28, సెప్టెంబర్ 2009, సోమవారం

శాయపురం మా ఊరు 2

శాయపురం, మా అమ్మ పుట్టిల్లు. ఆ ఊరికి క్రితం సంవత్సరం 2008లో వెళ్ళటం జరిగింది. మా అమ్మ ఆ ఊరిగురించి అనేక కథలు చెప్పేది. కాని నేను ఏనాడు ఆ ఊరు వెళ్ళటం తలపెట్టలేదు. ఆవిడ పోయినాక నేను మా తమ్ముళ్ళు కలసి అసలు ఆ ఊరు చూద్దం అని బయలుదేరి వెళ్ళాం.
==============================================
శాయపురం (Sayapuram), కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామ జనాభా 3000 నుండి 4000 వరకు ఉంటుంది.

గ్రామ చరిత్ర
ఈ గ్రామమునకు ఈ నామము షాహిపురం నుండి వచ్చినది. ఈ ఊరి పెద్దల, వృద్దుల కధనం ప్రకారము 16 శతాబ్దమునందు ఈ గ్రామము ఏర్పడినది అని, ఆ రొజులలొ ఈ ప్రాంతము పరిపాలించుచున్న నవాబు హిందూ దివాను ఇచ్చటికి వచ్చి చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆ చెరువునీటి రుచి ఇష్టపడి. అక్కడ ఒక శివాలయము, ఒక విష్ణు ఆలయం కట్టదల్చుకొని అక్కడ మసీదు కడుతున్నట్లు చెప్పి నిధులు తీసుకొని ఆలయములు కట్టించినాడు అని (ఈ కధనముననుసరించి ఇక్కడ విష్ణాలయము, శివాలయములు కలవు).అక్కడికి కొంత దూరంలో మసీదు కూడా కట్టించి తరువాత ఈ ప్రాంతమునకు షాహిపురమని పేరు పెట్టినట్లుగా చెపుతారు. కాలక్రమంలో షాహిపురం శాయపురంగా మారినదిగా ఆ గ్రామ పెద్దలు వివరించారు. ఈ ఊరిపేరుకు, షిరిడి శాయికి గాని, పుట్టపర్తి శాయికి కాని సంబంధంలేదు

దేవాలయములు
పురాతనమైన విష్ణుదేవాలయం కలదు. శిధిలమైన దేవాలయము స్థానమున పునరుద్ధరించబడిన శివాలయము కలదు.




వ్యవసాయ విషయాలు
ఈ గ్రామము నందు ముఖ్యమయిన పంటలు వరి మరియు చెరకు.

విద్యా సౌకర్యాలు
ఈ గ్రామములో ఒక పాఠశాల ఉన్నది. ఈ పాఠశాలలొ రేడియో పాఠాలు విని నేర్చుకొనే సదుపాయం కలుగజేశారు.

రవాణా సదుపాయములు
ఈ గ్రామమునకు ఇప్పటికి కూడ సరయిన ప్రయాణ సదుపాయములు లేవు. విజయవాడ నుండి బస్సులొ నాగాయలంక, అవనిగడ్డ మార్గములో బస్సు ఎక్కి, ఉయ్యూరు దాటిన వెంటనే, గోపువానిపాలెం స్టాపులొ దిగాలి. అక్కడినుంచి ఆటోలొ శాయపురంకు వెళ్ళవచ్చు. ఈ ఊరు విజయవాడకు చాలా దగ్గర.
==============================================
ఆ ఊరు మా తమ్ముళ్ళతో కలసి జనవరి 2008లో మొట్టమొదటి సారి వెళ్లాను. అంతవరకు ఆ ఊరు గురించి మా అమ్మ చెప్పగా వినటమే కాని చూసింది లేదు. అక్కడకు వెళ్ళగానే, కనిపించిన మొదటి వ్యక్తిని, ఇక్కడ శుధ్ధపల్లి రామమూర్తిగారి(మా తాతగారు)ఇల్లు ఎక్కడండి అని అడిగాను. ఆయన వెంటనే, వారు ఈ ఊరు ఒదిలిపెట్టి చాలా రోజులయ్యింది(డెబ్భై సంవత్సరాలయ్యింది) కాని వారి ఇల్లు ఫలానా చోటున ఉండేది అని చెప్పారు. పల్లెటూళ్ళల్లో ఎంత గుర్తు మనుషులమీద! ఇక ఆ ఊళ్ళొనే 83 సంవత్సరాల వృధ్ధుడు చావలి భానుమూర్తిగారిని కలసి పాత విషయాలు అనేకం తిరగేసాం. ఆయనే మాకు శాయపురానికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరించారు. అప్పుడు తీసిన వీడియోలో కొంత భాగం ఈ కింద ఇవ్వటం జరిగింది.

8 కామెంట్‌లు:

  1. చాలా బావుందండి. మాకు తెల్సిన వాళ్ళొకరు ఉండేవారు శాయిపురం నించి.
    అవనిగడ్డ అంటే దివిసీమ వేపునా?

    రిప్లయితొలగించండి
  2. శివరామ ప్రసాద్ గారు,
    చాలా ఎళ్ళకి మీరు వెళ్ళిన మీ శాయపురం గురించి చదువుటుంటే ఈ మధ్య నేను వెళ్ళిన మా దామరమదుగు ట్రిప్ గుర్టుకొచ్చిందండి. ఛాలా బాగుంది.
    - గిరిధర్ పొట్టేపాళెం

    రిప్లయితొలగించండి
  3. వ్యాఖ్యలు వ్రాసిన కొత్తపాళి, గిరిధర్ గార్లకు ధన్యవాదములు. మా ఊర్ల గురించి ఎవరన్న వెతుకుతుంటే గూగుల్ గాని మరేదైనా సరే, వివరాలు వారికి అందాలని నా ఉద్దేశ్యం. అందుకని, నేను వికీలో వ్రాసిన వ్యాసాలను ఇక్కడ మళ్ళి కొంత జోడించి వ్రాసాను.

    కొత్త పాళీగారూ, ఈ ఊరు ఉయ్యూరు కి చాలా దగ్గరండి. అవనిగడ్డ దివిసీమలోదే. గుర్తు కోసం ఆఊరిపేరు వ్రాసాను. ఇప్పుడు కొంత మార్చాను వ్యాసంలో.

    వికీలోని వ్యాసాన్ని యధతధంగా ఇక్కడకు తీసుకుని రావటం వల్ల, మా ఊరు గురించి ఒక ప్రాణంలేని వ్యాసంలాగ ఉన్నది. మరిన్ని వివరాలు నింపి ప్రాణ ప్రతిష్ట చెయ్యాలి.

    గిరిధర్ గారూ, మీరు మీ ఊరిగురించి వ్రాసిన వ్యాసం అద్భుతంగా ఉన్నది, అక్కడకు వెళ్ళి చూసిరావలనిపించేట్టుగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుందండీ. ఈ ఫొటో లను చూస్తుంటే మా ఊరు గుర్తు వస్తుంది.

    మీరు పెట్టిన రచయితల ఫొటో లు బాగున్నాయి. ముఖ్యంగా ఒక వైపున విశ్వనాధ వారు, మరొక వైపున చలం గారు. నాకు బాగా నచ్చింది అలా పెట్టటం.

    రిప్లయితొలగించండి
  5. namaste andi,
    miku saipuram karanam gari gurinchi telusandi?ma ammamma karanam gari ammayi.ippatki boledu vishaylu chepthunadi saipuram, vyurla gurinchi.vyurru ma tatayavallaladi.saipuram vuri vallante ma ammmammaamki sontha bandhuvulukanna ekkuva .entho husharo cheppalenu.i blog gurinchi avidaki chepali.

    రిప్లయితొలగించండి
  6. ఫ్రసాద్ గారు,

    నేను పొరపాటు పడి ఉండకపోతే మీరు మా శివుడు మామయ్య. ఎందుకంటే మా అమ్మమ్మ గారి తండ్రిగారి పేరు కూడా శుద్ధపల్లి రామ్మూర్తి గారే. వాళ్ళది కూడా శాయపురమే. ఇంతకీ నేను ఎవరంటే బుజ్జి (మీ పిన్ని కూతురు) కూతురిని. నేను మీ ఫొటొ ని చాలా జాగ్రత్తగా చూసా. కానీ సైడ్ ఏంగిల్ అవడంతొ తెలీలెదు. మీరు మా మమయ్యా కాదా అని. కానీ మా మమయ్య నాకు తెలిసి ముంబై లొ ఉండె వారు. అప్పట్లొ నెను వళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అది మరి కంఫ్యూజన్. ఇంతకీ మీది విజయవాడ సత్యనారాయణపురమా? నేను మీ వీడియొ క్లిప్పింగ్ లొ చూసింది సీను మామయ్య & క్రిష్ణ మామయ్య కదూ.

    కల్యాణి

    రిప్లయితొలగించండి
  7. అమ్మయ్ కళ్యాణీ! నువ్వనుకున్న మామయ్యనే.మనం ఈ విధంగా బ్లాగుద్వారా కలుసుకోగలగటం చాలాసంతోషం కలిగించింది. నా ఈ మైలు ఈ కింద ఇస్తున్నాను, మైలు చెయ్యి.

    vu3ktb@gmail.com

    రిప్లయితొలగించండి
  8. Swatimadhav garoo,

    I could not give personal mail to you as its not available in your profile also. However, please let me know the specific names enabling me to connect. Saayapuram is a village well know in the area and has good name.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.