22, నవంబర్ 2009, ఆదివారం

జయదేవ్ ఆత్మకథ - గ్లాచ్చూ మీచ్యూ

strong>
తెలుగు కార్టూన్ ప్రపంచంలో ఎంతగానో పేరెన్నికగన్న మన అభిమాన వ్యంగ్య చిత్రకారులు శ్రీ జయదేవ్ గారు. వారి కార్టూన్లు చూసి ఆనందించనివారు లేరు. కొన్ని దశాబ్దాలుగా వారు మన తెలుగు పాఠకులను తమ ఉజ్వలభరితమైన కార్టూన్లతో ఎంతగానో నవ్విస్తున్నారు, ఆలోచింప చేస్తున్నారు. ఉంటున్నది తమిళనాట అయినా వారి పరిశీలనా శక్తితో, ఎన్నెన్నో అద్భుతమైన కార్టూన్లు వేసి తెలుగువారికి నవ్వుల పెన్నిధిగా పేరు తెచ్చుకున్నారు.

ఇన్ని కార్టూన్లు వెస్తూ వచ్చిన జయదేవ్ గారి గురించి సామాన్య పాఠకులకు తెలిసినది అతి తక్కువ. వారు ప్రొఫెసర్ గా మదరాసులో ఉంటారు అని తప్ప వారి గురించి పెద్దగా తెలియదు. ఈ లోటు తీర్చటానికి అన్నట్టుగా, వారు తమ ఆత్మ కథను ప్రచురించారు. ఒక నాలుగైదు రోజుల క్రితం నేను వారికి ఒక మైలు ఇస్తూ, వారిని వారి ఆత్మ కథను పూర్తిగా కార్టూన్లలో ప్రచురించమని అబ్యర్ధించాను. అప్పటికే తమ ఆత్మకథకు తుది మెరుగులు దిద్దుతున్నట్టున్నారు, నాకు వివరాలు పంపారు.

జయదేవ్‌గారి ఆత్మకథకు పేరు గ్లాచ్చూ మీచ్యూ, ఆంగ్లంలో గ్లాడ్ టు మీట్ యు కు తెలుగు రూపం. సామాన్యంగా కొత్తవారిని కలుసుకున్నాపుడు మిమ్మల్ని కలవటం సంతోషకరం అని చెప్పటం సాంప్రదాయం. అదే పధ్ధతిని ఆచరిస్తూ, జయదేవ్ గారు మనకు కొత్త కాక పోయినా, మనలను కలుసుకోవటం తనకు ఎంత ఆనందంగా ఉన్నదో తెలియపరుస్తూ ఈ చక్కటి టైటిలు తన ఆత్మ కథకు పెట్టటం ఎంతో ముదావహం.

జయదేవ్ గారి ఆత్మకథ గురించి ప్రముఖ రచయిత విమర్శకురాలు,శ్రీమతి మాలతీ చందూర్ ఈ విధంగా అన్నారు.

"...జయదేవ్‌గారు ఉయ్యాల బల్ల మీద కూచుని ఇటూ అటూ, ముందుకూ వెనక్కీ ఊగుతూ తన జీవిత కథని, అనుభవాలని ఆత్మ స్తుతి-పరనిందా లేకుండా నమ్రతతో గ్లాచ్చూ మీచ్చ్యూ లో చెప్పుకున్నారు"


కార్టూన్ ప్రేమికులూ మరియు జయదేవ్ అభిమానులు తప్పనిసరిగా చదువవలసిన పుస్తకం గ్లాచ్చు మీచ్చ్యూ. ఈ అపుస్తకం దొరికే చోటు:

VNR Book World
Chowdepalle- 517257
Chittoor Dt (AP)
Ph:08581_256234
e-mail: vijayavani_printers@yahoo.com

పుస్తకాన్ని ప్రచురించి మనందరికి అందించిన వారు జయదేవ్ గారి స్నేహితులు సాహిత్య అభిమాని శ్రీ నాయుని కౄష్ణమూర్తిగారు.

ఈ పుస్తకం నుండి మచ్చుకి ఒక పుట




3 కామెంట్‌లు:

  1. ‘గ్లాచ్యు మీచ్యూ’ అనే పేరులోనే చిలిపిదనం, కార్టూనిజం కనిపిస్తున్నాయి. జయదేవ్ గారి రాతా, గీతా సుపరిచితంగా, ప్రత్యేకంగా ఉంటాయి! ఈ పుస్తకం గురించి మీ పరిచయం బావుంది.

    రిప్లయితొలగించండి
  2. ప్రసాద్ గారూ, మీ పరిచయం చాలా బాగుంది. అయితే పుస్తకం దొరికేది ఆ ఒక్క చోటేనా ఇంకెక్కడా దొరకదా, పొస్ట్ లో తెప్పించుకోవలసిందేనా? జయదెవ్ గారి రాతలు, గీతలు కడుపుబ్బ నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. మరి ఆయన తన ఆత్మకధతో ఎంత నవ్విస్తారో చూడాలి. మనసు బాలేనప్పుడూ, ఎవరి మీదనైనా బాగా కోపంగా ఉన్నప్పుడూ ఇదిగో ఈ కార్టూన్స్ చూస్తే కోపం అంతా చేత్తో తీసేసినట్టు పోయి మనసారా నవ్వేస్తాను. ఈ సారి ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ ఏం పుస్తకాలు కొనాలో ఇప్పటినుంచే లిస్ట్ రాసేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదములు వేణు గారూ మరియు స్వర్ణమల్లికగారు.

    స్వర్ణమల్లిక:
    మీరు ఈసారి ఇండియా వచ్చినప్పుడు విజయవాడలో ఉన్న విశాలాంధ్ర (ఏలూరు రోడ్‌లో ఉన్నది) వారి షాపు చూడండి, అలాగే అదే లైనులో ఉన్న నవోదయా, అరుణా పబ్లిషింగ్ చూస్తే మనం వేరే జాబితా చేసుకోనక్కర్లేదు. వాళ్ళు ప్రదర్శనలో ఉంచిన మంచి పుస్తకాలు చూసి మనం కొనుక్కోవచ్చు. విశాలంధ్ర రీడర్స్ క్లబ్బులో చేరితే 20% డిస్కౌంటు ఇస్తారు. కాకపోతే అలా చేరటానికి కొంత సొమ్ము కట్టాలి.

    ఇక జయదేవ్ గారి అత్మకథ పుస్తకం. నేను అనుకోవటం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోను దొరుకుతుంది. జయదేవ్‌గారి వంటి ప్రముఖ వ్యంగ్య చిత్రకారుని జీవిత చరిత్ర ఒక్కచోటే దొరకటం మిగిలిన చోట్ల దొరకకపోవటం ఉండదు. అన్ని చోట్ల దొరికే అవకాశమే ఎక్కువగా ఉన్నది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.