14, నవంబర్ 2012, బుధవారం

సిరిమువ్వల సింహనాదం సిరిమువ్వల సింహనాదం అనే సినిమా 1990 లో అనుకుంటాను మొదలు పెట్టారు. దర్సకత్వం శ్రీ విశ్వనాథ్. కాని ఎందుచేతనో ఆ సినిమా పూర్తికాలేదు. అప్పట్లో అక్కడక్కడా పోస్టర్లు కూడా వెలి శాయి, కాసెట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అందులో ఒకటి ఇవ్వాళ మా హరప్పాలో దొరికింది.  ఆ కాసెట్లో ఉన్న పాటల్లో అన్నిటికన్నా కూడా నాకు బాగా నచ్చినది "నరకాసుర వధ" గురించిన తొమ్మిది నిమిషాల పాట  ఉన్నది. పాట  వింటూ ఉంటే, అది నృత్య ప్రధానం అయినట్టుగా అనిపిస్తుంది.

కాని సినిమానే పూర్తికాలేదు.  సినిమా పూర్తయ్యి విడుదలయ్యి ఉంటే, విశ్వనాథ్ సినిమా కాబట్టి ఆ మార్క్ లో ఎంత అద్భుతంగా ఉండి  ఉండేదో కదా అనిపిస్తుంది.  ఈ దీపావళి సందర్భంగా ఈ పాట  వినండి.

ఎక్కడెక్కడి బేవార్స్ గాళ్ళు తీసిన  సినిమాలు వివాదాలే పెట్టుబడి, సినిమాలకు వెళ్ళేవాళ్ళ వేలంవేర్రే ఆధారంగా నడిచిపోతున్నాయి. 

కళాతపస్వి గా పేరొందిన శ్రీ విశ్వనాథ్ సినిమా సిరిమువ్వల సింహనాదం సినిమా పూర్తయ్యి, ఇప్పటికన్నా విడుదలైతే బాగుండును. 

ఈ సినిమా మాటలు మరెక్కడన్నా దొరుకుతాయా అని వెతుకుతుంటె, సఖియా డాట్ కాం లో ఉన్నాయి. ఈ కింది లింకు నొక్కి ఆ సైటులో పాటలు వినవచ్చు: 
7 వ్యాఖ్యలు:

 1. ఈ సంగీతరూపకానికి మరి కొన్ని డయలాగులు, పద్యాలు గట్రా కలిపి డిట్రాయిట్ తెలుగు సమితిలో నృత్యరూపకంగా ప్రదర్శించాము 2009 దీపావళికి. నేను నరకాసురుని పాత్ర ధరించాను. మళ్ళీ ఇలా వినడం బావుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "ఎక్కడెక్కడి బేవార్స్ గాళ్ళు తీసిన సినిమాలు వివాదాలే పెట్టుబడి". అంతే కదండీ, వీళ్ళలో కళల పట్ల ఏమైనా అవగాహన ఉంటే కదా......నాలుగు సినిమాలలో నెత్తిన కిరీటం పెట్టుకోగానే తామే దేవుళ్ళమనే అహంకారం బలిసి, ఎవరి రాతలు, తీతలు, పాటల వల్ల పైకొచ్చారో మరచి తర తరాలుగా కళలని నమ్ముకొన్న వారినే వ్యంగం చేసే గురు కృతఘ్నులు తీసే సినిమాలకి అంతకన్న గౌరవం ఏముంటుంది. గట్టిగా 30-40 ఏళ్ళు వెనక్కి చూసుకొంటే వీరి చరిత్ర ఏమున్నది కనుక.......చరిత్రలూ, వంశాలూ గురించి మాట్లాడతారు.........సరిగ్గా ఒక నిమిషం సేపు స్వంతంగా మంచి తెలుగులో మాట్లాడలేని వీరు "తెలుగు పౌరుషం" గురించి చెపుతారు......!!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివ గారు, ఈ సినిమా నిర్మాత శ్రీ రామరాజ్యం (బాపు గారి సినిమా) నిర్మాతే. నేను విన్నదేమిటంటే, నిర్మాతకను techniciansకు మధ్య జరిగిన వివాదం వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. (ఐతే సినిమా పూర్తి చేసారంట. బహుశా నిర్మాత దగ్గర వుండివుండవచ్చు)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విజయ్‌వర్ధన్

   శ్రీ రామ రాజ్యం సినిమా నిర్మాత శ్రీ ఎలమంచిలి సాయిబాబు గారు. సిరిమువ్వల సింహనాదం సినిమా నిర్మాత శ్రీ ఎలమంచిలి నాగేశ్వర రావుగారు. ఇంటి పేర్లనుబట్టి చూస్తే, బహుశా వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారై ఉంటారు. సినిమా పూర్తయ్యి విడుదలకాకపోవటం దురదృష్టకరం. నిర్మాతకూ టెక్నీషియన్లకు వచ్చిన వివాదం వల్ల పూర్తికాకుండానే ఆగిపొయ్యిందా లేక పూర్తయ్యి విడుదల కాలేదా. ఎందుకంటె, ఈ సినిమా లో నటీనటులు ఎవరు అన్నది కూడా తెలియదు. బాపు గారిచేత ఒకసారి ఎలమంచిలివారికి చెప్పించి చూస్తే ఎమన్నా ఫలితం ఉండవచ్చంటారా.

   సిరిమువ్వల సింహనాదం గురించి గూగుల్ లో వైతికినా నెను అప్లోడ్ చేసిన కాసెట్ ఇన్లే కార్డ్ తప్ప మరే ఫొటోలు దొరకటం లేదు.

   మరింత వెతగ్గా, ఒక్క చోట మాత్రం సినిమాలో నటీ నటులు కళాకృష్ణ, మాణిక్య భారతి అని కనిపించింది(http://www.sakhiyaa.com/tag/k-v-mahadevan/page/18/) వీళ్ళెవరో నేనెప్పుడూ విని ఉండలేదు.

   తొలగించు
 4. శివ గారు, అవును, ఆ సినిమా యమంచిలి వారిదే. కళాకృష్ణ నటరాజ రామకృష్ణ గారి శిష్యుడు. కూచిపూడి నృత్య కళాకారుడు. నేను విన్నదేమిటంటే: సినిమా పూర్తి అయ్యింది- కాని విడుదల కాలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కళాకృష్ణ గారు ప్రముఖ నర్తకులు.సినిమా క్లయిమాక్స్ లో హీరో విలన్ ను నర్తన వేషం లోనే చంపివేస్తాడు అని గుర్తుంది.ఎందుకంటే అప్పట్లో రేడియో లో సినిమాల విడుదలకుముందు స్పాన్సర్డ్ ప్రోగ్రాంలు వచ్చేవి.సిరిమువ్వల సింహ నాదం సినిమాను రేడియో ఏజెన్సీ అతను క్యాసెట్లు లో రికార్డ్ చేసి తెచ్చి ఇవ్వగా నేను 15 నిముషాల వ్యవధి ప్రాయోజిత కార్యక్రమాలు రెండో మూడో వ్రాసి ఆ క్యాసెట్లతోబాటు కార్యక్రమం వారు చేసేందుకు తిరిగి ఇచ్చాను.వివిధభారతి లో ఆ సిరిమువ్వల సింహనాదం ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమయ్యిందని గుర్తు.కానీ బయ్యర్లు దొరకక సినిమా విడుదల కాలేదన్నారు.ఇప్పుడు ఆ రేడియో ఏజెన్సీ కూడా లేదు.ప్రాయోజిత కార్యక్రమాల టేపులు రేడియోలో కార్యక్రమ ప్రసార అనంతరం ఏజెన్సీ వాళ్ళకే ఇచ్చివేస్తారు. ఏమైనా ఒక మంచి సినిమాను మనం కోల్పోయాము అనాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Sudhama garu,

  Thank you for your kind information. Yes we have lost a good movie. I hope it is not lost forever. Somebody shall take the initiative to release the movie.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.