20, అక్టోబర్ 2012, శనివారం

అర్ధ శతాబ్ది దాటినా.....జాగ్రత్త....జాగ్రత్త......జాగ్రత్త

అవును జాగ్రాత్త గా ఉండాలిసిన  తరుణమే ఇది. సరిగ్గా ఏభై ఏళ్ళ  క్రితం ఇదే రోజున అక్టోబరు ఇరవయ్యో తారీకున (1962 లో)  అప్పటి మన అయోమయ స్థితిని ఆసరా చేసుకుని,  స్నేహం అంటూ ఏమార్చి, కమ్యూనిస్ట్ చైనా ఒక్కసారిగా దురాక్రమణ చేసి మన దేశంలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నది. ఇది మన ఓటమికి అర్ధ శతాబ్ది నిండిన సందర్భం. అప్పుడు జరిగిన పరాభవం తరువాత ఏమన్నా పాఠాలు నేర్చుకున్నామా అంటే, పూర్తిగా లేదనలేము కాని, ఒక స్వతంత్ర దేశంగా ఇరుగు పొరుగున ఉండే టక్కరి దేశాలతో వ్యవహరించటం మటుకు ఇంకా నేర్చుకోవలిసే ఉన్నది.  చైనా యుద్ధం గురించి సమగ్రంగా  "స్వర్ణ ముఖి" బ్లాగులో వ్యాస పరంపరను శ్రీ సుబ్రహ్మణ్య చైతన్య ప్రచురించారు. ఈ  కింది లింకు  నొక్కి ఆ వ్యాసాలు  చదివి విషయాలు తెలుసుకోవచ్చు.శ్రీ పిలాకా గణపతి శాస్త్రి
రాజమహేద్రవరం లో 1963 వ సంవత్సరం, జనవరి నాలుగు నుండి ఆరు వరకూ జరిగిన రెండవ అఖిల భారత తెలుగు రచయితల సదస్సు సందర్భంగా ఒక సావనీర్ ప్రచురించారు. అందులో ప్రముఖ రచయిత   శ్రీ పిలకా గణపతి శాస్త్రిగారు అప్పటి ప్రజలకు జాగ్రత్త చెబుతూ, ఇంటి దొంగలే ఎక్కువ ప్రమాదం అని సూచిస్తూ చెప్పిన కవిత/పద్యం ప్రచురించారు. దాదాపుగా ఐదు దశాబ్దాల క్రితం వ్రాసినప్పటికీ ఇందులోని విషయాలు ఇప్పటికీ ప్రస్తుతమే. 
విష భుజంగమం చైనా వేయి కోరలతో విరుచుకు పడినా,  
తుషార  గిరి శిఖరాలపై ధూమకేతువై ప్రజ్వలించినా, 
వీరాధి వీరులమై విజృంభించగలం. 
దూర దూరంగా తరిమి వేయగలం! 
కానీ మనలోనే ఉన్నాయి సుమా! 
కడంగడు  దుష్ట పన్నాగాలు  జాగ్రత్త!   
కాటు వేసి పోగాలవు సుమా! జాగ్రత్త! 
నల్లనివి కొన్ని, ఎర్రనివి కొన్ని, 
ఇంటి దొంగలై పారాడుతున్నాయి! 
జాగ్రత్త!ఇటువంటి తరుణంలో ఏమరుపాటు పనికిరాదు మిత్రమా!జాగ్రత్త రెండు నాలుక లల్లాడించి  నిండు గుండెలోనే నిద్రించగలదీ  పాపజాతి! ఉండి  ఉండి  తీయని తేనే పలుకులతో  ఊరించి జోకోట్టగలదీ దుర్జాతి! 
విశాల భారతావనిలో జన్మించినా విదేశాల మీదనే దీని కైపు!  
కన్న  తల్లి పాలారగించినా  తిన్న ఇంటి వాసాల మీదనే దీని చూపు  
విష భుజంగమం చైనా వేయి కోరలతో విరుచుకు పడినా  
తుషార  గిరి శిఖరాలపై దూమకేతువై ప్రజ్వలించినా 
 వీరాధి వీరులమై విజృంభించగలందూర దూరంగా తరిమి వేయగలం!

అదేసమయంలో ప్రముఖ చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు చిన్న పిల్లల పత్రిక చందమామ ముఖ చిత్రంగా వేసిన బొమ్మ చూడండి 
మన దేశానికి రెండు పక్కలా శతృ దేశాలు. వియ్యానికైన కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. ఒక్క బలంలోనే కాదు నడవడికలో కూడా.  బలమనేది ఎవ్వరైనా కొంత సాధించవచ్చు కాని, నడవడిక అనేది స్వతహాగా ఉండాల్సిన విషయం. ఈ విషయంలో ఈ రెండు దేశాలూ నడవడిక   ఎప్పటికీ మనకు సమ ఉజ్జీలు కారు,  కాలేరు కూడా. వాళ్ళ సంస్కృతి, జీవన విధానం అటువంటిది.  కాని మన దురదృష్టం వాళ్ళు మన పక్కనే ఉంటారు ఎన్నాళ్ళైనా సరే. కాబట్టి, జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అంతకంటే మరొక మంత్రం లేదు. మళ్ళి మరొకసారి ఈ నల్ల మందు భాయి గాళ్ళను నమ్మే ప్రయత్నాలు చేసే వాళ్ళు (వాళ్ళకి ఉండే స్వార్ధ కారణాలు వాళ్ళకి ఉన్నాయి) ఉండనే ఉన్నారు. వాళ్ళతోనే ఎక్కువ జాగ్రత్త. 

పిలకా వారు అటువంటి ఇంటి దొంగలగురించే జాగృతపరిచారు ఆ నాడు. అదే జాగ్రత్త  ఈనాడూ అవసరమే.

మన దేశాన్ని రక్షించటానికి, ప్రాణాలర్పించిన సైనికులకు, వీరోచితంగా పోరాడిన వీర జవాన్లకు  వేల నమస్కారాలు. 

రెండెవ ప్రపంచ యుధ్ధంలో ఎంతో ప్రతిభ చూపిన అమెరికన్ జనరల్ పాటన్ తన సైనికులను ఉద్దేసించి  ప్రసంగిస్తూ,  "నీ దేశం కోసం నువ్వు చావటం కాదు, శతృ సైనికుణ్ణి వాడి దేశం కోసం చచ్చేట్టు చెయ్యి" అని ఉత్తేజిత పరిచారు.  ఇలాంటి ఎగ్రిసివ్ నాయకత్వం మనకు ఉండాలిసిన అవసరం ఎంతైనా ఉన్నది.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.