చాలా కాలం క్రితం, ఆకాశవాణి వారికి బహిరంగ లేఖ(క్లిక్ చెయ్యండి) వ్రాస్తూ, ఇచ్చిన అనేక సూచనల్లో ఇంటర్నెట్ రేడియో మొదలు పెట్టండి బాబూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు, "మన" రేడియో వినే అవకాశం వస్తుంది అని మొత్తుకున్నాను. ఈ మాత్రం ఆలోచన ఆకాశవాణి వారికి వచ్చి ఉండదా, వచ్చే ఉండి ఉంటుంది. కాని వారి ప్రాధాన్యతలకు, శ్రోతల ప్రాధాన్యతలకు దూరం వల్ల, ఎలాగైతేనేమి, మన ఆల్ ఇండియా రేడియో వారు అనగా, ఆకాశవాణి వారు ఎప్పుడు మొదలుపెట్టారో ఏమో ఇంటర్నెట్ రేడియోలు ఒకటి కాదు రెండు మొదలు పెట్టేశారు! మొదటిది ఎఫ్ ఎం గోల్డ్
ఎఫ్ ఎం గోల్డ్ ను ఈ కింది లింకు నొక్కి వినవచ్చు.
రెండవ ఇంటర్నెట్ రేడియో "ఉర్దూ సర్వీస్"
ఉర్దూ సర్వీస్ ఇంటర్నెట్ రేడియోను ఈ కింది లింకు నొక్కి వినవచ్చు
ఈరోజున ప్రసార్ భారతి పరివార్ బ్లాగ్ (క్లిక్ చెయ్యండి) చూస్తుంటే, ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారి గారు ఉషశ్రీ, శ్రీరంగం గోపాలరత్నం, మధురాంతకం రాజారాం గార్ల మీద వ్రాసిన చిరు వ్యాసాలు నా దృష్టిని సహజంగా ఆకర్షించినాయి. అప్పుడు గుర్తుకు వచ్చింది మునుపు మన బాధను ఒక బహిరంగ లేఖగా వ్రాసాము కదా, ఆ విషయం ఈవిడకు తెలియచేద్దాము అనిపించింది. ఒకసారి A I R వారి వెబ్సైటు(క్లిక్ చెయ్యండి) చూసి మునుపు లేని అద్భుతాలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తె ఈ రెండూ కనిపించినాయి.
ఈ రెండు ఇంటర్నెట్ రేడియోలను పైనున్న లింకుల నుంచి వినాలని చూస్తె, వెబ్ పేజీ మొత్తం ఆక్రమిస్తున్నాయి. అందుకని A I R వారి వెబ్సైటు(క్లిక్ చెయ్యండి) వెళ్ళి అక్కడ కుడిచేతి పక్కనే పైన చూస్తె (ఈ కింది చిత్రంలో బాణం గుర్తు గమనించండి) రెండు లింకులు కనిపిస్తాయి. అవి నొక్కితే చిన్న ప్లేయర్ ఓపెన్ అయ్యి అందులో మనం వినవచ్చు.
ఎవరన్నా చెబితే ప్రభుత్వ గుమాస్తాలు వినరుకదా! ఈ రెండు ఇంటర్ నెట్ రేడియోలను వినటానికి ఆ ప్లేయర్లను వెబ్ సైట్లల్లోకి ఎంబెడ్ చేసే విధంగా విడ్జెట్ వారి వెబ్సైటులోనే ఇవ్వాలని ఆకాశవాణి వారికి తడితే బాగుండును, ఆసక్తి ఉన్న బ్లాగులు, వెబ్సైట్లు ఆకాశవాణి వారి రేడియోలను తమ తమ మీడియం ద్వారా ప్రచారం చెయ్యటానికి ఉంటుంది.
పైన చెప్పినట్టుగా మనం ఒక ఇంటర్ నెట్ రేడియో వింటూ ఉండగా రెండో లింకు ఆకాశవాణి వారి వెబ్ సైటులో నొక్కితే అది పేజీ మొత్తం తెరుచుకుని రెండు స్టేషన్లూ ఒకేసారి వచ్చి గందరగోళంగా ఉంటున్నది. ఆకాశవాణి వారికి వారంతట వారికే ఈ విషయం ఎప్పటికి చూసుకుని సరిచేస్తారో కదా ఒక బెంగ పట్టుకున్నది. మనం మైళ్ళు ఇచ్చి గందరగోళ పడి ఉపయోగం లేదని అనుభవం చెబుతున్నది మరి.
పైన చెప్పినట్టుగా మనం ఒక ఇంటర్ నెట్ రేడియో వింటూ ఉండగా రెండో లింకు ఆకాశవాణి వారి వెబ్ సైటులో నొక్కితే అది పేజీ మొత్తం తెరుచుకుని రెండు స్టేషన్లూ ఒకేసారి వచ్చి గందరగోళంగా ఉంటున్నది. ఆకాశవాణి వారికి వారంతట వారికే ఈ విషయం ఎప్పటికి చూసుకుని సరిచేస్తారో కదా ఒక బెంగ పట్టుకున్నది. మనం మైళ్ళు ఇచ్చి గందరగోళ పడి ఉపయోగం లేదని అనుభవం చెబుతున్నది మరి.
ఈ రెండు ఇంటర్నెట్ స్టేషన్లతో ఇక ఊరుకోకుండా, ఆకాశవాణి వారు తమ కేంద్రాలు అన్నిటి ప్రసారాలను ఇంటర్నెట్ ద్వారా కూడా ప్రసారం చెయ్యటం మొదలుపెడితే ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు తమ తమ ప్రాంతపు ఆకాశవాణి కేంద్ర ప్రసారాలు వినే అవకాశం వస్తుంది. ఈ పని ఇప్పటికే ఆకాశవాణి వారు మొదలు పెట్టారని అతి తొందరలో ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు ఇంకా తదితర తెలుగు కేంద్రాలు మనకు ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో వస్తాయని, రావాలని ఆశించటంలో తప్పులేదని నా ఆశ .
**************************************
**************************************
ప్రాంతీయ భాషా ప్రసారాలు ఎప్పుడు ఇంటర్ నెట్ లోకి వస్తాయా అని నేనూ ఎదురు చూస్తున్నాను. వెస్తే కనుక అవి ప్రయివేట్ రేడియోలకు గట్టి పోటీ ఇవ్వగలవు
రిప్లయితొలగించండి