4, జనవరి 2010, సోమవారం

విచిత్ర కవలలు - బొమ్మలు

పైన ఉన్న బొమ్మలు చందమామలో మొట్టమొదటి సారిగా రెండవసారి ప్రచురించబడిన ధారావాహిక విచిత్రకవలలులోనివి. మొదటి సారి ధారావాహికను ప్రచురించినప్పుడు బొమ్మలు రంగులలో లేవు, అప్పటికి సాంకేతిక నైపుణ్యంమనకు వచ్చినట్టు లేదు. అటు నలుపు తెలుపులోను, తరువాత రంగులలోను బొమ్మలు వేసినది, చిత్రా గారే. చిత్రాకు తన పేరు బొమ్మలోని ఒక రాయిమీద వ్రాసుకోవటం చాలా ఇష్టంగా ఉన్నాట్టున్నది. కుడి పక్కన ఉన్న బొమ్మలోచూడవచ్చు. విధంగా ఆయన తనపేరు వ్రాసుకోవటం, చందమామ బొమ్మలలో అనేక చోట్ల చూస్తాం. చందమామ దారావాహికలలో ఇలా పొడుగాటి బొమ్మలు వేసినది ఈ దారావాహికలోనే అనుకుంటాను.

చందమామ ధారావాహికలో పుస్తకంగా వచ్చినది విచిత్ర కవలలు. కాకపొతే పుస్తకంలో బొమ్మలు రంగులలో లేవు. తన చిన్నతనంలో పుస్తకాన్ని కొనుక్కోవటమే కాకుండా దశాబ్దాల పాటుగా పదిలంగా దాచుకున్న చందమామప్రియులు శ్రీ మట్టెగుంట అప్పారావుగారు (సురేఖ కార్టూనిస్టు). వీరు రాజమండ్రిలో ఉంటారు. ఆయన సేకరించిన పుస్తకంలోని కొన్ని బొమ్మలను మన అందరితోను పంచుకోవటానికి పంపారు. బొమ్మలు (రంగులు లేవు) కిందఇవ్వబడినాయి. రంగులు లేకపోయినా, చిత్రా గారి నైపుణ్యం కనపడుతూనే ఉన్నది.


























కింది బొమ్మలు చూడండి అందులో ఒకటి మొదటిసారి ధారావాహిక వేసినప్పటిది రెండవది తరువాత రంగులలో వేసినప్పటిది. దాదాపు ఒకేలాగా ఉన్న బొమ్మలు ఇవి.


1 కామెంట్‌:

  1. చిత్రా గారి బొమ్మల్లో చాలా గొప్ప ఆకర్షణ ఉంటుంది. ‘చందమామ’ పాఠకులకు చేరువవటంలో ఆయన చిత్రాల పాత్ర ఎంతో ఉంది.
    ‘తన పేరు బొమ్మలోని రాయి మీద రాసుకోవటం చాలా ఇష్టంగా ఉన్నట్టుంది’- చక్కటి పరిశీలన!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.