8, జనవరి 2010, శుక్రవారం

T V NEWS PARODY


మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల కాలు విరిగి కుంటుతుంటుంది. మనకి టైం ఉంటె ఆగి దానికి ఏమి కావాలొ చూస్తాం, లేదు అంటె అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతాం.

TV-గజిబిజి రిపోర్టర్ వెళ్తున్నాడు, వెంటనె TV-గజిబిజి ఆఫిస్ కి ఒక ఫొన్ వెళ్తుంది, వాడు కెమెరామెన్ ని పంపుతాడు.

ఇక మొదలు........

క్రిష్ణ ఆ కుక్క పరిస్తితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?

ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుంతుంది......స్వప్న

ఆక్కడి వాళ్ళు ఏమన్న చెబుతున్నారు ?...క్రిష్ణ

స్వప్న...ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా గతం లొ ఆ కుక్క ఈ area లొ ఇలా కుంటలేదని, ఇదె తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు

కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? .....క్రిష్ణ

కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న. ఈ విధంగా కాలు కు దెబ్బ తగలటం కొత్త అనుకుంట, అందుకె కుంటటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటనికి ప్రయత్నించిన అది సమాధానం చెప్పకుండ, మూలుగుతుంది.....స్వప్న

థాంక్ యు క్రిష్ణ, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తు ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.


ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైం ప్రతినిధి క్రిష్ణ అందించిన వివరాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..
బ్రేక్ తర్వాత కుక్కలు-కుంటుడు అంశం పై చర్చింటానికి ప్రముఖ Doctor కుక్కుటేశ్వర రావ్ గారు మన Studio కి వస్తున్నారు..


బ్రేక్ తర్వాత..........


బెజార్రావ్ : చెప్పండి కుక్కుటేశ్వర్ రావ్ గారు గతం లొ మీరు ఎప్పుడైన ఇలా కుక్కలు కుంటటము చూసారా? ఒక వేళ చూస్తె ఏ జాతి కుక్కలు కుంటటము చుసి ఉంటారు.

కుక్కుటేశ్వర్ : ఈ విధంగా కుక్కలు కుంటటం ఇది మొదటి సారి కాదు. ఫ్రపంచవ్యాప్తంగ ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లొ ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటటానికి జాతి తో సంబందం లేదు

బెజార్రావ్: అంటె కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమన్న బాధ ఉంటుందా? ఉంటె ఎటువంటి బాధ?

కుక్కుటెశ్వర్ : బాధ లొ రకాలు ఉండవండి. కుంటెటప్పుడు general గ దెబ్బ తలిగిన కాలు కి నొప్పి ఉంటుంది అని Dog's Medical Science లొ గట్టి ఆధారాలు ఉన్నాయి.


బెజార్రావ్: తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైం ప్రతినిధి క్రిష్ణ టెలి ఫొన్ లొ సిద్దం గ ఉన్నారు...క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.

క్రిష్ణ : (చెవిలొ ear piece పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు..)

క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క ఫరిస్థితి ఎలా ఉంది?

బేజా... ... కుక్క మూలుగుతుంది, ఇప్పుడె blue cross వాళ్ళు దానిని తీసుకువెళ్ళారు.


కుక్క కాలు కి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నయి?...క్రిష్ణ

బేజా, కుక్క కాలు కి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకర గా ఉంది.

వంకర అంటె ఎలా ఉంది...క్రిష్ణ (ఇప్పుడు బెజార్రావ్ మొహం లొ expressions ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ ని ద్వంసం చెయ్యటానికి wait చెస్తున్న soldier face లొ తప్ప)


బేజా! వంకర గ అంటిచుకుని ఉంది, నేను ఇప్పటికి దానిని straight చెయ్యటనికి try చేస్తున్నాను కాని అది చుట్టుకుపొతుంది. బహుశ కాలు కి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దెశం.

థాంక్ యు క్రిష్ణ....కుక్కుటెశ్వర్ గారు, కాలు కి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి క్రిష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?

కుక్కుటెశ్వర్:స్పందన అంటె ఏమి ఉంటుంది రా పుండకార్ వెధవ...కుక్క తోక కాలు కి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంట్రా పిచ్చోడా . ఏమి మనిషివిరా నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచ్చిన answers చదివాను, ఇంక నా వల్ల కాదు, నా టీ మరిగిపొతూ ఉంటుంది. బంగారం లాంటి మల్లయ్య అనే పేరు మార్చి కుక్కుటెశ్వర్ రావ్ అని మార్చి, షర్ట్, పాంట్ రెంట్ కి తెచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ act చెయ్యలా? ఇల act చేస్తె నా tea కొట్టు నుంచి ఎదురు గ ఉన్న మీ గజిబిజి టీవీ office కి రొజు 100 tea లు ఆర్డెర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందంట్ర వెధవ *్*్*్*.దొంగ నా &%%్**( గాలి న &$%్**.. మీ బతుకులు చెడ....)

(ఇలా తిడుతు ఉండగానె, గజిబిజి లోగొ వచ్చి, మెరుగైన మీ బతుకులకోసం చూస్తూనే ఉండండి గజిబిజి టీవీ అని voice వినిపించి ads రావటం మొదలవుతాయి..)

ఈ జోకుని పంపినది శ్రీ ఎం వి ఎల్ ప్రసాదు గారు అమెరికానుండి (పంపుల పరంపరలో ఆయన దగ్గరకు వచ్చినది)
పైన ఉన్న జోకును చూసి వెంకట రమణ గారు ఇల్లంటిదే యు ట్యూబ్ లో వీడియో ఉన్నదని లింకు పంపారు. కిందిలింకు నొక్కి చూడండి.


టి వి న్యూస్



*************************************************************************


7 కామెంట్‌లు:

  1. నేటి టీవీ చానళ్ళ పోకడల మీద భలే చురక...
    ముగింపు అంత బాగా అనిపించలేదు కానీ మిగతా పేరడీ మొత్తం నవ్వొచ్చేలా చాలా చక్కగా ఉంది.
    > కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? :)

    రిప్లయితొలగించండి
  2. దీనినే వీడియో రూపంలో ఇక్కడ చూడండి.

    http://www.youtube.com/watch?v=jzDPczUp_vA

    రిప్లయితొలగించండి
  3. వేణూగారూ, నమస్తే, ఈ జోకు ఇంటర్‌నెట్‌లో తిరుగాడుతున్నదే. ఒకరికొకరు గొలుసుకట్టుగా పంపుకుంటున్నది, మిత్రుడు శ్రీ ఎం వి ఎల్ ప్రసాద్ గారు పంపారు మైలులో. అది కొన్ని పేర్లు మార్చి బ్లాగులో ఉంచాను. ముగింపు ఏమున్నదండి, ఈ టి. వి చానెళ్ళ వాళ్ళు వాళ్ళ స్టుడియో బయట టీ అమ్ముకునే వాడిని తెచ్చి ఏదో పెద్ద మేధావి అని బిల్డప్పు ఇచ్చి, వాడికి వీళ్ళే జవాబులు ఇచ్చి చదివిస్తారని హాస్యం. నిజమెనేమో మరి.

    రిప్లయితొలగించండి
  4. ప్రసాద్ గారూ, బహుశా ఇది భాషాభేదం లేకుండా అన్ని న్యూస్ ఛానెల్స్ కు వర్తిస్తుంది. వీళ్ళ వార్తలకు ప్రేక్షకులే కాదు, అప్పుడప్పుడు వీళ్ళు కూడా పగలబడి నవ్వుకుంటు ఉంటారు, కమర్షియల్ బ్రేక్స్ సమయంలో. ఒకసారి నా కంట పడిందిలెండి ఇండియా టివిలో ఒక యాంకర్ ఏదో సోది కార్యక్రమం చేస్తూ మిగతాది బ్రేక్ తరువాత అంది - కానీ ఆపరేటర్ టైముకి యాడ్ వెయ్యకపోడంతో ఆవిడగారి వెర్రి నవ్వులు కనిపించేసాయి.

    రిప్లయితొలగించండి
  5. సి బి రావుగారూ. నాకు తెలియదండి ఇకెక్కడ ప్రచురితమైనదో. స్నేహితుడు ఎం వి ఎల్ ప్రసాదు గారు పంపారు, బాగున్నది, ప్రస్తుత సందర్భానికి సరిపోతుంది, ప్రచురించాను. అదేమాట అక్కడే వ్రాశానుకూడ.

    రిప్లయితొలగించండి
  6. చాలా బాఉన్నది.నాకు ఒక నానుడి గుర్తుకొస్తున్నది,
    ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటె.......

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.