26, జనవరి 2015, సోమవారం

వెళ్ళిపోయిన "కామన్ మాన్" సృష్టికర్త

శ్రీ ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన కార్టూన్ పాత్ర "కామన్ మాన్" విగ్రహం (ముంబాయి వర్లీ సముద్రపు ఒడ్డున)
ప్రపంచలో ఎక్కడన్నా ఒక రచయిత సృష్టించిన పాత్రకు విగ్రహాలు ఉన్నాయా! నాకైతే తెలియదు. కాని,  మన భారత
తాను సృష్టించిన పాత్రతో తన బొమ్మను గీసుకున్న శ్రీ లక్ష్మణ్
దేశంలో జరిగిన ఒక అద్భుత సంఘటన,  ఒక కార్టూనిస్టు సృష్టించిన పాత్ర ఎంతగా పేరు తెచ్చుకున్నది అంటే ఆ పాత్రకు ప్రజలు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు, అది కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు (మన ఘంటసాల విగ్రహాలు లాగా!), ముంబాయి నడిబొడ్డున, వర్లీ ప్రాంతం లోని సముద్రపు ఒడ్డున. అదీ ఆ కార్టూనిస్టు గొప్పతనం. ఆయనే శ్రీ ఆర్ కే లక్ష్మణ్. ఈ రోజున (26 01 2015) వెళ్ళిపోయారు. కొద్ది సంవత్సరాలుగా ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నారు, ఈ మధ్యనే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిసి బాధపడుతూ, భయపడుతూ ఉన్నారు ఆయన అభిమానులందరూ (కానివారు ఎవరన్నా ఉన్నారా!). 


 శ్రీ ఆర్ కే లక్ష్మణ్
ఆయన కార్టూన్లు ఎంత నిత్యనూతనంగా ఉంటాయి అన్న విషయానికి ఒక్కటే ఉదాహరణ. ఆయన ఆరోగ్యం బాగుండక గత రెండు మూడు సంవత్సరాలబట్టీ కార్టూన్లు పెద్దగా వెయ్యటం లేదు . కాని ఆయన పనిచేస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక (అందులోనే ఆయన ఏభైసంవత్సారాల పైగా పనిచేస్తున్నారు)లక్ష్మణ్ గారు ఎప్పుడో దశాబ్దాలక్రితం వేసిన కార్టూన్లనే ఎవరికీ చెప్పకుండా పునఃప్రచురిస్తున్నా ఎవరికీ  తేడా  తెలియటంలేదు.మాల్గుడీ డేస్ కథలకు బొమ్మలు వేసినది లక్ష్మణ్ గారే, ఆ కథలు వ్రాసినది ఈయన అన్న గారైన ఆర్ కే నారాయణ్. మన బాపు రమణలు అన్నదమ్ములు కాదు, ఇక్కడ వీరిద్దరూ అన్నదమ్ములు అంతే తేడా!

శ్రీ లక్ష్మణ్ గారు తన కార్టూన్ల ద్వారా ఎప్పటికీ చిరంజీవే!
*****************************************************************************

ఆయన వేసిన కార్టూన్లు చూడాలంటే నెట్లో అనేకం. ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు. ఈ కింది లింకులో దొరికే కార్టూన్లలలో ఒక్కొక్క దానిమీద నొక్కి చూస్తూ రోజంతా గడిపెయ్యచ్చు. 

ఆర్ కే లక్ష్మణ్ కార్టూన్లు 

నాలుగేళ్ల క్రితం లక్ష్మణ్ గారి 90జన్మదినోత్సవం సందర్భంగా సిఎన్ఎన్-ఐబిఎన్ ప్రసారం చేసిన చక్కటి కార్యక్రమం 


శ్రీ ఆర్కే లక్ష్మణ్ తన 94వ ఈట 26 01 2015న మరణించారు

1 వ్యాఖ్య:

  1. మంచి నివాళి . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఓ సంవత్సరపు కొత్త కాలెండర్ మొత్తం లక్ష్మణ్ గారి కార్టూన్లతోనే తయారు చేసారు. అపురూపమైన కాలెండర్ అది. ఆర్ కే లక్ష్మణ్, బాపూ గార్ల వంటి కార్టూనిస్టులు న భూతో న భవిష్యతి.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.