2, జనవరి 2010, శనివారం

పరోపకారి పాపన్న కథలు మళ్ళిమొదలు పెడితే?పరోపకారి పాపన్న కథలు మళ్ళిమొదలు పెడితే?


చందమామ ధారావాహికలో ఎంతగానో పేరుపొందిన దారావాహికలలో పరోపకారి పాపన్న కథలు పేరెన్నిక గన్నది పాపన్న ప్రతి ఇంటిలోని వ్యక్తిలాగా అయిపోయినాడు ఆరోజులలో. స్పురద్రూపి, చక్కటి తలకట్టు ఆ కథలకు వేసిన బొమ్మలలో పాపన్న ఎంతగానో వెలిగి పోయేవాడు.
పాపన్న కథలను వ్రాసినది చందమామలోనే పని చేస్తూ ఉండిన రంగారావుగారు. ఇప్పటి తరానికి పాపన్న కథలు పరిచయంలేవు. పరోపకార పరాయణత తెలియచెప్పే ఈ కథల ధారావాహిక మళ్ళి ప్రారంభిస్తే ఎలా ఉంటుంది! చిట్టచివరి పరోపకారి పాపన్న కథ 1969లో ప్రచురించబడినది. అంటే 40 సంవత్సరాల క్రితం బాగా ప్రసిధ్ధి కెక్కిన ఒక పాత్రను మళ్ళి తీసుకుని ఆ కథలను ఇప్పుడు వ్రాయాలంటే ఎలా అన్నది ఒక సందిగ్ధం. అలాగానుక ఎవరైనా ఈ పాపన్న కథలను మళ్ళి వ్రాద్దామనుకుంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి.

1. పాపన్న కథలు చాలా కాలం క్రితం అంటే ఏ 18వశతాబ్దపు చివరి రోజులు 19వశతాబ్దపు రోజులుగా కనిపిస్తాయి. మనకు ప్రస్తుతం తెలిసిన రవాణా సౌకర్యాలు మున్నగునవి మచ్చుకైనా కనపడవు. అన్నిటికన్న ఆధునిక రవాణా సౌకర్యం, మంచి గుర్రపు బండి. ఇప్పుడు కథ వ్రాస్తే, అదే వాతావరణంలోనే వ్రాయాలా లేక పాపన్న ప్రస్తుతపు 21వ శతాబ్దంలో ఉన్నట్టుగా వ్రాయాలా. నా ఓటు మటుకు పాత వాతావరణానికే.

2. పరోపకారి పాపన్న చిట్టచివరి కథ ప్రకారం పాపన్న వయస్సు 40 చిల్లర ఉండచ్చు. అదే వయస్సు ఉంచాలా లేక బాగా ముసలివాడైనట్టుగా చూపాలా.

3. పాపన్నకు తల్లి,భార్య ఒక కొడుకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుది అతని కొడుకును (ఒక మంచి పేరు పెట్టి) ప్రవేశపెడితే ఎలా ఉంటుంది. పాపన్న మరీ వెనుక ముందు చూసుకోకుండా సహాయం చేసేవాడు, దుర్మార్గుడికైనా సరే. అతని కొడుకు, పాపన్న పెంపకంలో పెరిగి, పెద్దవాడై, కాల ప్రభావాన, కొంత తెలివినపడి, పరోపకారం చేస్తూనే నిజంగా అవసరమైనవారికే చేస్తున్నట్టుగా చూపిస్తే??

4. ఇప్పటి తరానికి పాపన్న పాత్ర తెలియదు. కాబట్టి, మళ్ళి మొదలుపెట్టే కథలు కొద్దిగా పాత కథా వాతావరణంలో వ్రాసి మెల్లి మెల్లిగా ఆ పాత్ర/లను పరిచయం చేసి, కొత్త కథలను మలిస్తే ఎలా ఉంటుంది.

5. పాత తరం వారు చందమామ అప్పటినుండి తప్పకుండా చదివే వారు వేలమంది. వారికి ఈ పాత్రను కొద్దిగా గుర్తుచేయవలసిన అవసరం ఉన్నదా? ఉందనుకుంటాను.

పాపన్న
కథలను మళ్ళి చందమామలో వ్రాయటం మొదలుపెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిన తరువాత ఇలా రక రకాలుగా మీమాంస కూడ అలోచనలో మెదులుతున్నది.
చందమామ ప్రియులు అందరూ పాపన్న కథలను చందమామలో చూసుకోవాలనుకోవటం ఆనందకరమైన విషయం. మన చందమామ ప్రియులు అందరూ ఈ విసహ్యంలో అలోచించి తగిన సూచనలు ఇవ్వగలరు. మరొక మాట, పాపన్న కథలను వ్రాసిన రంగారావుగారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. వారు మళ్ళి ఈ కథలను వ్రాయగల స్థితిలో ఉన్నారో లేదో కూడ తెలియదు. కాబట్టి ఈ కథలను మళ్ళి ప్రారంభిస్తే, ఇప్పటి రచయితలే వ్రాయాలి. కాబట్టి ఒహవేళ ఒక రచయిత వ్రాయటం మొదలుపెడితే ఆ రచయిత నాలుగు ఐదు కథలు వ్రాసిన తరువాత వ్రాయలేకపోతే, మరొక రచయిత అందుకుని, గొలుసు కట్టుగా ఈ పాపన్న కథలను వ్రాయటం కొనసాగించగలమా. దయచేసి వ్యాఖ్యల రూపంలో మీ సలహాలు, సూచనలు ఇవ్వగలరు. సూచనలు, సలహాలకు ఎప్పుడూ ఆహ్వానమే .

ఈ వ్యాసం మన తెలుగు చందమామ బ్లాగులో కూడ ప్రచురించబడినది

3 వ్యాఖ్యలు:

 1. నమస్కారం ... చాలారోజులయింది. ఈమధ్య ఒక ఉద్యోగం వెలగబెట్టి మానేశాను, కనుక కొంచెంతీరికదొరికింది.
  మీరు ఈరాశినవి సుజనరంజని అని ఒక పత్రిక ఇంటర్నెట్ లో నడుస్తోంది. వారికి పంపండి. మంచి పాఠకులు దొరుకుతారు. ఒక విషయం. పరోపకారి పాపన్న కధలు అలానేరాసే కన్న వాటినే ప్రస్తుత సమకాలీన సమాజానికి సరిపోయేలా రస్తే బావుంటుందన్నది నాఉద్దేశ్యం. అపుడు దానివలన ఉపయోగమూ మరియు తగిన ఆదరణ దొరుకుతుంది. నేను మూడు రచనలు పంపుతాను చదివి మీ అభిప్రాయం తెలియచేయండి.
  నమస్కారం .
  సుబ్రమణ్యం

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివరాం గారూ,
  మీరు తలపెట్టిన మంచిపనికి అప్పుడే ఒకరినుంచి తోడ్పాటు వచ్చింది చూడండి. మీ ప్రయత్నం ఫలించి మళ్లీ చందమామలో పాతికేళ్ల అనంతరం ఓ సీరియల్ తిరిగి ప్రచురించబడే అవకాశం త్వరలో ప్రాప్తించబోతోందని ఆశించవచ్చా. ఇంకా మిత్రుల సలహాలు స్వీకరించి పరోపకారి పాపన్న కంటెంట్ పై తుది నిర్ణయం తీసుకుందాము. మీ చక్కటి ప్రయత్నానికి అభినందనలు. సుబ్రహ్మణ్యం గారు అన్నట్లు సుజన రంజని పత్రిక మనం చూడదగిన మంచి వెబ్‌సైట్లలో ఒకటి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Raajugaaroo and Subrahmanyam gaaroo Thank you for your comments.

  Subrahmanyam gaaroo, can you write a few Paropakari Papanna kathalu, as written in your view, in the present mileu.

  I am of the view that Paropakari Papanna kathalu are to be continued in the same locale and atmosphere of 18-19 Century Telugu rural areas.

  I am now proceeding on vacation to my native place. On my return, I shall try my hand in writing the Paropakari Papanna Kathalu.

  Rajugaru. Thanks for your encouragement in this. Please consult writers who have been writing to Chandamama regularly like Shri Burle Nageswara Rao, Bommidi Achchaa Rao and Machiraju Kameswar Rao etc.in this regard. I am sure this feature of Paropakari Papanna can very well be revived and very well deserves to be.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.