30, జులై 2014, బుధవారం

కార్తిక్ ఒక అద్భుతం

 
కార్తిక్ 
   ఫోటోలన్నీ ఈ టి వి సౌజన్యం    

మనం ఎప్పుడూ అంచనా వెయ్యని వ్యక్తి  ఒక గొప్పవాడిగా మన ముందు నుంచుంటే!   పాపం ఈ కుర్రాడు ఎలా ఉన్నాడో అని జాలి పడిన కుర్రాడు ఈ రోజున  వార్తల్లో వ్యక్తి  ఐతే! ఆశ్చర్యాన్ని మించిన సంభ్రమం అంతకంటే ఎంతో ఆనందం. వెంటనే ఆ వ్యక్తికి  మన శుభాకాంక్షలు చెప్పాలని ఆత్రుత. కాని ఎలా చెప్పాలి! నాకు ఈ వార్త మెయిలు ద్వారా అందచేసిన రాళ్ళబండి మురళీ కృష్ణ గారికి వెంటనే నా ఆనందాన్ని ఫోను చేసి తెలియచేసాను. ఈ కుర్రాడు ఆయనకు చాలా దగ్గర బంధువు. వాళ్ళింట్లో జరిగిన అన్ని శుభకార్యాల్లోనూ  తన తల్లి తండ్రులతో కలిసి కనిపించేవాడు. చాలా సామాన్యంగా కనపడుతూ ఎప్పుడూ చదరంగం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండే ఈ కుర్రాడు, ఇంతటి అసమాన్యుడని ఈ రోజు తెలియటం, పైగా   మా దగ్గర బంధువుకు బంధువు కావటం, మా విజయవాడ వాస్తవ్యుడు అవటం ఆనందాన్ని ద్విగుణీకృతం చేసింది. 

ఇంతకీ ఈ కుర్రాడు సాధించిన ఘనత ఏమిటి! ఆ ఘనత ఏమిటో మన మీడియా వారి మాటల్లోనే చూడవచ్చు.

కార్తిక్ గురించి టి వి 9 వాళ్ళు ప్రసారం చేసిన వార్త ఈ కింది వీడియో లో చూడండి: 



ఈ టి వి "యువ" కార్యక్రమంలో ఈ యువ క్రీడాకారుడు కార్తిక్ గురించిన విశేషాలు 



  కార్తిక్ కు మన:పూర్వక అభినందనలు 


ఇటువంటి అద్భుతమైన ప్రతిభ ఉన్న కొడుకును కన్నతల్లితండ్రులు నరసింహమూర్తి గారు, బాల సరస్వతి గారు అదృష్టవంతులు. వారికి నా తరఫున బ్లాగు ప్రపంచం తరఫున అభినందనలు. 


 శ్రీ షేక్ ఖాసీం 


ఈ కుర్రాడిలో ఉన్న స్పార్క్ కనిపెట్టి తగిన ప్రోత్సాహం ఇచ్చి కామన్వెల్త్ ఆటల్లో బంగారు పతకం సంపాయించటానికి బాట వేసిన కోచ్ షేక్ ఖాసీం గారికి ప్రత్యేక అభినందనలు. ఈ బంగారు పతకం వచ్చిన  ఉత్సాహంలో ఖాసీం గారు , కార్తీక్ ప్రతిభకు మరింత పదును పెట్టి గ్రాండ్ మాస్టర్ బహుమతి గెలుచుకోవటానికి ప్రోత్సహిస్తూ పునాది వెయ్యగలరని  నా నమ్మకం. 




"ఇంతకాలం కార్తిక్,  నరసింహ మూర్తి గారి కొడుకుగా తెలుసు, ఈరోజున నరసింహ మూర్తి అంటే కార్తిక్ తండ్రి అని చెప్పుకుంటున్నారు" అన్న కార్తిక్ తండ్రి నరసింహ మూర్తి గారి మాటలు, ప్రపంచంలో ప్రతి తండ్రి తన పిల్లల గురించి అనాలని ఉత్సాహపడే మాటలు, వారికి అలా అనగలిగే అదృష్టం కలగటం ఎంతో సంతోషాన్నిచ్చే విషయం.   ఆయన మాటలు ఆయనకు కలిగిన  పుత్రోత్సాహాన్ని,  ఆనందాన్ని తెలియచేస్తున్నాయి. కార్తిక్ ఇలాంటి  అవార్డులు మరిన్ని గెలిచి తనకు, తన కుటుంబానికి, దేశానికి మరింత పేరు తెచ్చిపేట్టాలని ఆశిస్తూ  ఆశీర్వాదం. అతని ఈ ప్రయత్నంలో  ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని నా కోరిక. 

కార్తిక్ కు వచ్చిన బంగారు పతకం గురించిన వివరం కామన్ వెల్త్  ఆటలపోటీలకు సంబంధించిన వెబ్ సైటులో ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు 

కామన్ వెల్త్  చెస్ చాంపియన్ షిప్ ఫలితాలు

కార్తిక్ పై విజయం సాధించినప్పటి ఫొటోలతో చిన్న వీడియో 
 








8 కామెంట్‌లు:

  1. కార్తిక్ కు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. Lakshman, Hari Babu, Radhakrishna

    Thank you for your congratulatory messages which are conveyed to Karthik through this blog.

    రిప్లయితొలగించండి
  3. అభినందనలు -ఆ కుర్రాడికి వార్తా పంపిన మీకూ -దుర్గా ప్రసాద్

    రిప్లయితొలగించండి
  4. Dasari Venkata Ramana General Secretary, Bala Sahitya Parishad1 ఆగస్టు, 2014 6:40:00 AM ISTకి

    శ్రీ ప్రసాద్ గారికి

    నమస్కారం, బ్లాగ్ చూశాను. కార్తీక్ కు హృదయ పూర్వక అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. Durga Prasad garu and Venkataramana garu.

    Thank you for your mails and your congratulations conveyed to Karthik through this blog.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.