6, జనవరి 2010, బుధవారం

ఎందుకో తెలుసా?



గతంలో ఎందుకో తెలుసా? అనే శీర్షికతో కధలు వచ్చేవి
ఒక ప్రశ్నవేసి దానికి కధా రూపంలో జవాబు చెప్పమనేవారు. కుక్క మూతి
చల్లగా వుంటుంది ఎందుకో తెలుసా? అని ఓ ప్రశ్న అడిగారు. దురదృస్ట వసాత్తూ
ఆ కధ పడ్డ చందమామ నా దగ్గర లేదు. 1953 నుంచే జాగ్రత్త చేసాను.నాకు
గుర్తు వున్నంత వరకు చెబుతాను. ఓ వ్యక్తి కుక్కను ఎంతో ప్రేమతో పెంచుకొనేవాడు.
ఒక సారి వరదలొస్తే అతడు అతని కుటుంబం ఓ పడవలో రాత్రి కటిక చీకటిలో
ప్రయాణం చేసారు.ఆ గాలి వానలో వరద నీటిలో తెల్లవార్లూ ఆ పడవ దాని ఇస్టమొచ్చినట్లు
సాగి పోయింది.అలసి వాళ్ళంతా గాఢ నిద్రపోయారు.తెల్లవారినతరువాత మేలుకొని చూస్తే
వాళ్ళ పెంపుడు కుక్క పడవ అడుగు భాగాన్ని ముక్కు ఆనించి అగుపించింది.ఏమిటా
అని యజమాని చూస్తే ఆ పడవకు అడుగున చిన్న రంధ్రం పడి నీరు పడవలోకి నెమ్మదిగా
వస్తున్నది.దీన్ని గమనించిన ఆ కుక్క తెల్లవార్లూ ఆ రంధ్రాన్ని తన ముక్కుతో మూసి
యజమాన్ని కుటుంబాన్ని కాపాడింది.తెల్లవార్లూ అలా నీటిలో ముక్కు నానటం వల్ల
అప్పటినుంచి కుక్కల ముక్కు చల్లగా వుంటుందట.ఇలా ఆ రోజుల్లో పిల్లలకు కల్పనాశక్తి
పెంపొందించే కధలు మన చందమామలో వచ్చేవి.
***యమ్వీ.అప్పారావు(సురేఖ)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.