18, ఆగస్టు 2014, సోమవారం

సర్వే లో ఏమి అడగనున్నారు?

గత గురువారం రాత్రి ముంబాయిలో బయలుదేరి, శుక్రవారం నుండి  ఆదివారం సాయంకాలం వరకూ(15 08 నుండి 17 08 2014వరకూ) కూడా  హైదరాబాదులో ఉన్నాను. నేను వెళ్ళిన ముఖ్యమైన పని శ్యామ్  నారాయణ గారిని కలవటం ఆయన చేస్తున్న అద్భుతమైన సాహిత్య సంరక్షణా యజ్ఞాన్ని (అవును యజ్ఞమే! ఈ విషయమే మరొక వ్యాసం లో) ప్రత్యక్షంగా చూద్దామని. వెళ్ళిన పని అద్భుతంగా జరిగింది. మేము టిఫిన్ కని  కానీ  భోజనానికని కానీ  బయట తిరుగులాడు తుంటే,  నిన్న అంటే  17 08 2014 న గుంపులు గుంపులుగా సర్వే అధికారులు, తాము 19 08 2014 చెయ్యాల్సిన సర్వే గురించి "ట్రయల్" వేసుకుంటున్నారు. వాళ్ళను అడిగి ఆ సర్వే ఫారం (Intensive Houshold Survey 2014) సంపాయించాము. సామాన్య ప్రజలకు తెలియచెప్పటానికి, ఉద్యోగులకు ఈ పని ఎలా చెయ్యాలో తెలుసుకోవటానికి ఈ పని కొన్ని కొన్ని ముందుగా  నిర్ణయించబడిన ప్రాంతాల్లో చేసినట్టుగా తెలిసింది. 

ఇంతకీ ఈ సర్వేలో ఏమి అడగబోతున్నారు అని ఆసక్తిగా చూస్తె కనపడిన విశేషాలు మీరు కూడా చూడండి!

  (క్లిక్ చేసి పెద్దదిగా చేసి చూడవచ్చు)  
ప్రభుత్వం తలబెట్టిన ఈ సర్వేలో అభ్యంతర పెట్టవలసిన విశేషాలు, ఇంతకు ముందే ఏదో ఒక ప్రభుత్వ శాఖకో, సంస్థకో ప్రజలు తెలియచేయ్యని వివరాలు ఏమీ అడగటం లేదు. చాలా మామూలు వివరాలు అడుగుతున్నారు. అర్హత లేకుండా సంక్షేమ పథకాలు అనుభవిస్తున్న వాళ్ళు,  తెల్ల రేషన్ కార్డులు సంపాయించిన వాళ్ళు మాత్రమే  తమ బండారం బయటపడి పోతుందని కంగారు పడి పోవాలి కాని,  మిగిలిన వాళ్ళు చింతించాల్సిన  వివరాలు ఏమీ అడగటం లేదని నాకు అనిపించింది. అయినా నిన్న గాక మొన్న, గాస్ సబ్సిడీ దొరకదని, పెద్ద పెద్ద కార్లు ఉన్న వాడి దగ్గిరనుంచి ఎగబడి, తమ బాంకు ఖాతా నంబర్లను లైన్లో నిలబడీ తోసుకునీ  ఇచ్చిన వాళ్లకు ఈ సర్వేలో మరొకసారి తమ ఖాతా నంబరు ఇవ్వటంలో కంగారు దేనికో మరి!

ప్రభుత్వ శాఖలు/సంస్థలు  తమ గుడ్డి గుమాస్తా ఆలోచనల నుంచి బయటపడి  కొద్దిగా అంటే  కొద్దిగా తమ మధ్య సమన్వయం సాధించ గలిగి ఉండినట్టైతే,  ఇంతంత హైరానా పడి ఈ సర్వే నిర్వహించాల్సిన పనే లేదు.  పైనున్న వివరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర (ఏదో ఒక ప్రభుత్వ శాఖలోనో  సంస్థలోనో) ఇప్పటికే ఉన్నాయి. లేనిది ఏమంటే ఆయా గుమాస్తాల మధ్య సమన్వయం, ఉన్నది ఏమంటే గిరి గీసుకునే విపరీతమైన గుమాస్తా బుద్ధి.  అందుకే ఇంత ఖర్చు పెట్టి ఈ సర్వే  చెయ్యాల్సిన గతి పట్టింది.

నేను గమనించిన చాలా హాస్యాస్పదమైన విషయం ఏమంటే, ఈ సర్వే చూస్తె గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నట్టుగా ఉన్నది. మొదటి ప్రశ్న "మీ ఇంట్లో పంపు ఉన్నదా?" అని. ఇదెక్కడ విడ్డూరం! మునిసిపాలిటీ వాళ్ళకు తెలియకుండా పంపు ఎవరింటోనన్నా ఉండే అవకాశం ఉన్నదా అసలు!! అపార్టుమెంట్లల్లో ప్రతి కుటుంబానికి ఒక్కొక్క పంపు కనెక్షను ఉండదు, మరి ఈ కాలంలో ఏమి వ్రాయాలో?

ఈ హడావిడి అంతా   దొంగ  పంపు/కరెంటు కనెక్షన్లు పట్టేయ్యటానికి అనుకుంటే,  దానికి ఇంత హడావిడి పడాలా! నిష్పాక్షపాతంగా, అవినీతికి పాల్పడకుండా ప్రతి వార్డులోనూ ఆయా వార్డు అధికారులు నిమిషాల మీద దొంగ కనెక్షన్లను పట్టెయ్యచ్చు. ఈ అవినీతి, నిస్పక్షపాతత విషయాల్లో "ఆయనే ఉంటే...." చందాన ఉన్నది మన సమాజ పరిస్థితి. 

చివరగా,  ఇంత హంగామా చేసి, హడావిడిగా  చేస్తున్న ఈ సర్వే వివరాలు పొందు పరచటానికి తయారు చేసిన ఈ సర్వే పేపరు, పరమ నాసిరకంగా ప్రింటు చేశారు. సినిమా ఫాంఫ్లేట్ కంటే తీసికట్టయిన నాణ్యంలో ఉన్న పేపరు మీద ప్రింటు చెయ్యబడింది. నిన్న ప్రజలకు పంచిన నమూనా సర్వే పేపరు మీదేనే కనుక వివరాలు సేకరిస్తే, సేకరించే ప్రక్రియలోనే ఆ పేపర్లన్నీ ముడతలు పడి,  చిరిగి పనికి రాకుండా పొయ్యే పరిస్థితి. మౌలిక మైన సర్వేగా ఒక్కరోజులో చెయ్యాలని ప్రయత్నిస్తున్న ఈ సర్వే వివరాలు,  కనీసం కొంతకాలం ఉండాలి కదా! ఈ నమూనా పేపరు చూస్తె, ఆ వివరాలు కంప్యూటర్లోకి ఎక్కించేప్పటికే చీలికలు వాలికలు అయ్యేట్టుగా ఉన్నది. తరువాత్తరువాత కంప్యూటర్లో ఉన్న వివరానికి ప్రాతిపదిక ఏమిటి అని చూడవలసిన అవసరం వస్తే, ఈ కాయితాలు  (వీటిని గుమాస్తాలు ఎంత జాగ్రత్తగా పదిల పరుస్తారో మనకు తెలియదా, కట్టలు కట్టి  కారిడార్లల్లో, వరండాల్లో పారేస్తారు) దొరికి, సరిచూసుకునే అవకాశం  తక్కువ మరి!

ఏది ఏమైనా, ఒక్కరోజులో చేబట్టిన సర్వే  విజయవంతం అవుతుందా లేదా అన్న విషయం, అడ్మినిస్ట్రేషన్ కోణం నుంచి చాలా ఆసక్తిని కలిగిస్తున్నది.  ఉత్తరోత్రా ప్రభుత్వం ఇలాంటి సర్వేలు చెయ్యటానికి ఒక మంచి ప్రాతిపదిక, ఒక టెస్ట్ కేస్ గా ఉండాలని ఆశిద్దాం.  

పూర్తీ సర్వే  నమూనా, ఎట్లా ఉన్నదో   గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ వారి వెబ్ సైటు నుంచి డౌన్లోడ్ చేసిన ఈ క్రింది పి డి ఎఫ్ చెబుతున్నది. 

11 వ్యాఖ్యలు:

 1. ఈ సర్వే చేసేది ఆంధ్రా ఉద్యోగులను విద్యార్థులను వెళ్ళగొట్టడానికే అని తెలంగాణ సీయం పీఆర్వో చెప్పాడు (ఆఫ్ ది రికార్డ్:)). ఈ సర్వే ఆధారంగా ఆ పనిలో ఎంతమాత్రం సఫలీకృతం అవుతారో చూద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కార్థిక్ గారూ మీరు కూడా ఏమిటండీ!

   ఇదేదో మీడియావారు కలిగించిన భయం అని నా అనుమానం. అడిగే వివరాల్లో ఆ ప్రజల పుట్టు పూర్వోత్తరాల వివరాలు అడగనప్పుడు మీరన్నది ఎలా సాధ్యం. వెళ్ళగొట్టాలంటే సర్వేనే చెయ్యాలా! కాశ్మీరులో సర్వేచేసే పండింట్లను తరిమేశారా. ఇవన్నీ అనవసరపు భయాలు అని నా అభిప్రాయం.

   తొలగించు
  2. https://www.youtube.com/watch?v=zJo4KqF-qMc

   శివరాం గారూ,
   నేనిచ్చిన లింక్ చూడండి.. తెలంగాణ రాజముద్ర సాక్షిగా ఆ ముఖ్యమంత్రి పీఆర్వో చెప్పిన విషయం. ఆ పెద్ద మనిషే ఇది ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నా అని కూడా చెప్పాడు. ఇంకా ఇది మీడియా సృష్ఠి అని కొట్టిపారేయలేం..

   తొలగించు
  3. @Karthik,

   I have seen the video but I do not have any faith in the authenticity of the video as we do not know the identity of the person shooting off his mouth like that. If he is really PRO of the CM, he does not deserve to be a PRO anymore. Just because somebody is talking some rubbish with the background of Warangal Fort picture, we cannot be exactly take the video as authentic. I hope Police will see the video and take appropriate action.

   I do not know why you think this Survey is required if the powers that be decided to throw out the Andhrites from Telangana.

   తొలగించు
 2. సార్ సర్వే ఫారాన్ని OCR (optical character recognition) చేయడం కుదురుతుందా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. I uploaded two forms. First form is a hard copy of the form given to me as I was walking down the road in Amirpet near Gurudwara. I photographed the same and uploaded. The second one is taken from the website of GHMC and converted into image file to upload into the blog. From the first file OCR may not be possible to the extent my software knowledge goes.

   తొలగించు
  2. శివరాం గారూ,

   సీమాంధ్రులను తరిమేయడానికి ఈ సర్వేలతో పని లేకుండా చాలానే చెయ్యచ్చు. కానీ ఈ వీడియో చూశాక ఆ పనికి ఈ సర్వే ఎలా వాడుకుంటారనేది నాకు ఆసక్తిగా ఉంది.

   I completely agree with you that once government decides to throw people out, it doesnt need all this survey kind of things..

   తొలగించు
  3. OK Karthik jee. Lets wait and see. Yesterday, after completion of survey, CM made very enigmatic comments which sounded ominous. I hope better sense prevails on everybody.

   I am quite interested to see the success of the Survey as it is appearing to be and not the alleged hidden agenda. I am interested from the administrative angle. Let's wait and see the result and consequences.

   తొలగించు
 3. Pls visit
  http://harikaalam.blogspot.in/2014/08/blog-post_11.html
  (only for fun lovers on survey?!)

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.