ప్రముఖ రచయిత శ్రీ శ్రీరమణ,అలనాటి ప్రముఖ రేడియో కళాకారుడు శ్రీ ఎ బి ఆనంద్ |
మనకు ఇంటర్నెట్లో అప్పుడప్పుడూ అనేకంటే చాలా సార్లు, అనుకోకుండా భలే విషయాలు, విశేషాలు కనపడుతూ ఉంటాయి. ఉషశ్రీ గారి గురించి యుట్యూబ్లో ఏమున్నదో అని వెతుకుతూ ఉంటే, ఒక అద్భుతమైన రెండు గంటల వీడియో దొరికింది. ఉషశ్రీ గారికి నివాళి అర్పిస్తూ ఇద్దరు అద్భుత వ్యక్తులు చేసిన ప్రసంగాలు ఉన్నాయి. ఒకరు ప్రముఖ రేడియో ఆర్టిస్టు శ్రీ ఎ బి ఆనంద్ గారు రెండోవారు ప్రముఖ రచయిత శ్రీ శ్రీరమణ గారు.
ఎ బి ఆనంద్ గారి గొంతు చిరపరిచితమే కాని, ఈ మధ్య వరకూ కూడా ఆయన్ను కలిసే అవకాశం రాలేదు, కాబట్టి ఎలా ఉంటారో తెలియదు. శ్రీరమణ గారి రచనలే నాకు తెలుసు కాని, ఆయన ఎలా ఉంటారో తెలియదు. వారి వారి కళారూపాలతో ఎంతో పరిచయం ఉండి, వారిని చూసే అవకాశం ఈ ఉభయకుశలోపరి వీడియో వల్ల కలిగింది. ఇంత చక్కటి వీడియోను అందరికోసం యు ట్యూబులో ఉంచిన ఉషశ్రీ గారి కుమార్తెలకు కృతజ్ఞతలు.
వీడియోను ఇక్కడే అందిస్తున్నాను వినవచ్చు, చూడవచ్చు.
ఉషశ్రీ గారు ధర్మసందేహాలు కార్యక్రమంలో గురువుగారిగా ప్రసిద్దులైతే, అతి కొద్దిగా మాట్లాడుతూ, ఆ కార్యక్రమాన్ని శ్రీ గురుభ్యోన్నమః అంటూ మొదలుపెట్టే శ్రీ ఎ బి ఆనంద్ గారు కూడా అంతే ప్రసిద్ధులు.
ఎ బి ఆనంద్ గారు గంటకు పైగా మాట్లాడారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో, ఉషశ్రీ గారి తో తాను కలిసి పనిచేస్తున్నప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా మనకోసం చెప్పారు. శ్రీరమణ గారు తనకు ఉషశ్రీ గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకుని చాలా విషయాలు చెప్పారు.
ఈ వీడియోలే అలనాటి విశేషాలు అనేకానేకం ఉన్నాయి, ఆసక్తి, అభిరుచి ఉన్న వారికి ఎంతైనా ఆనందదాన్నిస్తాయి.
ఉషశ్రీ గారితో ఐదు నిమిషాలు
ఉషశ్రీ గారు ధర్మసందేహాలను నివృత్తి చేస్తూ ఉన్న ఈ వీడియో Ushasri.org వారి సౌజన్యం.
శివ గారూ!
రిప్లయితొలగించండియెవరు ఒప్పుకున్నా, లేకున్నా, ఆంధ్రులందరికీ గురువైన ఉషశ్రీ గురించి ఓ అపూర్వ అనర్ఘ రత్నాన్ని అందించారు. సదా కృతజ్ఞులం.
Thank you Sastryjee. In fact your Thanks are to be conveyed to Ushasri.org and Daughters of Shri Ushasri.
తొలగించండి