17, ఆగస్టు 2016, బుధవారం

సునీల్ కు బహిరంగ లేఖ("జక్కన్న" సినిమా చూసిన దురదృష్టం తరువాత)



బాబూ సునీలూ,

నువ్వు వేసిన కొన్ని హాస్యగాడి పాత్రల వల్లమాత్రమే నీకు కొద్దో గొప్పో పేరు వచ్చిందన్న విషయం ఒప్పుకునే స్థితిలోనే ఇంకా ఉన్నావని తలుస్తున్నాను. 

నీకు ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోతె ఎక్కడో అక్కడ  ఒక చిన్న ప్రకటన చేస్తే  చాలు, ఇదివరకు నువ్వు చేసిన హాస్యం  ఆస్వాదించిన అభిమానులు వారి శక్తానుసారం నీకు విరాళాలు పంపి నీకు ఇబ్బంది లేకుండా  చూసుకునే అవకాశం ఉన్నది. ఎంత డబ్బులకు  ఇబ్బందైతే మాత్రం "జక్కన్న" వంటి దిక్కుమాలిన సినిమాలో హీరో గా వెయ్యటానికి నీకు సిగ్గు వెయ్యకపోవటం ఆశ్చరం కలిగిస్తున్నది. 

"జక్కన్న" సినిమాలో ఏమి చూసి నటించటానికి ఒప్పుకున్నావయ్యా! 


కథ                
లేదు. అందులో ఉన్నది కథే అయితే రచయిత అన్న ప్రతివాడూ సిగ్గుతో తల వంచుకోవాలి.
దర్శకత్వం
లేదు.  దర్శకత్వం అంటే ఏమిటో తెలియని వేర్రివాడు తీసిన సినిమా ఇది
కూర్పు (Editing)
లేనే లేదు
హాస్యం
లేదు.
నటన
అసహ్యకరం


ఛీ! ఇటువంటి సినిమాల్లో నటించిన నీ సినిమాలు పొరబాటున కూడా మళ్ళీ చూడకూడదని నిర్ణయించుకుని నీకు ఈ విధంగా తెలియచేయటమైనది. చివరకు విశ్వనాధ్ దర్శకత్వంలో (పాపము శమించు గాక) నువ్వు నటించినా సరే  ఆ సినిమా పోస్టర్ చూడటం కూడా  నా దురదృష్టం గా భావిస్తాను. 

ఇకనైనా నువ్వు హీరో వేషాలు వెయ్యగలవన్న అపనమ్మకం నుంచి బయటపడి, ఇదివరకు వేసే హాస్యగాడి పాత్రలే వేసుకుంటూ ఉంటే మంచిది. మర్యాద రామన్న సినిమా విజయవంతం అవటం నీకు కొమ్ములు తెప్పించినట్టుంది. ఆ సినిమా తీసినాయన ఒక "దర్శకుడు". ఈగతో కూడా సినిమా తీసి విజయవంతంగా  నడిపించగలిగిన సమర్ధుడు. అటువంటి వాడి దర్శకత్వంలో హీరోగా వేసి ఆ సినిమా విజయవంతం నీ హీరో వేషానికి విజయం అనుకోవటం నీ నిరక్షరాస్యతను తేటతెల్లం చేస్తున్నది. ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండి, శేషజీవితాన్ని "నటుడు" అనిపించుకునే ప్రయత్నం చేస్తావని భావిస్తాను. 

ఇట్లు 

ఒకప్పటి అభిమాని. 

8 కామెంట్‌లు:

  1. చాలా కరెక్టుగా చెప్పారు శివరామప్రసాద్ గారూ! అదృష్టవశాత్తు లేదా ముందు చూపు వల్లనో ఈ సినిమా చూడలేదు. సునీల్ కి హీరో పిచ్చి పట్టాక మంచి హాస్యనటుడిని పోగొట్టుకున్నామని ఎప్పుడూ అంటుంటాను. మనకి కావాల్సినంతమంది కొత్త హాస్య నటులు దొరుకుతారు. వస్తూనే ఉంటారు. అతనికి మనలాంటి హాస్యాభిమానులు దొరకడం దుర్లభం. ఆ విషయం సునీల్ అర్ధం చేసుకోకపోతే అది వాడి ఖర్మ.

    రిప్లయితొలగించండి
  2. జక్కన్న నేను చూడలేదు గానీ సునీల్ గురించి మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తాను...అయితే మరీ అంత కోపగించకండి...సునీల్ మారితే ఆదరిద్దాం...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మారితే అప్పుడు చూద్దాం. అప్పటిదాకా అతని సినిమాలకు బహిష్కరణే మందు. జక్కన్న ఒక సినిమానా! ఛీ!!

      తొలగించండి
  3. అభిమానికి కోపం తెప్పిస్తే ఇలా........ సునీల్ ప్రసాదు గారి విలువయిన సూచనలు పాటించాలని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.