1, జనవరి 2010, శుక్రవారం

ఒక మంచి సందేశం

కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకోవటం మనకు ఆనవాయితీ. ఆ శుభాకాంక్షలు మనందరినీ ఆలోచింప చేయగల సందేశం కలిగి ఉంటే అదొక అద్భుత కలయిక. రాబోయే కొత్త సంవత్సరం 2010లో ఉన్న సంఖ్యలనే చక్కగా వాడుకుని ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారు మన జయదేవ్ గారు.

ఒక కార్టూన్ ఎలా వెయ్యాలి, కాప్షన్ ఎలా ఉండాలి, ఈ కార్టూన్ చూసి నేర్చుకోవచ్చు. తక్కువ గీతలతో హాస్యం పండిస్తూ చదువరులను ఆలోచింప చేయగల నేర్పు, శక్తి కార్టూన్ కు మాత్రమె ఉంటుంది అని తన అద్భుతమైన కల్పనా నైపుణ్యంతో మరొక మారు నిరూపించారు జయదేవ్ గారు.


రాబోయే సంవత్సరం 2010 మాత్రమె కాకుండా ఎల్ల కాలం మనం చేసే ప్రతి పనిలోనూ ఈ భూప్రపంచంలో ఇప్పటికే తరిగి పోయిన అనేక వనరులను పొదుపుగా వాడుకుందాము. కొత్త సంవత్సరం అందరికీ ఆనందాన్ని పంచి ఇవ్వాలని, అందరికీ మంచి ఆలోచనలు మాత్రమె రావాలని కోరుకుందాము.

3 కామెంట్‌లు:

  1. కొత్త సంవత్సరం అందరికీ ఆనందాన్ని పంచి ఇవ్వాలని, అందరికీ మంచి ఆలోచనలు మాత్రమె రావాలని కోరుకుందాము.

    తప్పకుండా. శుభ సంకల్పం.

    రిప్లయితొలగించండి
  2. శివ గారూ !
    జయదేవ్ గారి కార్టూనుతో మంచి సందేశం అందించారు.
    May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

    SRRao
    sirakadambam

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.