25, జులై 2009, శనివారం

THE VENTURESనా చిన్నప్పుడు శ్రీలంకా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వారి రేడియో స్టేషన్ లో వచ్చే సంగీతం పక్కింటి లోంచి విని ఆకర్షితుణ్ణై, నానా తంటాలుపడి రకరకాల ఏరియల్స్ కట్టి పెద్దవాళ్ళచేత తిట్లుతిని ఎల్లాగయితేనేమి మా వాల్వు రేడియోలోకూడ ఆ స్టేషన్ వచ్చేట్లుగ చెయ్యగలిగాను. ఆ విధంగా ఆంగ్ల సంగీతం పరిచయం అయ్యింది. ముఖ్యంగా పాటలేకుండా వాద్య పరికరాల సంగీతమంటే ఎక్కువ ఇష్టం నాకు. అటువంటి చక్కటి సంగీతాన్ని అందించే ఒక గ్రూపు వెంచర్స్. నెట్లో వీరి సంగీతాన్ని విని ఆనందించే అవకాశం ఫ్రెడ్డి కలగచేస్తున్నారు. ఈ వెబ్ సైటులో ఆంగ్ల సంగీతంలో పేరెన్నికగన్న అనేక కళాకారుల పాటలు కూడా ఉన్నాయి.


http://jukebox.au.nu/instromania/instro_monsters/ventures/

విని ఆనందించండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.