7, ఆగస్టు 2014, గురువారం

సైలంట్ కీ సూర్యనారాయణగారు

  మా మంచి మితృలు, హామ్  లు అందరికీ "సూర్య" గా తెలిసిన చురుకైన  హామ్  శ్రీ జంధ్యాల సూర్యనారాయణ గారు 
 దాదాపుగా రెండు  దశాబ్దాలు పైగా గా స్నేహం. 1992 లో అనుకుంటాను విజయవాడలో ఉన్న హామ్  రేడియోక్లబ్ లో మొదలయ్యిన మా పరిచయం స్నేహంగా మారింది. మా ఇద్దరినీ కలిపింది హామ్  హాబీ, కానీ కలిపి ఉంచినది మాత్రం సూర్యనారాయణ గారి అద్భుత వ్యక్తిత్వం. నాకు ఆయనకు వయస్సులో ఎంతో తేడా,  నాకంటే మూడు  పదులు మించిన వయస్సు, ఎంతో అనుభవం. కానీ ఆయన స్నేహశీలత మమ్మల్ని కలిపి ఉంచింది, మా ఇద్దరమే కాదు విజయవాడలో ఉన్న ఎంతో మంది హామ్ లు అందరినీ కలిపి ఉంచిన పెద్ద మనస్సున్న పెద్దమనిషి సూర్యనారాయణగారు. హామ్  రేడియో ఆపరేటర్లల్లో అందరికంటే పెద్దవారు అలాగే ఎంతో చురుకైనవారు సూర్యనారాయణ గారు. పైనున్న ఫొటో, మేము 2009 లో బెంగుళూరు హాం ఫెస్ట్ లో కలిసినప్పుడు తీసినది. 

సూర్యనారాయణ గారు నిన్న (06 07 2014) బెంగుళూరులో  "సైలెంట్ కీ"* అయ్యిపోయ్యారని తెలిసి ఎంతో  బాధపడ్డాను.  ఈ బాధాకరమైన వార్త నాకు ఎస్ ఎం ఎస్ ద్వారా  తెలియచేసిన మూర్తి గారికి నేను పంపిన జవాబు:
 VERY SORRY to hear the news.  I am unable to reconcile to this sad news.  How many hours we had talked on band especially on 2 meter, almost every night during late 1990s.  Very recently when I heard of his sickness, I talked to him and he was his usual jolly self, bubbling with enthusiasm.  I shall be missing him very much. May JJS rest in peace.
సూర్యనారాయణగారి కుటుంబానికి నా తరఫున, హామ్ రేడియో హాబీగా గల అందరి తరఫునా ప్రగాఢ సంతాపం. 
నాలుగేళ్ళ పైనే అయ్యింది! 2010 జనవరిలో విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ నా హామ్  స్నేహితులు, అప్పుడప్పుడే స్నేహం మొదలయ్యిన బ్లాగ్ స్నేహితులను కలిసినప్పుడు సూర్యనారాయణ గారు ఆ అపురూప కలయికలో ప్రముఖ పాత్రవహించారు. ఆ విశేషాలు ఈ కింది లింకు నొక్కి చూడావచ్చు, చదవనూవచ్చు

================================================================================
*హామ్  రేడియో భాషలో, కీర్తిశేషులైన వారిని సైలెంట్ కీ గా వ్యవహరిస్తారు.ఈ మాట వాడుకలోకి వచ్చిన విధం ఈ కింది లింకు నొక్కి తెలుసుకోవచ్చు. 


================================================================================
















3 కామెంట్‌లు:

  1. VU2RJB Rajeswar from Australia via E mail8 ఆగస్టు, 2014 8:51:00 PM ISTకి

    RIP Very sorry to hear the news about Suryanarayana garu VU2JJS. Please pass on our heartfelt condolences to JJS family. Still remember those days in 80's when we all went to Visakhapatnam to write our first ASOC exam. Suryanarayana garu is well know our family, will convey the message to my father. I am on a short stay in Hyderabad visiting my parents and leaving tonight.

    రిప్లయితొలగించండి
  2. Thank you Rajesh for your message. Yesterday I was not myself and felt very very sad and melancholic.With all fondness I remember the great days of VU2NRL Club Station when you were In-Charge there, AIR net being conducted, Sockey, JJS,RRX and LNM coming there and the discussions and in between our Ham Radio lessons, most unforgettable days and quite nostalgic. Now that Krishi building where our Club station was used to be near PWD Grounds also has been removed in Vja.

    Anyhow, being mortals we can only pray for the departed Soul.

    With 73s, I remain.

    రిప్లయితొలగించండి
  3. DEAR SIVARAMAPRASAD,

    IT IS VERY SAD NEWS.MAY GOD GIVE HEAVENLY PEACE TO HIS SOUL.
    THANKS TO U FOR INFORMATION

    VU2JCC

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.