2, జనవరి 2010, శనివారం

చందమామ ప్రియులకు పిలుపుపరోపకారి పాపన్న కథలు మళ్ళిమొదలు పెడితే?


చందమామ ధారావాహికలో ఎంతగానో పేరుపొందిన దారావాహికలలో పరోపకారి పాపన్న కథలు పేరెన్నిక గన్నది పాపన్న ప్రతి ఇంటిలోని వ్యక్తిలాగా అయిపోయినాడు ఆరోజులలో. స్పురద్రూపి, చక్కటి తలకట్టు ఆ కథలకు వేసిన బొమ్మలలో పాపన్న ఎంతగానో వెలిగి పోయేవాడు.
పాపన్న కథలను వ్రాసినది చందమామలోనే పని చేస్తూ ఉండిన రంగారావుగారు. ఇప్పటి తరానికి పాపన్న కథలు పరిచయంలేవు. పరోపకార పరాయణత తెలియచెప్పే ఈ కథల ధారావాహిక మళ్ళి ప్రారంభిస్తే ఎలా ఉంటుంది! చిట్టచివరి పరోపకారి పాపన్న కథ 1969లో ప్రచురించబడినది. అంటే 40 సంవత్సరాల క్రితం బాగా ప్రసిధ్ధి కెక్కిన ఒక పాత్రను మళ్ళి తీసుకుని ఆ కథలను ఇప్పుడు వ్రాయాలంటే ఎలా అన్నది ఒక సందిగ్ధం. అలాగానుక ఎవరైనా ఈ పాపన్న కథలను మళ్ళి వ్రాద్దామనుకుంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి.

1. పాపన్న కథలు చాలా కాలం క్రితం అంటే ఏ 18వశతాబ్దపు చివరి రోజులు 19వశతాబ్దపు రోజులుగా కనిపిస్తాయి. మనకు ప్రస్తుతం తెలిసిన రవాణా సౌకర్యాలు మున్నగునవి మచ్చుకైనా కనపడవు. అన్నిటికన్న ఆధునిక రవాణా సౌకర్యం, మంచి గుర్రపు బండి. ఇప్పుడు కథ వ్రాస్తే, అదే వాతావరణంలోనే వ్రాయాలా లేక పాపన్న ప్రస్తుతపు 21వ శతాబ్దంలో ఉన్నట్టుగా వ్రాయాలా. నా ఓటు మటుకు పాత వాతావరణానికే.

2. పరోపకారి పాపన్న చిట్టచివరి కథ ప్రకారం పాపన్న వయస్సు 40 చిల్లర ఉండచ్చు. అదే వయస్సు ఉంచాలా లేక బాగా ముసలివాడైనట్టుగా చూపాలా.

3. పాపన్నకు తల్లి,భార్య ఒక కొడుకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుది అతని కొడుకును (ఒక మంచి పేరు పెట్టి) ప్రవేశపెడితే ఎలా ఉంటుంది. పాపన్న మరీ వెనుక ముందు చూసుకోకుండా సహాయం చేసేవాడు, దుర్మార్గుడికైనా సరే. అతని కొడుకు, పాపన్న పెంపకంలో పెరిగి, పెద్దవాడై, కాల ప్రభావాన, కొంత తెలివినపడి, పరోపకారం చేస్తూనే నిజంగా అవసరమైనవారికే చేస్తున్నట్టుగా చూపిస్తే??

4. ఇప్పటి తరానికి పాపన్న పాత్ర తెలియదు. కాబట్టి, మళ్ళి మొదలుపెట్టే కథలు కొద్దిగా పాత కథా వాతావరణంలో వ్రాసి మెల్లి మెల్లిగా ఆ పాత్ర/లను పరిచయం చేసి, కొత్త కథలను మలిస్తే ఎలా ఉంటుంది.

5. పాత తరం వారు చందమామ అప్పటినుండి తప్పకుండా చదివే వారు వేలమంది. వారికి ఈ పాత్రను కొద్దిగా గుర్తుచేయవలసిన అవసరం ఉన్నదా? ఉందనుకుంటాను.

పాపన్న
కథలను మళ్ళి చందమామలో వ్రాయటం మొదలుపెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిన తరువాత ఇలా రక రకాలుగా మీమాంస కూడ అలోచనలో మెదులుతున్నది.
చందమామ ప్రియులు అందరూ పాపన్న కథలను చందమామలో చూసుకోవాలనుకోవటం ఆనందకరమైన విషయం. మన చందమామ ప్రియులు అందరూ ఈ విసహ్యంలో అలోచించి తగిన సూచనలు ఇవ్వగలరు. మరొక మాట, పాపన్న కథలను వ్రాసిన రంగారావుగారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. వారు మళ్ళి ఈ కథలను వ్రాయగల స్థితిలో ఉన్నారో లేదో కూడ తెలియదు. కాబట్టి ఈ కథలను మళ్ళి ప్రారంభిస్తే, ఇప్పటి రచయితలే వ్రాయాలి. కాబట్టి ఒహవేళ ఒక రచయిత వ్రాయటం మొదలుపెడితే ఆ రచయిత నాలుగు ఐదు కథలు వ్రాసిన తరువాత వ్రాయలేకపోతే, మరొక రచయిత అందుకుని, గొలుసు కట్టుగా ఈ పాపన్న కథలను వ్రాయటం కొనసాగించగలమా. దయచేసి వ్యాఖ్యల రూపంలో మీ సలహాలు, సూచనలు ఇవ్వగలరు. సూచనలు, సలహాలకు ఎప్పుడూ ఆహ్వానమే .

ఈ వ్యాసం సాహిత్య అభిమాని బ్లాగు నుండి గ్రహింపబడినది

2 వ్యాఖ్యలు:

 1. పరోపకారి పాపన్న లాంటి పాఠకాదరణ పొందిన కథలను కొనసాగించే ఆలోచన బావుంది.
  1) పాత వాతావరణం మార్చేస్తే...అవి వేరే కథలవుతాయి. కాబట్టి అలా వద్దు.
  2) వయసు మారిస్తే కూడా ఏమీ బావుండదు.
  3) పాపన్న కొడుకు గురించి మీ సూచన చాలా బావుంది.
  4) పాత కథా వాతావరణం మారిస్తే బావుండదని నా సూచన. కాబట్టి కొత్త కథలను పాతవాటిలాగే రాసుకుంటూ పోవటమే సరైనది అనుకుంటాను.
  5) పాతతరం వారికి కూడా ఈ పాత్రను మరోసారి గుర్తు చేయటం మంచిది.

  ఒక పరిమితి ఏమిటంటే...ఇంత విరామం తర్వాత ఒరిజినల్ రచయిత రాసినా పాత కథలంత బాగా ఉండే అవకాశం చాలా తక్కువ. ఇక వేరే రచయిత(లు) రాసి పాఠకులను ఒప్పించటం కష్టమే! అయినా ఇలాంటి ఒక ప్రయత్నం మాత్రం ఆహ్వానించదగ్గ విషయమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Thank you Venu gaaroo. I am thinking of writing 1 or 2 stories. Can you also add your effort and write like that. If all the Chandamama lovers start writing (of course edited by our Rajugaru) I am sure the famous Paropakari Pappanna may back onto the Telugu Literary Scene once again.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.