15, జులై 2013, సోమవారం

చందమామ ప్రియుల బృందం
చం పి (అంటే  చందమామ పిచ్చోళ్ళ) కార్యక్రమాలు మంచి ఉధృతంగా ఉన్న2009లో,  ఆంద్రుల ఆరంభ శూరత్వానికి ప్రతీకగా చందమామ ప్రియులు యాహూ గ్రూప్ స్థాపించటంజరిగింది. బృందం ముఖ్య  ఉద్దేశ్యం,   అలనాటి చందమామ,  అంటే  1960 నుంచి 1980 వరకు కొడవటిగంటి కుటుంబ రావుగారు సంపాదకులుగా ఉన్న బంగారు కాలానికి  సంబంధించిన జ్ఞాపకాలు, చందమామ ప్రతులు గురించి చర్చ, వీలైన చోట పాత చందమామ ప్రతులు ఇచ్చి పుచ్చుకోవటం (ఇది జరిగే పనేనా), లేదా ఇప్పుడు పి  డి  ఎఫ్ లు (ఇప్పుడు బాగానే దొరుగుతున్నాయి కాని అప్పట్లో అవొక అపురూప అందని ద్రాక్ష పళ్ళు) పంచుకోవటం వంటి కార్యక్రమాలు. 

మొదట్లో చెప్పినట్టుగానే ఆరంభ శూరత్వమే కాని,  ఆ బృందం పని పెద్దగా జరుగలేదు. ఈలోగా ఒక ఉత్పాతం జరిగింది. నాకు యాహూ మెయిలులో చెత్త మైళ్ళు రావటం ఎక్కువయ్యి, చీకాకు పుట్టి ఒకానొక రోజున యాహూ మెయిలు పూర్తిగా తొలగించాను. తరువాత్తరువాత  ఎవరన్నా ఆ బృందంలో సభ్యత్వానికి నాకు మెయిలు పంపిస్తే,  అవి అనుమతించటానికి వీల్లేక పాపం వాళ్ళందరికీ, దాదాపు ఒక డజను మంది దాకా ఉన్నారు, ఉన్న విషయం చెప్పి ఊరుకున్నాను. 

కాని,  నిన్న ఒకాయన నాకు మెయిలు పంపారు, తనకు ఈ బృందం లో సభ్యత్వం కావాలని. ఆయన చెప్పిన మాటాలు, సభ్యత్వానికి ఆయన చూపిన ఉత్సాహం చూసి, మరొకసారి ప్రయత్నిద్దాం అని చూస్తె, సభ్యత్వ అభ్యర్ధనలు ఎలాగో నాకు జి మెయిలులో వస్తున్నాయి. సరే యాహూలో మరొక మెయిలు సృష్టించి బృందాన్ని పునరుధ్ధరించటానికి ప్రయత్నించాను. అనూహ్యంగా ప్రయత్నం ఫలించింది. 

ఇప్పుడు చందమామ అభిమానులకు విన్నవించేది ఏమంటే, ఆసక్తి ఉన్న వారు ఈ కింది లింకు నొక్కి ఈ చందమామ ప్రియులు బృందంలో సభ్యులుగా  చేరవచ్చు, వారి వారి జ్ఞాపకాలు, చందమామకు సంబధించిన సమీక్షలు వ్రాయవచ్చు, లేదా వారి వద్ద ఉన్న చందమామ ప్రతులు అందరితో పంచుకోవచ్చు (చదివి ఇచ్చేస్తామండీ  నిఝం). 


చందమామ ప్రియులు 

పాత చందమామలు ఇచ్చి పుచ్చుకోవటానికి అందరికీ సాధ్యపడని విషయం చివరకు చందమామ గురించి చర్చ చేద్దామని కూడా బృంద సభ్యులకు అనిపించటంలేదు. పోనీ ఎవరన్నా ఒక్క సమీక్ష వ్రాస్తారేమో అని చూసినా స్పందన లేదు. ఇంక ఈ చందమామ అభిమానుల బృందం దేనికి. కాబట్టి, తొలగించాను. తప్పలేదు, ఉత్సాహం లేని బృందం లేకపోతేనే మంచిది అని నా అభిప్రాయం. 

2 వ్యాఖ్యలు:

  1. Sir, my mother wants to subscribe for sanskrit chandamama. Can you please give me the address where we must sent money for it ? How many Rupees for yearly subscription ? Thanks to you for the great work.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @madhu,

    I wish to clarify that I do not belong to Chandamama Magazine. You may try the Chandamama Magazine website for your requirement. If the magazine is still alive, they will respond.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.