31, అక్టోబర్ 2012, బుధవారం

పాట అదే అర్ధమే వేరు బోనస్ గా మరో రెండు పాటలు


మేము కాలేజీలో  చదువుకునే రోజుల్లో అంటే 1970 ల చివర్లో  పుస్సీ కాట్" అనే డచ్ పాప్  బృందం బాగా  బజాయిస్తూ ఉండేది. వాళ్ళు నెదర్ లాండ్స్ కు చెందిన వాళ్లవటం వల్ల ఆంగ్ల ఉచ్చారణ గమ్మత్తుగా ఉండి, అదొక కొత్త ఆకర్షణగా ఉండేది.  అన్ని పాటలూ కాకపోయినా కొన్ని పాటలు బాగుండేవి అప్పట్లో చాలా సార్లు విన్న పాటలలో "It's the same Old Song ఒకటి.  ఇవ్వాళ శలవు పెట్టి ఇంట్లో  ఉండటంతో అవ్వి ఇవ్వి వెతుకుతూ ఉంటే ఈ బృందం పాడిన పాటలు  ఉన్న సి డి కనపడింది. ఆ డీవ్ షేర్లో కి ఎక్కిద్దామంటే ఎందుకనో రెండ్రోజుల నుంచి వరసగా   ఎర్రర్ మేసేజీలే వస్తున్నాయి. ఒకటికాకపోతే మరొకటి. యు ట్యూబ్ లోకి వెళితే పాట  వాళ్ళు పాడటం కూడా చూడవచ్చు.

సరే ఈ పాట  సాహిత్యం ముందు చూడండి. ఆతరువాత ఈ పాటని     యు ట్యూబ్ ద్వారా వినవచ్చు.
You're sweet (You're sweet) as a honey bee (As a honey bee)
But like a honey bee stings you've gone and left my heart in pain
All you left (All you left) is our favorite song
The one we danced to all night long

It used to bring (Used to bring) sweet memories (Sweet memories)
Of a tender love that used to be

Now it's the same old song
But with a different meaning
Since you been gone

Now, it's the same old song
But with a different meaning
Since you been gone, my
Oh, my

A sentimental fool am I
To hear an old love song and wanna cry
But the melody keeps haunting me
Reminding me how in love we used to be

Keep hearing the part that used to touch our heart
Staying together forever, breaking up never

It's the same, same old song
But with a different meaning
Since you been gone

Now, it's the same, same old song
But with a different meaning
Since you been gone, my
My, my

Precious memories keep lingering on
Everytime I hear our favorite song
Now you're gone, left this emptiness
I only reminisce the happiness we spent

We used to dance to the music (Dance to the music)
Make romance through the music (Romance through the music)

It's the same, same old song
But with a different meaning
Since you been gone

Now, it's the same, same old song
But with a different meaning
Since you been gone, my
My, my

Well, it's the same, same old song
But with a different meaning
Since you been gone

Now, it's the same, same old song
But with a different meaning
Since you been gone

It's the same, same old song
But with a different meaning
Since you been gone
అలాగే ఈ బృందం పాడిన మరో పాట  "మిసిసిపి" అనే పాట,  ఈ పాటలో డ్రమ్స్ గిటార్ కలిఫై చక్కటి గమకం సృష్టించారు. మిసిసిపి అనేది అమెరికా లో ఉన్న ఒక నది పేరు. వీళ్ళు యూరోపియన్స్. ఆ అమెరికన్ నది పేరుతొ పాట  ఎందుకు పాడాలి! ఇంగ్లీషులో పాటలు పాడే పాప్ బృందానికి,  పెద్ద మార్కెట్ అమెరికానే కదా. వాళ్ళను ఆకర్షించటానికి ఇలా వాళ్ళ పేరు వాడి ఉంటారు. కాని పాట  చివరలో అమెరికన్లను ఒక ఎత్తిపొడుపు పొడుస్తారు. వాళ్ళ కంట్రీ సాంగ్స్(జానపద సంగీతం) కనుమరు గవుతున్నాయని, కంట్రీ  సాంగ్ గిటారిస్టు లు ఇప్పుడు రాక్ అండ్ రోల్ వైపు వెళ్ళిపోతున్నారని ఉన్న విషయం పాటలో చెప్పేశారు.  ఇప్పుడు వినండి, చూడండి, పాట  సాహిత్యం కూడా స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది:


ముచ్చటగా మూడో పాట  "BROKEN SOUVENIRS", ఈ  పాట భీ అప్పట్లో మంచి హిట్. ఈ పాట కు  కూడా పాట ఆడియో  సాహిత్యం అన్నీ కలిపి  ఓకే పాక్ లో ఉన్నాయి చూస్తూ వింటూ చదువుకోవచ్చు వీళ్ళు పాడిన పాటల్లో మరొక మంచి పాట "On the Radio" అనుకుంటాను అప్పట్లో వినేవాళ్ళం. కాని ప్రస్తుతం ఎక్కడా దొరకటం లేదు ఈ బృందం లో పాటలు ఎక్కువగా మహిళలు  బృందగానం చేస్తూ ఉంటే, మగవాళ్ళు సంగీత సహకారం అందిస్తూ ఉంటారు. కాని "On the Radio" పాట మాత్రం మగవాళ్ళే పాడినట్టు గా గుర్తు ఉన్నది. 

ఏమైనా పాప్  సంగీతంలో హాలెండ్ వాళ్ళు కూడా మంచి పాటలను అందించారు. అటువంటి డచ్  సంగీతపు బృందాలలో పుస్సీ కాట్, జార్జ్ బెకర్ సెలెక్షన్ ముఖ్యమైనవి.

ఈ  కార్యక్రమం ఇంతటితో సమాప్తం.


=====================================
UPDATE ON 03 11 2012
=====================================

పైన మరొక మంచి పాట "On the Radio" అని   కదా.కాని ఆ టైటిల్ తప్పు. ఆ పాట  పేరు "The Story of W Dummy" అందులో ఒక రేడియో  కార్యక్రమం గురించి ఉన్నది  అలా గుర్తుకొచ్చినట్టున్నది. చివరికి ఆ పాటను ఇవ్వాళ యు ట్యూబ్ లో పట్టుకున్నాను. వినటానికే ఉన్నది కాని చూడటానికి లేదు అందులో. నాలాగే ఆ పాట నచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారన్న సంగతి సంతోషానిచ్చింది.
  ప్రస్తుతానికి ఆ పాట యు ట్యూబులో రావటం లేదు "సారీ"  
అప్-డేటెడ్ 14 08 2014
==========================================================================

ఈ పాట  సాహిత్యం  దొరకటం లేదు. ఒకసారి మార్క్ ట్వైన్ విసుక్కున్నాడుట, తన దగ్గర  కుప్ప-తెప్పలుగా ఉన్న పుస్తకాలు చూసి. "ఈ పుస్తకాలన్నీ అరువిచ్చిన వాళ్ళు, అవి పెట్టుకోవటానికి బీరువా ఇచ్చారు కాదు" అని. అలాగే ఈ పాట  యు ట్యూబ్ లో పెట్టిన వాళ్ళు లేరిక్ ఉంచారు కాదని చాలా చీకాకుగా ఉన్నది. వెతికితే దొరకనిది లేదంటారు, చూద్దాం దొరికితే  మరొక అప్డేట్! 
 

1 వ్యాఖ్య:

  1. http://www.lyricsbox.com/pussycat-lyrics-td385.html
    ఈ లింకులో పుస్సీ కేట్ గ్రూప్ వారు పాడిన అన్ని ఆల్బం పాటల రచనలు ఉన్నాయి. దొరికినంత వరకూ వాటి రచన ఇచ్చారు. అయితే, "THE STORY OF W DUMMY" పాటకి ఇందులో కూడా lyric లేదు.
    http://instalyrics.com/artists/21199-pussycat/albums ఈ లింకులో దరిదాపుల పుస్సీ కేట్ అన్ని పాటలూ వింటానికి కుదురుతుంది.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.