4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

రేడియో నాటకాలు

మనకు టి వి ఆపైన 24 గంటల శాటిలైటు చానెళ్ళు రాక పూర్వం కాలక్షేపానికి నేస్తం రేడియో మాత్రమె. అవ్వొక రోజులు! ప్రతి ఆదివారం మద్యాహ్నం మూడు గంటలకు నాటకం కాని సంక్షిప్త శబ్ద చిత్రం (సినిమా డైలాగులు) కాని ప్రసారం చేసేవారు. అలాగే వారంలో రెండురోజులు (అవి రక రకాలుగా అనేక సార్లు మారాయి) ఒకరోజున 15 నిమిషాల నాటిక, మరోకరోజున 30 నిమిషాల నాటికలు వేసేవారు. ఇవి కాక, కార్మికుల కార్యక్రమంలోను, వనితావని కూడా అప్పుడప్పుడు ధారావాహికంగా నాటకాలు వచ్చేవి. సంవత్సరానికి ఒకసారి నాటకోత్సవాలు జరిగేవి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి అనేకమైన చక్కటి నాటికలు, నాటకాలు ప్రసారమైనాయి. అలనాడు అప్పటి కళాకారు ఎంతగానో శ్రమపడి తమ చాతుర్యమంతా చూపించి, చక్కటి నాటికలు తయారు చేసి, శ్రోతలందరిని అలరించారు.

ఇప్పుడు ఆ నాటకాలను వినాలంటే?? మార్గం ఉన్నదా?

"ఉన్నది! ఉన్నది!!"

అని ఆకాశవాణి పలుకుతున్నది.

మరి ఏ కళన ఈ మంచి ఆలోచన వచ్చిందో కాని, ఆకాశవాణి వారు వారి పాత కార్యక్రమాలను-భక్తిరంజని, లలితా గీతాలు, నాటకాలు సి డిల రూపంలో అమ్ముతున్నారు. విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలోనే చిన్న స్టాళ్ళు పెట్టి ఈ అమ్మకం జరుపుతున్నారు. గణపతి, వరవిక్రయం నాటకాలు దొరుకుతున్నాయి. హైదరాబాదు ఆకాశవాణి స్టాల్లో కూచున్న ఆవిడకు తాను అమ్మే వాటి విలువ వివరాలు ఏ మాత్రం తెలియదు. విజయవాడ లో మాత్రం గుడ్డిలో మెల్లగా అతనికి కొంత జ్ఞానం ఉన్నది.

అప్పటి నటులు-సర్వశ్రీ నండూరి సుబ్బారావు,సి. రామ్మోహన రావు, ఎ బి ఆనంద్, వి బి కనకదుర్గ ల గొంతులు మళ్ళీ వినగలిగే అవకాశం కలిగించినందుకు, ఆకాశవాణి వారికి ధన్యవాదాలు. కాని, రేడియో ఆ రోజులలో వేసిన ఆణిముత్యాలవంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటికి పెద్దగా మార్కెట్టు లేకపోవచ్చు. కాని అవి కావాలనుకొనే వారు అనేకమంది. ఆకాశవాణి వారు, వారి పాత కార్యక్రమాలన్నిటిని డిజిటైజు చేయించి, వారి వెబ్ సైటులోకి ఎక్కించి, అభిరుచికలవారు డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పిస్తే ఎంతయినా బాగుంటుంది. అప్పటి సాంస్కృతిక రూపాలను కాపాడినవారవుతారు. యూరోపియన్ లేదా అమెరికన్ దేశాలలో 1920లలోని కార్యక్రమాలు కూడా వెబ్ సైట్లలో ఉంచి కాపాడుకుంటున్నారు, ఇప్పటి తరాలకు అందిస్తున్నారు . మనకేమో గట్టిగా ఒక పాతిక, ముఫ్ఫై సంవత్సరాల క్రితం రికార్డింగులు దొరకటం గగనమైపోతున్నది.

నేను నా చిన్నతనంలో, నా దగ్గర ఉన్న కాసెట్ రికార్డర్‌లో కొన్ని నాటికలను రికార్డుచేయ్యటం జరిగింది. వాటిని ఎంతో భద్రంగా దాచి ఉంచాను. ఈ నాటికలను, అమెరికాలో ఉన్న సుసర్ల సాయిగారు నిర్వహిస్తున్న ఒక చక్కటి వెబ్ సైటులోకి అందించటం జరిగింది. ఆ సైటునుండి డౌన్‌లోడు చేసుకోవచ్చు. ఆ వెబ్సైటు ఈ కింది లంకె నొక్కి చూడవచ్చు.

అ వెబ్ లోనే కొంచెం అటూ ఇటూ తిరిగి చూడండి అనేక నిధులున్నాయి అక్కడ.
విజ్ఞప్తి
ఈ వ్యాసం చదివిన వారిలో ఎవరిదగ్గరైనా రేడియో నాటికలు, ఇతర కార్యక్రమాలు, భక్తిరంజని పాటలు ఉంటే, దయచేసి తెలుపగలరు, లేదా వారి బ్లాగులో అప్లోడు చేయమని మనవి. ఇలా మనం పూనుకుంటే కాని, అప్పటి సాంస్క్రతిక కళా రూపాలు భావి తరాలవారికి అందవు.

2 కామెంట్‌లు:

  1. విజయవాడ రేడియో నాటకాలంటే పడి చచ్చిపోయే వాళ్ళలో నేనొకరిని! ముఖ్యంగా రేడియో నాటక వారోత్సవాలలో రాత్రి తొమ్మిదిన్నరకు ప్రతి ఏడాదీ అన్ని రేడియో కేంద్రాల వారూ రోజుకొకటి చొప్పున వారం రోజుల పాటు ప్రసారం చేసే నాటకాలు వినడం ఒక పాషన్ గా ఉండేది. ఆదివారం మధ్యాహం మూడింటికి వేసే నాటకాలు కూడా ఎంతో బావుండేవి. గణపతి లో గణపతిగా నండూరి సుబ్బారావు గారి నటన, గణపతి తల్లిగా సీతా రత్నమ్మ(ఎప్పుడో చిన్నపుడు విన్న నాటకాల్లో పాత్ర ధారుల పేర్లు కూడా గుర్తున్నాయంటే వాటి ప్రభావం చూడండి) పోటీ పడే వారు.

    వరవిక్రయంలో సింగరాజు లింగరాజు పాత్ర డైలాగుల్ని అసలు మర్చిపోలేం!

    అలాగే కొన్ని అరుదైన లలిత గీతాలు కూడా కలెక్ట్ చేయాలి. అయితే నాకు విజయవాడ ప్రయాణం తప్పదన్నమాట శివరామ ప్రసాద్ గారూ!

    రిప్లయితొలగించండి
  2. MADAM SUJATA GARU,

    Thanks for your comment. You can download a few AIR., Vijayawada plays and playlets from the site for which Link is given in the article.

    Likewise, if you explore the site (surasa)you wil find some Lalita Geetalu also (Kondameeda Koyilokati Koosindee maatram lEdu). Try your luck.

    I have the CDs of AIR (Bhaktiranjani with my favourite Surya Ashtakam and Bhajagovindam by Sri Oleti Venkateswarlugaru, Ganapati and Varavikryam Natakalu). But I do not know whether I can convert them into MP# forward and upload into Rapidshare for download by fans of these plays or whether there are any copyright issues involved.

    I feel better to purchase the CDs because, with that action, we may be encouraging the Clerical Authorities to bringout some more such CDs.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.