22, జూన్ 2013, శనివారం

ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం-మన రచయితల వైఖరి

 ముందుగా కొంత ఉపోద్ఘాతం:

ముల్కీ నిబంధనలు వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 1972 లో మొదలైన ఉద్యమం మహోగ్ర రూపం దాల్చి ఆంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలంచేసింది. జనవరి-ఫిబ్రవరి  1973 వచ్చేప్పటికి ఈ ఉద్యమం తారాస్థాయికి చేరుకుని ఆబాల-గోపాలము పాల్గొంటూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు నినదించారు. ఆంధ్రా ప్రాంతం మొత్తం అట్టుడికి పొయింది. ఎక్కడ చూసినా నూట  నలభై నాలుగు సెక్షన్ విధింపు, లాఠీ చార్జీలు,పోలీసు కాల్పులు, కర్ఫ్యూ.   ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రానికి వత్తాసు పలుకుతున్న కమ్యూనిస్ట్ ముక్కలు (వాళ్ళల్లో ఒక్కో ముక్కది ఒక దారి!) అప్పట్లో ప్రత్యేక రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వీళ్ళు డిసెంబరు 24 న విజయవాడలో సమైక్యతా నినాదాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో నానా యాగీ చేశారు. ప్రత్యెక రాష్ట్ర ఉద్యమకారులు, ఈ కమ్యూనిస్ట్ సమైక్యతా వాదులు (వాళ్ళ ముక్కల్లో వాళ్ళకే సమైక్యత లేదు) ఏలూరు రోడ్డులో తలబడ్డారు. చివరకు పోలీసు కాల్పులకు దారి తీసి, కొంతమంది  బలైపోయ్యారు. విజయవాడలో నాకు తెలిసి మొట్టమొదటి పోలీస్ ఫైరింగ్ అది. ఈ వార్తను అప్పటి ప్రముఖ దిన పత్రికలు ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ పతాక శీర్షికలతో ప్రజలకు వార్తను తెలియచేశాయి. 




 ఈ సంఘటనే నాకు కమ్యూనిష్టులు అంటే పూర్తీ వైముఖ్యాన్ని కలిగిం చింది. 

ప్రస్తుతానికి  ఆదే కమ్యూనిస్ట్ వారు ప్రత్యెక తెలంగాణా కావాలని ఉద్యమం లో పాల్గొంటున్నారు, ఆంధ్ర ప్రాంతం లో సమైక్య ఉద్యమం ఉన్నది అని చెప్పుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలలో దృక్పథాలలో ఎంతటి మార్పు!

సరే,  ఈ సమైక్యతా వాదుల స్వంత పేపరు విశాలాంధ్ర ఈ వార్తను ఎలా ప్రచురించిందా అని చూద్దామంటే ఆరోజు పేపరు కట్టింగ్ దొరకలేదు. అప్పుడున్న ప్రత్యెక ఆంధ్ర ఉద్యమ ధాటికి ఆ పేపరు కొన్ని రోజులపాటు వచ్చినట్టు లేదు. పేపరు కట్టింగులు 28 12 1972 నుంచి మాత్రమె అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ "పార్టీ" అనుకూల అభిప్రాయాలను మాత్రమె ప్రచురించటం జరిగి అప్పట్లో వార్తా పత్రిక పేరుతొ వచ్చే ఈ పేపరు చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నది. 

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

 విశ్వనాథ వారి పై చిత్రం, సంతకం, వారి 90వ జయంతి సందర్భంగా విడుదలైన ప్రత్యెక సావనీర్ నుండి గ్రహింపబడి నది. సావనీర్ ప్రచురణకర్తలకు ధన్యవాదాలు
ఉద్యమం ఈ విధంగా జరుగుతుండగా అప్పట్లో ఆస్థాన కవిగా ఉన్న ప్రముఖ రచయిత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు 10 02 1973 న , ప్రభుత్వం తనకు ఇచ్చిన ఆ పదవికి రాజీనామా రాజీనామా ఇచ్చారు. రాజీనామా ఇవ్వటమే కాకుండా తనదైన శైలిలో ప్రత్యెక ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఫిబ్రవరి 10, 1973న ఒక   ప్రకట చేశారు:
**********************************************************
"ప్రత్యెక ఆంధ్ర వచ్చి తీరవలె. ఇప్పుడు ఇవ్వటం సమంజసం. అన్నదమ్ములు విడిపోవడమంటే, మునసబు-కరణాలు, తమ లెక్కలకు ఇబ్బంది కలుగుతుందని వారించ ప్రయత్నించినట్టు, ఉద్యమం అణిచివేతకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఈ పరిస్థితులలో, ఆంధ్ర-తెలంగాణా విడిపోవటం సమంజసమే, ఇది నా అభిప్రాయం కూడా"

ఇదే విషయం అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్‌ వారు విశ్వనాథ వారి పత్రికా ప్రకటనల సంకలనం ప్రచురిస్తూ ఆ సంకలనం గురించి వివరి స్తూ ఈ కింది విధంగా తెలియచేశారు:


పై సమాచారం అజోవిభో  ఫౌండేషన్ వారి వెబ్సైట్ నుండి గ్రహించబడినది. ఈ కింది లింకు నొక్కి అక్కడి విశేషాలు చూడవచ్చు 
విశ్వనాథ వారి రాజీనామా, ప్రత్యెక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటన ఆంధ్ర పత్రిక వార్తా పత్రికలో ఈ కింది విధంగా ప్రచురించబడింది. 
 (వార్తా పత్రికలో ఆపైన అజోవిభో వెబ్సైట్ లో ఉన్న సమాచారం కలిపి ఇవ్వటం జరిగింది. అజోవిభో ఫౌండేషన్ వారిచ్చిన సమాచారంలో తేదీలో సంవత్సరం 1972 అని ఉన్నది కాని 1973 సరైన సంవత్సరం)
విశ్వనాథ వారు ప్రత్యెక ఆంధ్ర ఉద్యమానికి మద్దతు పలుకుతూ తన ఆస్థాన కవి పదవికి రాజీనామా ఇచ్చారు కదా ఇతర రచయితల వైఖరి ఏమిటి అని పాత పత్రికలూ వెతుకుతుంటే, శ్రీ శ్రీ కూడా పై సంఘటనకు వారం ముందు రాజీనామా చేసారని తెలిసింది. కాని  ఏ పదవికి రాజీనామా చేశారు!  ఈ విషయంలో ఆయన వైఖరి ఏమిటి అంటే ఈ కింది వార్త చూడవలసినదే:
 

పై వార్త వల్ల  తెలిసినది ఏమిటి అంటే, అప్పట్లో విప్లవ రచయితల సంఘం ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రానికి మద్దతు తెలిపారని! వీళ్ళు కూడా కమ్యూనిస్టుల్లో భాగమేనుట. కాని,  వీరి వైఖరి వేరు. వాళ్ళలో లేని సమైక్యతను రాష్ట్రానికి ఉండాలని ఆనాటి వీరి భావన!

ముగింపుగా చెప్పేదేమిటి అంటే , ఇప్పటికైనా సరే, ఊరికే  చర్చలు పాకేజీలు అని వెర్రి కూతలు మాని,  ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణా రాష్ట్రల ఏర్పాటు జరిగితేనే రెండు ప్రాంతాల అభివృద్ధి  బాగా జరుగుతుందని నా అభిప్రాయం. 1972-73లోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఉంటే, ఆంధ్ర ప్రాంతంలోని   రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, మొదలగు చిన్న పట్నాలు  ఈ పాటికి పెద్ద నగరాలుగా అభివృధ్ధి చెంది ఉండేవి, ఎంతగానో పారిశ్రామిక అభివృధ్ధి ఆంధ్ర ప్రాంతం లో కూడా జరిగేది. 

మొత్తం మీద ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో మంచి జరగాలని ఆకాంక్ష, ఆ మంచి రెండు  రాష్ట్రాలుగా విడిపోవటం అయితే ఎంతో మంచిది, దశాబ్దాలుగా సాగుతున్న ఈ  ఉద్రిక్త వాతావరణం వెనుకబడి, అబివృద్ది బాటను రెండు  రాష్ట్రాలు పట్టవచ్చు.  

నిరుద్యోగ రాజకీయ నాయకులు తమ తమ పదవుల కోసం కొత్త దారులు వెతుక్కునే పనిలో పడతారు!!

  పేపర్ కట్టింగులు ఎ పి  ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం 

*************************************************
 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం గురించి మునుపు వ్రాసిన వ్యాసాలు ఈ కింది లింకులు నొక్కి చదువుకోవచ్చు  

ఇవ్వాళ్టికి అదే పరిస్థితి 

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ తీరు తెన్నులు  

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం - సినీ నటుల మద్దతు 

 

జనవరి 21, 1973

అలనాటి జై ఆంధ్రా ఉద్యమ విశేషాలు

ఎన్నాళ్ళిలా

 

  *************************************************

                                                  


                                                           


                                                        

1 కామెంట్‌:

  1. రెండోది (మొదటిది స్వాతంత్రపు వెండి పండుగ) తెలంగాణా సాయుధ సమరం. దీన్ని మన ఘనత వహించిన ప్రభుత్వం గుర్తించనేలేదు. పైగా రెండువేల మండి కమ్యూనిస్టుల్ని ఊచకోత కోయించిన ప్రకాశం పంతులుగారి శతజయంతిని వైభవంగా జరుపుకుంది. బ్రిటిష్ వారి గుండు దెబ్బలకు గుండెచూపించిన వీరుదంటూ కాంగ్రెస్ వారాయన్ని మెచ్చుకుంటే నా అభ్యంతరం లేదు. విశాలాంధ్ర వాళ్లెందుకీ భానాజలో పాల్గొనాలని నేనడుగుతున్నాను. మద్రాసు నగరం కోసం మొండిపట్టు పట్టి పొట్టి శ్రీరాములు గారి ప్రాణాన్ని బలిపెట్టిన కిరాతకుడుగా ప్రకాశం గారిని నేను గర్హిస్తున్నాను. తెలంగాణా రైతాంగ పోరాటమే నెహ్రూ చేత ఆవడిలో సామ్యవాద మంత్రోచ్ఛారణ చేయించింది. అసంపూర్తిగా వుండిపోయిన ఆనాటి సమరం ఇంకా సాగుతోనే వున్నదనేది విప్లవరచయితల అవగాహన. అలా దేశమంతటా సాగిస్తున్నవారే ఆనాటి పోరాట సంప్రదాయలాకు ఈనాటి వారసులు. ఈ వారసత్వం మాదంటే మాదని చిందులు తొక్కడానికి అన్నదమ్ములు పంచుకునే ఆస్థిహక్కు కాదు. ప్రాణాలనే ఆహుతిగా సమర్పించి సంపాదించుకునే జన్మహక్కు. ఈ విప్లవాపోరాటానికి సంబందించిన సమగ్ర చరిత్ర ఇంకా రాయవలసే వుంది. ఆనాటి సాహిత్యమంతా సమీకరించవలసే వుంది.”

    దీని తర్వాత (18-1-1973) విభజనను వ్యతిరేకిస్తూ విరసం అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఇరవై రోజాల తర్వాత (5-2-1973) తన రాజీనామాని వుపసంహరించుకున్నాడు. రాష్ట్ర విభజనని కోరుతూ విరసం కార్యవర్గం చేసిన తీర్మానానికి అసమ్మతి తెలిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శ్రీశ్రీ, దానిపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొడానికి సమ్మతి తెలిపాడు. “నేను త్రికరణశుద్ధిగా సమైక్యవాదినైనప్పటికీ మెజారిటీ సభ్యత్వం విభజన కోరుతూ తీర్మానిస్తే అందుకు కట్టుబడతాను.” అని ఆంధ్ర పత్రిక (దినపత్రిక) లో 5-2-1973 నా ప్రకటన ఇచ్చాడు.

    ‘నా శాశ్వత చిరునామా విరసం’ అని 23-7-1980 లో ‘ఈనాడు’ లో వార్త: “…..విరసం పుట్టినప్పటి నుండి అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ నేను విరసం సభ్యుడినే. నా శాశ్వత చిరునామా విరసం. అఫ్హానిస్తాన్, అస్సామ్, వామపక్ష సమైక్యం మొదలైన రాజకీయ విషయాలలో నా అభిప్రాయాలన్నీ దుర్భ్రమలేనని గ్రహించాను. అందువల్ల ఇప్పటినుంచీ విరసం రాజకీయాలే నా రాజకీయాలు. సాహిత్యంలో ఎప్పుడూ అతివాదిగా వుంటున్న నేను రాజకీయాలలో మితవాదానికి, ఊగిసలాటకి లోనవుతూవచ్చాను. ఇది పొరపాటేనని ఒప్పుకుంటున్నాను..” అని
    శ్రీ శ్రీ ఊగిసలాట నిజం. ఆత్మ విమర్శ నిజం. విరసం ఏనాడూ తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. పైగా, ప్రత్యేక తెలంగాణ వుద్యమానికి సంపూర్ణ మద్ధతు ఇస్తూ వచ్చింది.
    ఈ సాహిత్య అభిమానికి చరిత్ర అభిమాని కూడా అయితే బాగుండు. స్వయంగా సాహిత్య, చరిత్రల అభిమాని, మిత్రుడు అయిన సంగిశెట్టి గారికి తెలంగాణ పట్ల విరసం ఎటువైపు నిలుచుందో తెలుసు.
    (this was a response to the FB link to this blog post.)

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.