6, జనవరి 2010, బుధవారం

బ్లాగర్ల కలయిక

మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని మన అభిప్రాయాలను, అనుభూతులనుబ్లాగుల రూపంలో నలుగురితో పంచుకునే అవకాశం వచ్చింది. అలా ఎవరి బ్లాగులో వారు వ్రాసుకుంటూ, ఇతరులవ్యాసాలపై సద్విమర్శ, ప్రశంస చేస్తూ బ్లాగింగు అభిరుచిని ఆరోగ్యవంతంగా కొనసాగిస్తున్న తరుణంలో అనేమ మందిమిత్రులు లభిస్తున్నారు. ఇలా చాలా కాలం బట్టి మనకు తెలియకుండా, ఒకరినొకరు చూడకుండానే స్నేహం కలసినమిత్రులను కలుసుకోవటం ఒక మంచి జ్ఞాపకం. గడచినా ఆదివారం CB RAO గారు (దీప్తిధార) బెంగుళూరు వచ్చిఇక్కడ తెలుగు బ్లాగర్లందరికీ మైళ్ళు ఇచ్చి తానొక్కడే పూనుకుని, లాల్ బాగ్ లో ఒక చిన్న కలయిక ఏర్పాటు చేసారు. పిలిచింది దాదాపు ఇరవైమందికి పైగా వచ్చినది ఐదుగురు. ఏమైనా వచ్చిన వారినందరినీ కలుసుకోవటం అదేమొదటిసారి. లాల్ బాగ్ లో ఆదివారం సాయత్రం ఆహ్లాదకర వాతావరణం అనుభవిస్తూ, స్నేహితులతో చర్చించుకోవటంఒక అదృష్టంగా భావిస్తున్నాను. సందర్భంగా రావుగారు తీయించిన ఒక ఫోటో కింద ఇస్తున్నాను.
పై చిత్రంలో ఎడమ నుండి కుడికి 1.శ్రీమతి ఉమామహేశ్వరి , 2. శ్రీ సి.బి రావు, 3. శ్రీ చావల అర్జున్ రావు 4. శ్రీ శివరామ ప్రసాదుకప్పగంతు 4.శ్రీ ప్రవీణ్ గార్లపాటి మరియు 5. శ్రీ జి. త్రివిక్రమ్
సమావేశంలో, రాబోయే నేలనుండి ప్రతినెల బెంగుళూరులో తెలుగు బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చెయ్యాలనిఅనుకున్నాము.

ఇదే విధంగా కొన్ని నెలల క్రితం ప్రముఖ బ్లాగరు శ్రీ రాజశేఖర రాజుగారు బెంగుళూరు వచ్చినప్పుడు, నా ఆహ్వానాన్నిమన్నించి మా ఇంటికి వచ్చారు. ఆయనతో గడిపిన ఐదారు గంటలు అద్భుతమైన చర్చలో నిమిషాల్లాగడిచిపొయినాయి. ఆరోజున తీసిన ఫోటో
కింద ఇస్తున్నాను
ఇదేవిధంగా బెంగుళూరులో జరుగిన పుస్తక ప్రదర్శనకు వెళ్ళినప్పుడు బ్లాగాడిస్తా రవి మరియు నాగమురళి గార్లు నన్నునా బ్లాగులో ఉన్నసైడు ఫోజు ఫోటో చూసి గుర్తుపట్టి పలకరించటం ఒక చక్కటి అనుభవం. కాని సందర్భంగా ఫోటోతీయటం కుదరలేదు.

కొన్ని దశాబ్దాలక్రితం పెన్ ఫ్రెండ్స్ ఉండేవారు. దేశ దేశాల లో ఉన్న పెన్ను స్నేహితులను కలుసుకోవటం అనేది జరిగేది కాదు. ఎప్పుడన్నా జరిగినా అదొక అరుదైన సంఘటనగా మిగిలేది . నాకు హాం రేడియో హాబీలో అనేకమందితో రేడియోలోమాట్లాడటం జరిగేది . అలా మాట్లాడుకున్న వారిలో ఎప్పుడన్నా కొద్ది మందిని కలుసుకోవటం జరిగేది.

ఇలా రకరకాల అభిరుచులతో మంచి మంచి స్నేహితులు కావటం ఎంతైనా ఆనందకరమైన విషయం.

7 వ్యాఖ్యలు:

 1. శివ గారూ 1
  మీ కలయిక బాగుంది. ఇలా అప్పుడప్పుడైనా వ్యక్తిగతంగా కలవటం అవసరమని నా అభిప్రాయం. విజయవాడలో బ్లాగర్లను కలిసే అవకాశం ఇటీవల కొత్తపాళీ గారి వల్ల, ఇ- తెలుగు వారి వల్ల కలిగింది. మీ స్పూర్తితో దీన్ని కొనసాగించాలని ఉంది. ఈ ఏర్పాటు చేసిన సి. బి. రావు గారికి, హాజరయిన బ్లాగు మిత్రులకు, ఆ వివరాలు మాకందించిన మీకు ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నేను బెంగళూర్ లోనే ఉంటాను.. ఈ సారి బ్లాగర్ల కలయిక కు నాకు తెలియజేయగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. hello sir, మీ బ్లాగ్ చాలా బాగా ఉన్నది
  ...విజయ్

  ప్రత్యుత్తరంతొలగించు
 4. kotha kutumbam....manchi alaochanalatho kotha samajam nirmananiki sreekaram chuttina prasadu gariki...naaku aa avakasam ivvalani koruthu ..lakshminaresh

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బ్లాగర్లతో పరిచయం, అందరూ కూడి ఓ చోట కలుసుకోవడం, వాటిని ఇలా అక్షరాల్లో పెట్టడం చాలా బావుంది. కలం స్నేహితుల లాగా బ్లాగు స్నేహితులు పదబంధం కూడా భాషలో స్థిరపడిపోయే తరుణం వచ్చేసిందనుకుంటాను. మీ యింటికి వచ్చినపుడు మనం తీసుకున్న ఆ ఫోటోను కూడా వేశారు. చాలా సంతోషం. నన్ను మరీ ఎక్కువగా పొగిడేసినట్లుంది సార్. ఇలాగే చెన్నయ్‌లో కూడా తమిళ బ్లాగర్లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఒకరోజు మెరీనా బీచ్‌లో కలుసుకుంటున్నారు. తెలుగు బ్లాగర్లు చెన్నయ్‌లో చాలామందే ఉన్నప్పటికీ ఇంతవరకు పరస్పరం కలుసుకున్న సందర్భం నా దృష్టికి రాలేదు. బెంగళూరు బ్లాగర్ల లాగా ఇక్కడ కూడా ఉన్న బ్లాగర్లం ఏదో ఓ చోట వీలైనప్పుడు కలిసి తమ అభిప్రాయాలు పంచుకుంటే బాగుండుననిపిస్తోంది. నా వంతు ప్రయత్నం నేనూ చేస్తాను. నాకు తెలిసిన చెన్నయ్ బ్లాగర్లను ఈ విషయమైన సంప్రదిస్తాను. మనం ఏమీ పొడిచేయలేకపోవచ్చు.. కానీ బ్లాగ్ అనుభవాలను పంచుకోవచ్చు. శివరాం గారూ అభినందనలు..

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.