమాలో శ్రియ ను ఎందుకు ఎన్నుకున్నాడో శేఖర్  చెప్పాలి.  చాలా చోట్ల ఆ అమ్మాయి చాలా పెద్దదానిగా ఎబ్బెట్టుగా ఉన్నది. సినిమాలో నటించిన వాళ్ళల్లో "నాగరాజు" గా వేసినతనికి మంచి భవిష్యత్ ఉన్నది.






6 కామెంట్‌లు:

  1. ముందుగ శివప్రసాద్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు.
    ఈ సినిమాను నేను మొన్ననే చూసాను. మీకు కలిగిన అభిప్రాయమే నాకు కలిగించిది. అంటే ఏదో మెసేజ్ ఇస్తాడని కాదు గాని.కొంత కొత్తదనం ఏదన్న చూపిస్తాడని అనుకున్నాను.

    ఆ స్థాయి దర్శకుడి దగ్గరనుంచి ఇంత పేలవమైన సినిమా వస్తుందని అనుకోలేదు.
    మీరు ఉదహరించిన రీడర్స్ డైజేస్ట్ సంపాదకుడి అభిప్రాయం తో నీ ఏకీభవిస్తాను.

    రిప్లయితొలగించండి
  2. Sekhar Kammula has always been a overrated director శివరామప్రసాద్ గారూ. :)

    రిప్లయితొలగించండి
  3. @ Poorva Phalguni & The Tree:

    మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. మీకున్నూ వినాయకచవితి శుభాకాంక్షలు.

    @ KumarN

    I am not aware that Sekhar Kammula is overrated or whatever rated. But he is definitely better than the run of the mill Directors who have been dishing out same old stories with different presentations. Pity is that he too joined the notorious Club.

    రిప్లయితొలగించండి
  4. ఇప్పుడే చూసొచ్చానండీ సినిమా. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.