3, జనవరి 2010, ఆదివారం

పరోపకారి పాపన్న కథల సేకర్త ఎం.రంగారావు…

చందమామ
పరోపకారి పాపన్న

అతడు…కర్నాటకలో మంగుళూరు (దక్షిణ కెనరా) కు చెందిన పసివాడు. తండ్రి చేసిన అప్పులను తీర్చడానికిచిన్నతనంలోనే మంగళూరు నగరంలో ఓ ఇంట్లో పనికి కుదిరాడు. వంటపని చేస్తూ బతుకు సాగించాడు. చదువుసంధ్యలు లేకుండా సంవత్సరాలు గడిపాడు. తండ్రి చేసిన అప్పు పూర్తిగా తీర్చేసిన తర్వాత కుటుంబంతో పాటుతమిళనాడుకు వలస వచ్చాడు.

అటునుంచి మన రాష్ట్రంలో నెల్లూరు, గూడూరు పట్టణాల వరకు వలసపోయాడు. రాష్ట్రాల సరిహద్దులు దాటి సాగిన ఈవలస జీవితంలో మాతృభాష కన్నడకు తోడుగా కొంతవరకు తెలుగు కూడా నేర్చుకున్నాడు. రెండో భాషలో కొద్దిప్రావీణ్యం అందించిన గొప్ప అవకాశం దన్నుతో అలనాటి చిత్రకారుడు ఎంటీవీ ఆచార్య గారి సిఫార్సుతో చందమామలోఅడుగుపెట్టాడు.

ఆయనే ఎం.రంగారావు. చందమామ కన్నడ భాషా ఎడిటర్గా 1950ల ప్రారంభం నుంచి నాలుగు దశాబ్దాల పాటుపనిచేసిన రంగారావు గారు. చందమామకు రంగారావు గారు చేసిన గొప్ప దోహదం ఏదంటే పరోపకారి పాపన్న కథలు, గుండుభీమన్న కథలను సేకరించి తెలుగులో రాసి ఇవ్వడం. కన్నడ జానపద సంప్రదాయంలోంచి పుట్టుకొచ్చిన ఈకథలు తెలుగు కథా సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఓ కన్నడిగుడు తెలుగు బాల సాహిత్యానికిఅందించిన అమూల్యమైన కథలివి.

చందమామలో ప్రచురించబడిన ధారావాహికలలో ముఖ్యమైనది పరోపకారి పాపన్న కథలు. 1962 నుంచి ఈ కథలుచందమామలో సీరియల్ రూపంలో వచ్చాయి. ‘ఈ కథలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ఎవరైనా కొంచెం మంచికి పోయిసహాయపడితే, అటువంటివారిని ‘పరోపకారి పాపన్నరా వాడు’ అని పిలవటం వాడుక అయ్యింది.’ అలాగే అంతకుముందు ఈయన రాసిన గుండు భీమన్న అనే మరో సీరియల్ కూడా చందమామలో వచ్చింది. దీన్ని కుటుంబరావుగారు రాకముందు తెలుగు ఎడిటర్గా ఉన్న రాజారావుగారు సాపుచేసి మొదట తెలుగులో ప్రచురించారు.

కర్నాటక ప్రాంతానికి చెందిన ఓ పిల్లవాడు బాలకార్మికుడిగా, వంటమనిషిగా జీవితం ప్రారంభించి సాహిత్యం వాతావరణంఉన్న కుటుంబాల్లో పెరిగి స్వయంకృషితో రచయితగా పరిణమించడమే కాక, తదనంతర కాలంలో చందమామ కన్నడఎడిటర్గా రూపొందిన క్రమం గత 60 సంవత్సరాలుగా మరుగున పడిపోవడమే ఓ విషాదంగా చెప్పాలి. చదువునేర్చుకోవడం ద్వారా ఓ వంటమనిషి జీవితంలో సంభవించిన మౌలిక మార్పుకు రంగారావు గారు నిలువెత్తు సంకేతంలాచరిత్రలో నిలిచిపోయారు.

ఈ కథనం పూర్తి పాఠం చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి.
పరోపకారి పాపన్న కథల సేకర్త ఎం.రంగారావు

గమనిక: కన్నడ చందమామ పూర్వ ఎడిటర్ రంగారావు గారి వివరాల సేకరణకు ఇద్దరు ప్రేరణగా నిలిచారు. ఒకరు రోహిణీ ప్రసాద్ గారు. మూడు నెలల క్రితం ఆయనతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఆయన పత్యుత్తరమిస్తూచందమామలో గతంలో పనిచేసిన కన్నడ ఎడిటర్ రంగారావు గారు, తమిళ ఎడిటర్ స్వామినాథన్ గారు తదితరులనుప్రస్తావిస్తూ వీలైతే వారి గురించిన వివరాలు కనుక్కోవలిసిందిగా కోరారు.

అలాగే శివరాం ప్రసాద్ గారు.. పరోపకారి పాపన్నలోకి పరకాయప్రవేశం చేశారా అన్నట్లుగా ఇటీవలే తన బ్లాగులో రెండు మంచి కథనాలను పోస్ట్ చేశారు. కన్నడ జానపద మూలానికి చెందిన పాపన్న, గుండుభీమన్న తెలుగులోకి ఎలావచ్చారనే కుతూహలం వీరిద్దరి ప్రేరణలకు తోడైన క్షణాల్లో ఈ వ్యాసం రూపు దిద్దుకుంది. అందుకు వారిద్దరికీకృతజ్ఞతాభివందనలు…

రంగారావు గారికి సంబంధించిన ఇతర అంశాలు ఇంకా వెలుగులోకి రావల్సి ఉంది. ఈ విషయాలు తెలిసినవారు ఈ వ్యాసం చదివి వారి వ్యాఖ్యా రూపంలో అందిస్తే ఈ అదనపు వివరాలు కూడా లభిస్తాయనే ఆశిద్దాం…



వ్యాసం చందమామ చరిత్ర బ్లాగులో శ్రీ రాజశేఖర రాజుగారు వ్రాసినది. బ్లాగులో వచ్చిన వ్యాఖ్యలు కూడ ఇక్కడ ఉంచటం జరిగింది

1. Rohiniprasad on September 30, 2009 7:51 AM
చందమామలో
మా నాన్న కుటుంబరావుగారు, ముద్దా విశ్వనాథం, దాసరి సుబ్రహ్మణ్యంగారిలాగే కన్నడం ఎడిటర్రంగరావు (కన్నడంవారు రంగారావు అని పలకరు) ఫుల్టైం పనిచేసేవారు. ఈయన ఇతరత్రా కన్నడ రచనలు కూడాచేశారు. మానాన్న రాసిన ప్రేమించిన మనిషి తదితర నవలలను కన్నడంలో అనువదించారు. ఆయనకు నత్తి ఉండేది. చాలా మంచి మనిషి. సరదాగా మాట్లాడేవారు. తమిళ ఎడిటర్ స్వామినాథన్ పార్ట్ టైం పనిచేసేవారు.

2. SIVARAMAPRASAD KAPPAGANTU on September 30, 2009 12:13 పం
రాజుగారూ,
అద్భుతం! పరమాద్భుతం!! ఎన్నాళ్ళమట్టి అనుకుంటున్నాను పరోపకారి పాపన్న కథలను రచించిన రచయిత గురించితెలుసుకుందామని. ఎప్పుడో, చందమామవారు, ఒక అపాఠకుడి ప్రశ్నకు జవాబిస్తూ, చెప్పి చెప్పనట్టుగా మాకార్యాలయంలోనే పనిచేస్తున్న రంగారావుగారు వ్రాస్తున్నారు కథలను అన్నారు. చందమామ అప్పటి యాజమాన్యంతమదగ్గర పనిచేస్తున్న మణిపూసలవంటివారి గురించి ఎక్కడా పెద్దగా చెప్పపోవటం, ముక్తసరిగా వ్యవహరించటానికికారణం ఏమై ఉంటుంది. మరేదైనా పత్రిక వీళ్ళను ఎగరేసుకుని పోతుందని భయమా లేక యాజమాన్యాలకి సహజంగాఉండే ఒక క్రూర అలోచనా పధ్ధతా? కొడవటిగంటి వారక్కడ ఉండగానే!! ఏది ఏమైనా మీ వల్ల చందమామలోని హేమా హేమిలగురించి తెలుసుకునే అవకాశం దొరికింది. అప్పుడో రావలసిన పేరువారికి మీరు ఇప్పుడు ప్రచారంలోకి తెస్తున్నారు. అప్పుడు వారి కథలను చదివి సంతోషించిన నా లాంటివాళ్ళందరూఆసక్తిగా చదివే అంశం ఇది. ఒక సూచన, కోరిక. మీరు తప్పకుండా చిత్రా గారిగురించి కూడ ఇలాగే, మీ అఫీసులో ఉన్న శ్రీ బాలుగారిని బాగరెచ్చగొట్టి, వివరాలు సంపాయించి సవివరంగా వ్రాయగలరు.తప్పకుండా, చిత్రా గారి కుటుంబాన్ని కలుసుకుని, వివరాలతో పాటుగా వారి ఫొటోలను కూడసాధించిఅప్పుడు వ్రాయండి వ్యాసం. నేనేదో మిమ్మల్ని ప్రోత్సహించినట్టుగా నాపేరును వ్రాశారు. నేనేదో సరదాగా ఆఫీసు పని ఒక్కటే కాకుండా, ఒకవ్యాపకంఘా వ్రాస్తున్నాను, అప్పుడప్పుడూను. మీరు ఆఫీసు పనిగా అనుకోకుండా ఈపనిని అద్భుతంగా చేస్తున్నారు. శభాష్

3.
రాజశేఖర్ on September 30, 2009 12:18 PM
రోహిణీ
ప్రసాద్ గారికి,
క్లుప్తంగా
ఉన్నా మీరిచ్చిన సూచన విలువైంది. రేపు ఆఫీసుకు వెళ్లగానే మీ సూచనకనుగుణంగా కథనంలో మార్పుచేస్తాను. రంగరావు గారి గురించి స్థూల విషయాలు మాత్రమే సేకరణలో లభ్యమయ్యాయి. ఫలానా రచనలు చేశారనేవిషయమే బయటపడుతోంది కాని నిర్దిష్టంగా తన రచనల వివరాలు తెలియటం లేదు. ఆయన గురించి మీరు ఉపయోగించినచాలా మంచి మనిషిపదప్రయోగం అక్షర సత్యం. ఇక్కడ కూడాబాలసుబ్రహ్మణ్యం గారు, శంకర్ గారూ ఆయన గురించి చాలా మంచిగానే మాట్లాడుతున్నారు. చివరకు తెలుగులోంచిచందమామ కథలను అనువదించేటప్పుడు చిన్న సందేహం తలెత్తినా కన్నడ అనువాదకులు బృందం దాన్ని నివృత్తిచేసుకున్నతర్వాతే తదుపరి అనువాదంలోకి వెళ్లేవారని బాలు గారు చెబుతున్నారు. మూలానికి భిన్నంగా పోరాదనే సంప్రదాయాన్ని చందమామ ఇతర భాషల కంటే, కన్నడ బృందమే ఖచ్చితంగాపాటించేదట. వ్యక్తిగత మంచితనంతో పాటు, ఉద్యోగగతమైన మంచితనానికి కూడా కన్నడ జాతిలో కొనసాగుతున్నసహజసాత్వికతేకారణం అనిపిస్తోంది. చాలా సార్లు నా అనుభవం కూడా ఇదే మరి. గత మూడునెలలుగా మీతో విషయం పంచుకోవడంలో జాప్యం కొనసాగుతోంది. వీలైనంత త్వరలో మీకు పర్సనల్మెయిల్ద్వారా తెలియ జేస్తాను. అన్యథా భావించరని ఆశిస్తూ..

4. రాజశేఖర్ on September 30, 2009 1:21 PM
శివరాం ప్రసాద్ గారూ,
మీరు మీ వ్యాఖ్య తొలి పేరాలో చివరి నాలుగులైన్లలో చెప్పిన విషయం రోహిణీ ప్రసాద్ గారయితే స్పష్టంగా చెప్పగలరనిఅనుకుంటున్నాను. చందమామ నాటి యాజమాన్యానికి, అప్పటి ఉద్యోగులకు -ఎడిటర్లకు- మధ్య నిత్యం లోలోపలకొనసాగుతూ వచ్చిన వైరుధ్యాలే చందమామ కథలకు, పత్రిక క్వాలిటీకి మరింతగా వన్నెలు దిద్దాయేమో.. వైరుధ్యంలేనిదెక్కడ మరి? పత్రికకు పేరు రావాలి కాని రచయితలకు, ఎడిటర్లకు ఎందుకు అనే పాలసీ చందమామలో అమలయిందని అందరికీతెలిసిన విషయమే. దీంట్లో పాజిటివ్ గుణం ఉంటే ఉండవచ్చు గాని, మరోవైపు చందమామ కథకులకు చరిత్ర లేకుండాపోయింది. మీరన్నట్లుగా మణిపూసల వంటి చందమామ అలనాటి ఉద్యోగులు, కథకులు పాలసీలో భాగంగానేచరిత్రలో మరుగునపడిపోయారు. ఉద్యోగులను సంస్థలు నెత్తిన పెట్టుకుని పూజించవలసిన అవసరం లేదు గానీ, తెలుగు కథాసాహిత్య చరిత్రలో, చిత్రలేఖనచరిత్రలో నవశకానికి నాందిపలికిన అలనాటి చందమామ ఉద్దండుల ఫోటోలు కూడా ఈరోజు ప్రపంచానికి దక్కకుండాపోయాయి. చిత్రా గారి అస్తమయం సందర్బంగా 1978 చందమామలో వేసిన అస్పష్టపు ఫోటో ఒక్కటి తప్పితే చిత్రాగారి గురించిన ఫోటో కూడా ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేదు. ఇక ఆయనకు సంబంధించిన సమాచారం గురించిచెప్పపనిలేదు. కనీసం చిత్రా అనే వ్యక్తి భూమ్మీద పుట్టి చందమామలో మూడు దశాబ్దాలు పనిచేశారనే విషయంతెలుసుకోవడానికి కూడా చందమామలో ఆయనకు పలికిన నివాళి మాత్రమే సాక్ష్యంగా ఉంది. ఇక ఎంటీవీ ఆచార్య గారిగురించి చెప్పనవసరం లేదు. నాకు తెలిసినంత మేరకు ఆయన ఫోటో లేదు. దాంతో పాటు సమాచారం కూడా లేదు. వీరిఇద్దరి గురించి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి మన శంకర్ గారు మాత్రమే.. అది కూడా స్థూలంగా మాత్రమే ఆయన చెప్పవచ్చనిఅనుకుంటున్నాను. ఎంటీవీ ఆచార్య గారి చిత్రలేఖన రీతులు కన్నడ మేధోరంగంలో చాలా పాపులర్ అయి ఉన్నట్లు ఆన్లైన్లో దొరుకుతున్నఇంగ్లీష్ సమాచారం బట్టి తెలుస్తోంది. దీని ఆధారంగా బెంగళూరులో ఆయన గురించిన సమాచారం లభ్యమవుతుందేమోమీరూ ప్రయత్నిస్తే మంచిదనుకుంటున్నా.. సంస్థ చెప్పని, తమగురించి తాము చెప్పుకోలేని చందమామ రచయితల, చిత్రలేఖకుల నిర్మమకారం వారికి ఆభరణంకావచ్చేమో కాని చరిత్రకు మాత్రం చాలా నష్టం.. రోహిణీ ప్రసాద్ గారు కూడా దాదాపు అభిప్రాయంతోటేచందమామజ్ఞాపకాలుగురించి రాశారనుకుంటాను. గత మూడేళ్లుగా వ్యాసం ఎంత సంచలనం రేకెత్తించిందో, తదనంతరపరిణామాల పరంపర గురించి మనకందరికీ తెలుసు. కుటుంబరావు గారు చందమామ అనధికారిక ఎడిటర్గా పనిచేశారనే విషయం ఆయన చెబితే తప్ప ప్రపంచానికి 5 దశాబ్దాలపాటు తెలియకపోయింది. సంస్థకు పేరు రావాలి. నిజమే.. వ్యక్తుల కన్న సంస్థ గొప్పది నిజమే.. కానీ వ్యక్తులకుచరిత్రే లేకుండా పోతే ఎలెక్స్ హేలీ అమెరికానుంచి ఆప్రికా లోని గాంబియా వరకు పరుచుకున్న తన వంశవృక్షంలోని ఏడుతరాల చరిత్రనుఆఫ్రికా బానిసల నౌకా ప్రయాణపు చరిత్ర ఆధారంగా ఒడిసి పట్టుకున్నాడు. కాని మనం కేవలం ఒక తరానికే ఒక ఉజ్వలశకానికి సంబంధించిన చరిత్రను లేకుండా చేసుకున్నాం. చరిత్ర రచనకు సంబంధించి మన తరతరాల సాంప్రదాయికదౌర్భాగ్యం ఇప్పిటికీ కొనసాగుతూ ఉందేమో మరి..! 60 సంవత్సరాలు నిండిన సందర్బంగా తీసుకువచ్చిన చందమామ కలెక్టర్స్ ఎడిషన్ పుస్తకం ఉన్నట్లుండి గుర్తుకువచ్చి బాలు గారిని కదిపితే మన రంగరావు గారికి చెందిన రెండు ఫోటోలు దొరికాయి. అయితే చిత్ర, ఆచార్య గార్లకు పుస్తకంలో చోటు లేదనిపిస్తోంది. బాలు గారు వీరి విషయంలో చేతులెత్తేసారు గనుక శంకర్ గారినే పట్టుకోవాలి. దొరికేదికాస్తంతే అయినా అది కూడా పెన్నిధే కదా మనకిక మన చందమామ ప్రియుల, చంపిల సమాచార పంపిణీలో ఎక్కటో చిత్రాగారు తమిళులు అని ఆయన పేరు టీవీరాఘవన్ అని పేర్కొన్నట్లు ఉంది. ఇది మాత్రం సవరించుకోవాలి. ఆయన పదహారణాల తమిళాంధ్రుడు. విషయంలోసందేహమే లేదు. మీరు నన్ను బాగా పొగడుతున్నట్లుంది కదూ.. కాని నేను చాలా చిన్నవాడిని.. చందమామ తీరంలో గవ్వలుఏరుకుంటున్న వాడిని మాత్రమే అని అనుకుంటున్నా.. మీకు ధన్యవాదాలు.

5. SIVARAMAPRASAD KAPPAGANTU on September 30, 2009 9:53 PM


గవ్వలనేమిటి
బాబూ , ముత్యాలనే ఏరుతున్నారు, మట్టి దులిపి, మెరుగుపరచి అందరిముందు ఉంచుతున్నారు. మరిన్ని ముత్యాలు మీ ఆధ్వర్యంలో బయలు పడాలని ఆశీర్వదిస్తూ మీ శివరామ ప్రసాదు

6. chandamamalu on October 1, 2009 3:58 AM


శివరాం గారూ.. మీ ప్రశంసకు అంజలి ఘటిస్తున్నా.. ఇప్పుడే అందిన వార్త. పరోపకారిపాపన్న కథలు దాదాపు 10 భాగాలవరకు 90చివర్లో దూరదర్శన్లో ధారావాహికగా ప్రసారం అయ్యాయట. బాపుగారి సహాయకుడు కే.వీ రావు దర్శకత్వం కిందచందమామ ప్రొడక్షన్ పేరుతో ధారావాహికలను రూపొందించారట. కొన్ని వారాల పాటు ఇవి దూరదర్శన్లోప్రసారమైనట్లు బాలుగారు చెబుతున్నారు. దూరదర్శన్లో బేతాళ కథలు సీరియల్గా ప్రసారం అయినట్లు తెలుసు కాని, పరోపకారి పాపన్న కథలు చిత్రరూపం దాల్చినట్లు తెలీదు. మీకేమైనా తెలిస్తే పంచుకోండి.

7. రవి on October 1, 2009 4:25 AM
రాజు గారు, పరోపకారి పాపన్న కథల రచయిత గురించిన వివరాలు చాలా హృద్యంగా ఉన్నాయి. కథలు పాఠకుల మనస్సుల్లోఎంతగా ఇమిడిపోయాయో, విషయం మాటల్లో చెప్పలేనిది. చందమామ పత్రిక గురించి వదిలేసి, చందమామలో పని చేసిన వ్యక్తుల గురించి తెలుసుకుంటుంటే, కొత్త ఉద్యోగసాంప్రదాయం గురించిన అవగాహన కలుగుతూ ఉంది. చాలా మందికి – (నాతో బాటు) చేసే ఉద్యోగానికి, వారి జీవితానికిపొంతన ఉండదు. చందమామ ఉద్యోగులలా లేరు! వారి ఉద్యోగమూ, జీవితమూ, ఆనందమూ, దుఃఖమూ అన్నీచందమామతోనే ముడివడిపోయాయి. ఇది చాలా చాలా అరుదు, అద్భుతమూనూ. ఇదే వర్క్ కల్చర్ ను పాటించి, ముందుకు సాగవలసిన (సాగించ వలసిన) బాధ్యత చందమామ యాజమాన్యం మీద, చందమామ ఉద్యోగుల మీదాఉన్నది.

8. SIVARAMAPRASAD KAPPAGANTU on October 1, 2009 9:04 AM

Rajugaru,
I know that Paropakari Papanna Kathalu were made into TV Serial in DooraDarshan. But I could not see even one episode. What I gather that the same were not good enough, due to casting mistakes and many mistakes in creating the background etc. I do not comment on what I have not seen myself. Lets hope, someday, it would be telecast with Malgudi Days quality of Casting, Direction etc.

9. chandamamalu on October 6, 2009 12:29 AM
ఆన్లైన్ చందమామలో పరోపకారి పాపన్న కథల సేకర్త ఎం రంగరావు పేరిట పోస్ట్ చేసిన కథనం పట్ల ప్రముఖ బ్లాగర్, చందమామ ప్రియులు శ్రీ శివరామ్ ప్రసాద్ గారు సంతోషం వ్యక్తం చేస్తూ abhiprayam@chandamama.com కు తనవ్యాఖ్య రాశారు. వ్యాఖ్యను పాఠకుల సౌకర్యార్థం ఇక్కడ వ్యాఖ్యరూపంలో ఉంచుతున్నాము.
. రాజు.

DEAR SIR, I am quite happy to read about Shri Rangarao who wrote the Paropakari Papanna stories in Chandamama. Until I read this article, I was not knowing that Papanna is a folklore hero in Mangalore coastal area. I have been under this impression that Papanna is a Telugu Character. The credit goes to Shri Ranga Rao and those Editor/s who made the story look like a pucca Telugu story. I still remember reading the Paropakari Papanna Kathalu and eagerly awaiting for the next month to see how Papanna shall be helping people. From these excellent stories I imbibed the habit of helping needy. These stories have really bult up characters of counteless children in those years. Its quite unfortunate that present day Chandamama is bereft of such great stories, but going after quite synthetic stories in the name modernisation, completely foregetting why readers like Chandamama. There is a great need to write more and more stories of Papanna and start publishing them in the same mileu without changing the background era and people.I hope Chandamama publishes a separate book containing all Paropakari Papanna Kathalu. I am sure if published it would sell like hot cake. But one condition, such book should contain all the pictures drawn by Shri Chitra, without leaving a single picture. Then only the book would be complete. I hope the present day Chandamama owners would consider my suggestions given above. Regards, SIVARAMAPRASAD KAPPAGANTU FROM BANGALORE, INDIA

10. chandamamalu on October 10, 2009 3:13 PM


రవి గారూ,
కృతజ్ఞతలు చందమామ ఉద్యోగులలా లేరు! వారి ఉద్యోగమూ, జీవితమూ, ఆనందమూ, దుఃఖమూ అన్నీ చందమామతోనేముడివడిపోయాయి.” మీ వ్యాఖ్య అక్షర సత్యం. చందమామ ఉద్యోగులు కలకాలం గుర్తుపెట్టుకోవలసిన మాట ఇది. మీ వ్యాఖ్య చందమామఉద్యోగులుగా మేం మరింత జాగ్రత్తగా, నిబద్ధతతో, చిత్తశుద్దితో పనిచేయవలసిన అవసరాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేస్తూనేఉంటాయి. ధన్యవాదాలు.


‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌‌ ‌ ‌ ‌ ‌‌ ‌

1 కామెంట్‌:

  1. శివరాం ప్రసాద్ గారూ,
    ఇప్పుడే మీరు పోస్ట్ చేసిన కథనం చూశాను. అప్పట్లో ఓ వ్యాఖ్యలో చందమామ కలెక్టర్స్ ఎడిషన్‌లో చిత్ర,శంకర్ గార్ల ఫోటోలు ఉన్నట్లు లేదని రాశాను. తర్వాత శంకర్ గారితో ప్రస్తావిస్తే ఆయన ఆ పుస్తకం చూసి తొలి పేజీలలోని చందమామ బృంద ఫోటోలో చిత్రా, శంకర్‌లు పక్కపక్కనే నుంచుని ఉన్న ఫోటోలను చూపించారు. వారు చందమామలో నిజంగా కూడా రామలక్ష్మణుల లెక్కే మరి. ఈ ఫోటోలు, శంకర్ గారు తన ఆల్బమ్‌లోంచి ఇచ్చిన ఫోటోలలో 1950-60లలోని చిత్ర, శంకర్, ముద్దా విశ్వనాధం తదితరుల ఫోటోలు ఉన్నాయి. అవి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే అనుకోండి. అవి వీలు చూసుకుని చందమామ సైట్‌, బ్లాగులో ప్రచురించగలము. చిత్రాగారి జీవిత చరిత్ర గురించిన వ్యాసం ఇంకా పెండింగులోనే ఉంది. దానికోసమని ఆ ఫోటోలు తీసిపెట్టాము. మీరు శంకర్ గారిని కలవడానికి రావటం జరిగింతే పనిలో పనిగా ఆయన వద్ద ఈ వివరాలు అన్నీ సేకరించవచ్చు.

    అభినందనలతో
    రాజు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.