ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గీసిన బాబు రేఖా చిత్రం.ఒక కార్టూనిస్ట్ బొమ్మను మరొక కార్టూనిస్ట్ వెయ్యటం ఇదేప్రధమం అనుకుంటాను. అడిగిన వెంటనే జయదేవ్ గారు తన స్నేహితుడు మరియు సహ కార్టూనిస్ట్ అయిన బాబు చిత్రాన్ని చిత్రంగా గీసి పంపించారు. బాబు పేరుననుసరించి, బాబును చిన్నపిల్లవాడిగా వేసి,పెద్దవాళ్ళ తలకాయ గీసారు. భాబుకు చిన్న పిల్లలో ఉండే ఉత్సుకత, పరిశీలనా జ్ఞానం ఇప్పటికీ ఉన్నాయని, వీటన్నిటిని పెద్ద తలకాయతో అలోచించి అద్భుతమైన కార్టూన్లు గీస్తున్నరని జయదేవ్ చెప్పకనే చెపుతున్నారు.
బాబు-జయదేవ్
బాపు తెలుగు కార్టూన్లకు ఆద్యుడయితే, బాబు-జయదేవ్ రెండు కళ్ళలాంటివారు. ఇద్దరూ ఓకరికొకరు స్పూర్తిగా, స్నేహపూర్వక పోటీ తత్వంతో, తెలుగు వ్యంగ్య చిత్ర విభాగానికి ఏనలేని సేవ చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ నిజ జీవితంలో ప్రియ మిత్రులు.
బాబు కథ
మనకున్న అగ్రగామి వ్యంగ్య చిత్రకారులలో, బాపు మరియు బాబు తప్ప మిగిలిన అందరూ, తమ తమ పేర్లను లేదా తమ పేర్లలోని కొంత భాగాన్ని తమ వ్యంగ్య చిత్రానికి సంతకంగా వాడుతుంటారు. బాబు, ఈ విధంగా పొడి అక్షరాలను వాడటానికి కారణం, వీరి చిన్నతనంలో, కుటుంబ సభ్యులు, మేనమామలు ముద్దుగా "బాబు" అని పిలిచేవారట. తన ముద్దుపేరునే తన కలంపేరుగా మార్చుకుని కలకాలం నిలిచేట్టుగా చేశారు.
కార్టూన్ల ప్రత్యేకత
వ్యంగ్య చిత్రాలకు ప్రాణం బొమ్మలో నాణ్యం. వీరు గీసే కార్టూన్లలోని చిత్రాలన్నీ కూడా చాలా నాణ్యమయినవే! చక్కటి గీతల కలయికతో భావయుక్తమయిన కార్టూన్లను గీయటం వీరి ప్రత్యేకత. కార్టూన్‌లో ఎంతవరకూ అవసరమో అంతవరకే వివరాలను చిత్రీకరిస్తారు. అనవసరమైన ఆర్భాటాలు వీరి కార్టూన్లలో ఉండవు. బొమ్మలు చక్కగా కుదురుగా ఉండి చూసి ఆనందించటానికి అనువుగా ఉంటాయి. మంచి చేతివ్రాతతో, అంతకంటే మంచి మాటల పొందికతో చదవగానే అర్ధమయ్యి నవ్వు తెప్పించే సంభాషణలు వ్రాయటం వీరి మరొక ప్రత్యేకత.
ఏకవిషయ-వ్యంగ్య చిత్రాలు
సామాన్యంగా, వ్యంగ్య చిత్రకారులు, తమ కార్టూన్లలో, ఒక్కొక్క కార్టూన్‌లోఒక్కో విషయం మీద హాస్యాన్ని గుప్పిస్తూ ఉంటారు. కాని, బాబు ఏదో ఒక విషయం తీసుకుని ఏకవిషయ-వ్యంగ్య చిత్రాలు అనేకం గీయటంలో మంచి దిట్ట.
ఆనందమంటే:చిన్న చిన్న ఆనందాలు-పెళ్ళాంతో వాదించి గెలవటం(భర్త మొహంలో అనిర్వచనీయమైన మహదానందం), వచ్చిన చుట్టం వెళ్ళిపోవటం, స్నేహితుడు హోటలు బిల్లు చెల్లించటం(ఆ స్నేహితుని ముఖ భంగిమ పొట్ట చెక్కలు చేస్తుంది)
పొదుపుచేసి చూడండి:పొదుపు చెయ్యటంలో విపరీతాలు, కూరలు వండుకోకుండా పచ్చివి తినటానికి ప్రయత్నించటం-నూనె ఆదా కోసరం అందరికీ గుండు చేయించి, భార్యను మరి నువ్వో అనే భర్త.
బ్రాందీ పుట్టిన దేశంలో ఓ మహానాయకుని చరిత్ర:మామూలు వీధి రౌడీ పెరిగి పెద్దయ్యి రాజకీయనాయకుడూ ఆపైన మంత్రి అయిన తరువాత అతని జీవిత చరిత్రను ఒక్కొక్క సంఘటనకు రెండేసి బొమ్మలు-ఒకటి యదార్ధం, మరొకటి ఆ యదార్ధాన్ని ఎలా మసిపూసి మారేడుకాయచేసి చూపుతారు-ఎంతో హాస్యంతో నింపి వేసారు.
సినిమా పాటలు:సినిమా పాటలకు పారడీగా కొన్ని చక్కటి కార్టూన్లు.
సుమతి కార్టూన్లు:సుమతీ శతకంలోని కొన్ని పద్యాలకు వ్యంగ్య చిత్రీకరణ.
హోటలోపాఖ్యానం: హోటళ్ళలో జరిగే హాస్య సంఘటనలు.
విశాఖలో సిటీ బస్సులు:ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాధ శాస్త్రి విశాఖ పట్టణంలో సిటీ బస్సుల స్వైర విహారం గురించి కాప్షన్ వ్రాస్తే, బాబు ఆ విషయానికి చక్కటి కార్టూన్లను అందించారు.
శిల్పి: శిల్పి శిల్పాలు చెక్కుతుండగా ఏర్పడటానికి అవకాశమున్న హాస్య సంఘటనలు. ముందు కాళ్ళు చెక్కటం మొదలు పెట్టటంతో, ఆ శిలకు పైన బరువెక్కువై ముందుకు ఒరిగి శిల్పి మీదపడపోతుంటే ఆ శిలను పట్టుకు నిలవిరుస్తున్న ఒక కొత్త శిల్పిని చూసి, అనుబవజ్ణుడైన పెద్ద శిల్పి "ముందు పైభాగం చెక్కాలని చెప్పానా" అంటూ ఉంటాడు.
రాశిఫలాలు:వార పత్రికలలో రాశి ఫలాలలో సామాన్యంగా ప్రతివారం వ్రాసే కొన్ని పడికట్టు మాటలను ఎద్దేవా చేస్తూ వేసిన వ్యంగ్య చిత్రాలు.
ఇన్ఫ్లేషనంటే: ద్రవ్యోల్బణం పెచ్చరిల్లితే ఎలా ఉంటుంది అన్న విషయానికి చక్కటి హాస్యంతో కూడిన చిత్రాలు.
వయోజనవిద్య:చదువుకోని పెద్దలకు అక్షరాలు నేర్పటం, తెలుగు అక్షరమాలను అనుసరించి "అ" నుండి "అం" దాకా అకర్షణీయమైన వ్యంగ్య చిత్రాలు.
మందుమహాత్యం:మద్యం సేవించిన మనిషి చేసే అపభ్రంశపు పనులు.
వీరి కార్టూన్లు నవ్వు తెప్పించటమే కాక, చదువరిని అలోచింప చేస్తాయి. పైన ఉదహరించిన ఏకవిషయ-వ్యంగ్య చిత్రాలన్నీ కూడ ఆ కోవకు చెందినవే.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.