6, నవంబర్ 2012, మంగళవారం

సుప్రభాతం అలాగే పాడాలా! విని చూడండి

వెంకటేశ్వర సుప్రభాతం ఆకాశవాణి  విజయవాడ కేంద్రంలో ప్రతి శనివారం ప్రసారమయ్యే వెర్షన్ అందరికీ చిరపరిచితం. అలాగే ప్రముఖ గాయకురాలు శ్రీమతి ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన కాసేట్ కాని సి డి కాని అందరి దగ్గరా ఉండి  ఉంటుంది. అటు రేడియోలో కాని, ఇటు ఈ కాసేట్/సిడి లోకాని సుప్రభాతం పాడే పద్ధతి ఒక్కటే విధం. సంగీతం జ్ఞానం ఏమాత్రం లేని నాలాంటి వాడికి ఎవరో తరుముకొస్తున్నట్టు, ఒక పరిమిత సమయంలో పాడి తీరాలి అన్నట్టుగా (బ్రెత్-లెస్ గా) అనిపిస్తుంది.  స్వామి వారిని అలాగే ప్రార్ధించాలా, మరొక రకమైన గమకంలో ఈ సుప్రభాతాన్ని పాడకూడదా అని అనేక సార్లు నాకేకాదు అనేకమందికి అనిపించి ఉండాలి. 

మనకి అనిపించి ఏమి లాభం! అనిపించాల్సిన వారికి అనిపించాలి. ఇది ఇవ్వాల్టి విషయం కాదు రెండు దశాబ్దాల క్రితమే అలా ఆలోచించినవారు   లేకపోలేదు. ఎవరు!   ఇరవై ఏళ్ళ  క్రితం ఒక అద్భుత గాయక శిఖామణికి అనిపించింది. ఆయన మరెవరో కాదు, తెలుగు వారు గర్వించతగ్గ అద్భుత సంగీతజ్ఞుడు  శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. 

1992 సంవత్సరం లో మంగళంపల్లి వారు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని వారికి మాత్రమె సాధ్యమైన పద్ధతిలో కొత్తగా సంగీత పరిచి అద్భుతంగా పాడారు. "శేషాద్రి శేఖర విభో తవ సుప్రబాతం"  అంటూ ప్రతి చరణం తరువాత వచ్చే కోరస్ చాల అద్భుతంగా ఉన్నది.  విని ఆనందించండి. 

శ్రీ వెంకటేశ్వర  సుప్రభాతం 




శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి 


శ్రీ వెంకటెశ్వర  స్తోత్రం 



శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనం 
  


మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో   ఒక   చక్కటి    ఇంటర్వ్యూ      కూడా   యు-ట్యూబులో ఆంధ్ర జ్యోతి టి వి వారు నిర్వహించినది  ఉన్నది ఆ ఇంటర్వ్యూ కూడా  చూడండి.  
 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.