గత కొన్ని నెలలుగా మా పాత మాష్టార్లు, లెక్చరర్లు అందరూ జ్ఞాపకం వచ్చి వాళ్ళ ఫొటొల కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాను, కాని ఫలితం శూన్యం. ఒక 15-20 ఏళ్ళ క్రితం వరకూ కూడా కనపడుతూనే ఉండేవాళ్ళు. అప్పుడు ఫొటో తీసుకోవాలన్న జ్ఞానం లేకపొయ్యింది. సరె, ఈ ఉపాధ్యాయ ఉత్సవ సందర్భంగా నాకు చదువు చెప్పిన మాష్టార్లు అందరినీ ఒక సారి తలుచు కుందామని ఒక ప్రయత్నం చేసి చూస్తాను.
నా మొట్టమొదటి గురువు ఎవరూ అని ఆలోచిస్తే, జ్ఞాపకాల పొరల్లో శోధిస్తే, మా తాతయ్య. ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పేవాడు. అవి అలా ఆడుతూ పాడుతూ విన్నా కూడా బాగానే వంటబట్టినాయి.
అక్షరాభ్యాసం: అప్పట్లో ఐదు సంవత్సరాలు వస్తే కాని అక్షరాభ్యాసం చేశే వాళ్ళు కాదు. నాకు అక్షరాభ్యాసం చేసిన గురువు గారు శ్రీ వేము కృష్ణ మూర్తిగారు. ఆయన మాకు దూరపు చుట్టమే. పంచ లాల్చీ తో వచ్చేవారు, మా చిన్న అమ్మమ్మ గారి మనవడి ఇంట్లో (గాంధీ నగర్, విజయవాడ) అద్దెకు ఉండేవారు. ఆయన పొడుం బాగా పీల్చేవారు, అదే వాసన ఆయన దగ్గర. నాకే కాదు మా ఇంట్లో మా చివరి తమ్ముడి కి తప్ప అందరికీ ఆయనే అక్షరాభ్యాసం చేసారు.
ఒకటో తరగతి, రెండో తరగతి పెద్దగా గుర్తు లేదు. మూడో తరగతి లో కూడా ఒక మాష్టారు సన్నగా పొడుగ్గా ఉండేది ఆవిడ పేరు గుర్తు లేదు. లీలగా గుర్తుకు వస్తున్నారు. జ్ఞాపకాలను ఫోటో తియ్యగలిగితే ఎంత బాగుండును!
నేను నిజానికి నాలుగో తరగతి వరకూ కూడా స్కూలుకు పెద్దగా వెళ్ళలేదు. ఇంట్లోనే చదువు. నాలుగో తరగతి నుంచి రోజూ స్కూలుకు వెళ్ళటం. మూడు తరగతుల వరకూ, మా సత్యనారాయణ పురంలో ఉన్న ప్రముఖ ఇంజనీరు కే ఎల్ రావు గారి ఇంట్లో ఉండే స్కూలు, మా పక్క వీధిలోకి మారింది.
అప్పట్లో ఈ ఎలిమెంటరీ స్కూల్లో, సుందరరావు మాష్టారు ఉండేవారు. ఆయన చందమామ చదువుతూ ఆ కథలు చెప్పేవారు. ముఖ్యంగా బెతాళ కథ చదివి చెప్పటం ఇప్పటికీ ఇంకా గుర్తుకు వస్తున్నది. తరువాత రామారావు గారని ఒకాయన, బాగా కుర్రవాడు. మంచి బలిష్టంగా ఉండేవారు. హేడ్మాష్టారు కృష్ణమూర్తిగారు, రాధా మాష్టారు (మగాయనే, రాధాకృష్ణ మూర్తి గారు), ఆయన నాటకాల్లో కూడా వేషాలు వేసేవాడు. సరదాగా ఉండేవారు. లక్ష్మీనారాయణ మాష్టారు ఇంకా అనేకమంది.
ఒకరోజున అసెంబ్లీ జరిపి ఆరోజున చెప్పారు, ఒక మాష్టారు ఆయన పేరు గుర్తు లేదు, రూపం గుర్తుకు వస్తున్నది, ఆయన పొయ్యారని, డబ్బులు లేవని. పిల్లలు అందరూ తమ దగ్గర ఉన్న చిల్లర అంతా ఇచ్చేసారు. ఎందుకు, ఆ మాష్టారిని "తీసుకు వెళ్ళటానికి" డబ్బులు లేక. అంత దుర్భరంగా ఉండేవి మాష్టార్ల బతుకులు.
అప్పుడే సీతా టీచర్ అని ఒకావిడ చేరారు. ఆవిడే మాకు ఐదో క్లాసుకు టీచరు.ఒక క్రిస్టియన్ ఆవిడ ఒకరు అప్పటికి హెడ్ మాష్టారుగా వచ్చింది. అప్పటివరకూ ఉన్న కృష్ణ మూర్తిగారు హైస్కూల్లో టీచరుగా వెళ్ళిపొయ్యారు.
మా స్కూలు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం హై స్కూలు. ఆ స్కూలుకు అంతకు ముందు పేరు టి వి ఎస్ చలపతిరావు స్కూలు అని ఉండేదిట.తరువాత మార్చారు. మాష్టార్లల్లో అప్పారావు గారు బొమ్మలు నేర్పే డ్రాయింగ్ మాష్టారు. సుదర్శనం గారని ఉండేవారు ఆయన ఏమి చెప్పేవారో తెలియదు. ఒక్క పరీక్షలప్పుడు కనపడే వారు. ఆ ప్రశ్న పత్రాలూ వాటి లెక్కలూ అవ్వీ చూస్తూనూ. ఒక మాష్టారి పేరు ఎల్ సి సి ఆ పేరేమిటో గమ్మత్తు పేరు. లేదంటే నేను అలా గుర్తుపెట్టుకున్నానో. ఆయన పేరు ఎదో ఉండి ఉంటుంది, ఇనీశియల్స్ ఎల్ సి సి అయ్యి ఉండాలి. మయూరం గారు సైన్సు చెప్పేవారు ఎప్పుడూ చేతిలో ఒక స్కేలు పట్టుకుని ఉండేవారు. ఆంజనేయులు మాష్టారిని ప్రతి సంవత్సరం ఎస్ ఎస్ ఎల్ సి కుర్రాళ్ళు కొట్టేవాళ్ళు. కారణం తెలియదు. స్కూల్లో ఎప్పుడన్నా సినిమా వేసేవారు. సినిమా కంటే ప్రొజెక్టరు చూడటానికి వేల్లెవాడిని. ప్రొజెక్టరు నడపటం ఐజయ్యగారు అని ఇంగ్లీషు, లెక్కల మాష్టారు చూసేవారు.
చాలా మంది మాష్టార్లకి నిక్ నేమ్స్ ఉండేవి. అవి ఇప్పుడు చెప్పటం భావ్యం కాదు.పెద్దగా గుర్తు కూడా లేవు.
కాలేజీ పేరు శాతవాహనా కాలేజీ. ఒక గోడౌన్ లాగా ఉండేది. గ్రౌండ్ లేదు, స్పోర్ట్స్ కి అవకాశం లేదు. షిప్ట్ కాలేజీ. ఇంటర్ మొదటి సవత్సరం అంతా కూడా సాయంత్రం షిప్ట్. అంటే మధ్యాహ్నం పన్నెండున్నరకు మొదలయ్యి, సాయత్రం ఐదూ పదికి అయ్యేది. ఇంటర్ రెండో సంవత్సరం నుంచీ బీకాం అయ్యే వరకూ కూడా పొద్దుటి షిఫ్ట్, ఉదయం ఏడున్నరకు మొదలు, పన్నెండూ పదికి అయిపొయ్యేది.
అప్పటి టీచర్లు లెక్చరర్లు ఎవరు అని గుర్తుకు తెచ్చుకుంటే, గుర్తున్నంత వరకూ కూడా ఇలా జాబితా తయారయ్యింది.
అలనాటి నా మాష్టార్లు అందరికీ ఈ ఉపాధ్యాఉత్సవ సందర్భంగా నమస్కారాలు. ఆయా మాష్టార్ల దగ్గర చదువుకున్న అప్పటి విద్యార్ధులు ఎవరన్నా నేను వ్రాసిన ఈ రెండు మాటలు చదివితే, వారి దగ్గర అప్పటి టీచర్ల ఫోటోలు ఉండి ఉంటే పంపితే ఎంతయినా సంతోషం. అప్పట్లో మాకు గ్రూప్ ఫోటోలు తియ్యలేదు.
ఆరో క్లాసు రోల్ నంబరు 144

తెలుగు
|
శ్రీ తాతాచార్యులు
|
ఇంగ్లీషు, సోషల్,లెక్కలు
|
శ్రీ కృష్ణ మూర్తి
|
హిందీ
|
శ్రీమతి భాస్కరమ్మ
|
సైన్స్
|
శ్రీ సత్యనారాయణ
|
నేత
|
శ్రీ కృష్ణ మూర్తి
|
డ్రిల్
|
శ్రీ మేకా సుబ్బారావు
|
ఎడో క్లాసురోల్ నంబరు 139
ఇంగ్లీషు,సోషలు, లెక్కలు
|
శ్రీ పరమేశ్వర రావు
|
తెలుగు
|
శ్రీ తాతాచార్యులు
|
తెలుగు నాన్ డిటైల్
|
శ్రీ పొట్టి సుబ్బా రావు
|
హిందీ
|
శ్రీమతి భాస్కరమ్మ
|
సైన్స్
|
శ్రీ సత్యనారాయణ
|
ఎనిమిదో క్లాసు రోల్ నంబరు 642
ఇంగ్లీషు
|
శ్రీ ప్రకాశరావు
|
లెక్కలు
|
శ్రీ మంత్రాల మల్లికార్జున రావు
|
సైన్స్
|
శ్రీ ఆంజనేయులు
|
తెలుగు
|
శ్రీ లక్ష్మీ నారాయణ
|
హిందీ
|
శ్రీమతి భాస్కరమ్మ
|
నాచురల్ సైన్స్
|
శ్రీమతి లలితా టీచర్
|
తొమ్మిదో క్లాసు రోల్ నంబరు 1173
ఇంగ్లీషు, లెక్కలు
|
శ్రీ పొట్టి రామారావు
|
సైన్సు
|
శ్రీమతి లలితా టీచర్
|
సోషల్
|
శ్రీ క్సేవియర్
|
హిందీ
|
శ్రీ బిల్హణ శాస్త్రి
|
తెలుగు
|
శ్రీ పద్మనాభ శాస్త్రి
|
పదో క్లాసు రోల్ నంబరు 1409
లెక్కలు, ఇంగ్లీషు
|
శ్రీ జే ఐజయ్య
|
సైన్సు
|
శ్రీ అవధాని (హెడ్ మాష్టారు)
|
తెలుగు
|
శ్రీ పద్మనాభ శాస్త్రి
|
సోషల్
|
శ్రీ గోపాలకృష్ణ మూర్తి
|
హిందీ
|
శ్రీ బిల్హణ శాస్త్రి
|
ఇంటర్ మొదటి/రెండవ సంవత్సరం రోల్ నంబరు 425
తెలుగు
తెలుగు రెండో సంవత్సరం |
శ్రీ లక్ష్మణ రావు
శ్రీ మహతీ శంకర్ |
తెలుగు నాన్ డిటైల్
|
శ్రీ ఆచార్యులు
|
కామర్సు
|
శ్రీ ప్రకాశం
|
ఎకనామిక్స్
|
శ్రీ కృష్ణా రావు
|
అక్కౌంట్స్
|
శ్రీ బ్రహ్మయ్య
|
సివిక్స్
|
శ్రీ రాఘవాచారి
|
ఇంగ్లీషు
|
శ్రీ సుదర్శనరావు
|
ఇంగ్లీషు నాన్ డిటైల్
|
శ్రీ వెంకటేశ్వర రావు
|
ఎకనామిక్స్ (రెండో సంవత్సరం)
|
శ్రీ రామచంద్ర మూర్తి
|
బి కాం మూడు సంవత్సరాలు రోల్ నంబరు 547
తెలుగు
తెలుగు నాన్ డిటైల్ |
శ్రీ మహతీ శంకర్
శ్రీ లక్ష్మీ నారాయణ |
ఇంగ్లీషు
|
శ్రీ వి ఎల్ ఎన్ శాస్త్రి
|
అక్కౌంట్స్
|
శ్రీ బ్రహ్మయ్య
|
కమర్షియల్ జాగ్రఫీ
|
శ్రీ పి కే డి ప్రసాద రావు
|
కామర్స్
|
శ్రీ ప్రకాశం
|
ఎకనామిక్స్
|
శ్రీ కృష్ణా రావు /శ్రీ రామచంద్ర మూర్తి
|
బిజినెస్ ఆర్గనైజేషన్ |
శ్రీ రవి శంకర్
|
బాంకింగ్
|
శ్రీ రామకోటేశ్వర రావు
|
ఎక్కౌంట్స్
|
శ్రీ పి కే డి ప్రసాద రావు
|
అక్కౌంట్స్
|
శ్రీ రవి శంకర్
|
స్టాటిస్టిక్స్
|
శ్రీ రవి శంకర్
|
మార్కన్టైన్ లా
|
శ్రీ లక్ష్మయ్య
|
కాస్టింగ్
|
పేరు గుర్తుకు రావటం లేదు
|
చాలా బావుందండీ. మీరు విజయవాడలో పెరిగారని నేను గుర్తించలేదు. మేం మాచవరంలో ఉండేవాళ్ళం, నేను మొగల్రాజపురంలో విద్యోదయ స్కూల్లోనూ, గుణదల బిషప్ గ్రాసీ హై స్కూల్లోనూ, ఇంటరు లొయొలాలోనూ చదివాను.
రిప్లయితొలగించండిధన్యవాదాలు నారాయణ స్వామి గారూ. ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు వింటూ, చందమామ చదువుతూ పెరిగినవాణ్ణి. మరొక విజయవాడవాసి ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉన్నది. ఈ వ్యాసం నేను లండన్లో ఉన్నప్పుడే, గురుపూర్ణిమ సందర్భంగా ప్రచురిద్దామని మొదలుపెట్టి పూర్తి చెయ్యలేదు. సందర్భానుసారం ఇవ్వాళ ఉపాధ్యాయ ఉత్సవ సందర్భంగా పూర్తిగా వ్రాసి, ప్రచురించాను.
తొలగించండిబాగుంది.
రిప్లయితొలగించండిWell Said. I will talk with my school teacher on every 5th September.
రిప్లయితొలగించండిచాలా బాగా వ్రాసారు. ఇప్పటికీ ఆ గురువుల పేర్లన్ని గుర్తుండడం విశేషం.
రిప్లయితొలగించండిమీ టపా స్పూర్తితో, నేను కూడ నా గురువులను గుర్తుతెచ్చుకుంటూ ఒక టపా వ్రాసాను.