5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాలి లేదా .....................


ఈనాడు వార్తా పత్రికలో జనవరి 30 2010 ప్రచురించబడిన వార్త:
నేర కథనాల ప్రసారాల నిలిపివేత

 • క్రైమ్ వాచ్, క్రైమ్ అండ్ పనిష్మెంట్, నేరాలు ఘోరాలు, తదితర రూపాల్లో నేర ధారావాహికల, నేర వార్తలు.
 • నేరం, హింసకు సంబందించిన చిత్రాలు, దృశ్యాలు
 • నేర కథనాల్లో, సాధారణ వార్తల్లో, స్త్రీ, పురుషులను అసభ్యంగా చూపించడం
 • మృత దేహాలను దగ్గరగా (క్లోజప్) చూపించడం
 • మహిళలు, పురుషులు పిల్లలపై దౌర్జన్యం జరుగుతున్నాపుడు, హింసాత్మక దృశ్యాలను ప్రసారం చేయడం.
 • నిందితుడు-ఫిర్యాదిదారుడి మధ్య మీడియా మధ్యవర్తిగా జరిపే సంభాషణల ప్రసారం
 • నేరాలు, హింసకు సంబంధించి, బెదిరించే విధంగా రెచ్చగొట్టే విధంగా, ఉసిగొల్పే విధంగా ఉన్న వార్తలు
 • ప్రభుత్వ, ప్రజల విలువైన ఆస్తుల విధ్వంస దృశ్యాలు ప్రసారం చేయడం
 • అమాయకుల ఆత్మహత్య చేసుకున్నాపుడు/చేసుకోబోయినప్పటి సన్నివేశాలు
 • అసభ్య పదజాలంతో కూడిన ప్రసంగాలు
 • రెచ్చగొట్టే అవాంచిత చర్చలు
 • నేరం, హింసకు సంబంధించిన స్క్రోలింగులు
 • ప్రజలు చట్టాన్ని oచేతుల్లోకి తీసుకునే విధంగా రెచ్చగొట్టే వార్తలు, స్క్రోలింగులు ప్రసారం
 • రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి మృతదేహాలను చూపడం
పైన చెప్పినవన్ని చెయ్యకూడని పనులనీ, అలా టి .వి చానెళ్ళు చూపించకుండా నియంత్రిచడానికి, గ్రూప్ ఆపైనఅధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని హైకోర్టు అదేసించినట్టుగా వార్త

మళ్ళి ఈనాడులోనే మరొక వార్త అది రోజున ఫిబ్రవరి 4 2010


టివీ చానెళ్ళపై ఒక్కసారైనా స్పందించారా:హైకోర్ట్

టివి చానెళ్ళు నిబంధనలు ఉల్లంఘిస్తున్నపుడు పోలీసులు ఒక్కసారైనా స్పంధించిన సంఘటనలు ఉన్నాయా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కేబుల్ టివి నెట్వర్క్ చట్టం అమలులో పోలీసుల ఉదాసీన వైఖరిని సవాలు చేస్తూ దాఖలు చేయబడిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు స్వీకరిస్తూ, న్యాయమూర్తులు పైవిధంగా ప్రశ్నించారని వార్త .

మొదటి వార్తను ఈనాడువారు ఎలాగోలాగ, ఇతర హెడ్డింగులమధ్య ఇరికించి మొదటిపేజీలోనే వేశారు. కాని, ఈ రెండో వార్తను ఎందుకైనా మంచిదని లోపల పేజీల్లొ ప్రచురించారు. కారణం వాళ్ళ ఎడిటర్లకే తెలియాలి. నా ఉద్దేశ్యం, వాళ్ళు ఒకరి మీద మరొకరు చూపించుకునే ప్రొఫెషనల్ మర్యాద అయ్యి ఉంటుంది

మనకు సమాజంలో జరుగున్న అన్యాయాలను ఎత్తి చూపాల్సిన మీడియా, ఇలా అందరి ముందు ముద్దాయిగా ఎందుకు నిలబడాల్సి వచ్చింది మీడియా నే వార్తల్లోకి ఎందుకు ఎక్కుతోంది. న్యాయ స్థానాల చేత ఎందుకు మొట్టికాయలు తింటోంది. కారణం ఒక్కటే, మీడియా అతి ప్రవర్తన. ఇది చూపచ్చు ఇది చూపకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు అక్కడ రిపోర్టర్లు పైగా ఏడిటర్లు కూడానట. రెండు ముక్కలు కెమెరా ముందు నిలబడి మాట్లాడగలితే చాలు వాడు రిపోర్టరు . ఆ కెమారాలు, వాటిని ఒకదాని తరువాత మరొకటి కనెక్టు చేయటం, టైము ప్రకారం ప్రసారాలు నిర్వహిస్తున్నావాడు ఎడిటరునట ఈ మీడియాలో.

ఎక్కడి మట్నూరి కృష్ణారావుగారు, ఎక్కడ నార్ల వారు, ఎక్కడ జి కె రెడ్డిగారు. వీళ్ళ పేర్లు కూడ ఇప్పుడు ఈ మీడియాలో చక్రం తిప్పుతూ, మాకెక్కువ రాంకింగు అంటే మాకింకా ఎక్కువ రేటింగని సిగ్గులేకుండా మీసాలు మెలేసే (నిజంగానే ఒకడు మీసాలు అలానే పెంచాడు) వాళ్ళకి తెలియవు. తెలిసినా వాళ్ళను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలోకూడ తెలియదు.


మనం ఈ టివికి బానిసలం అయిపోయినాంకదా అందుకని ప్రస్తుతం, మీడియా ముఖ్యంగా టి.వి ఒక వికృతరూపం దాల్చి మనముందు నిలబడి మనల్ని పరిహసిస్తోంది, కొంతలో కొంత ప్రింటు మీడియ అనబడే పత్రికలు నయం. ఎందుకంటే వాళ్ళకి "భ్రేకింగు న్యూస్" గోల లేదు. మా చిన్నప్పుడు, ఎవరైనా పెద్ద నాయకుడు మరణిస్తే లేదా పదోతరగతి పరిక్షా ఫలితాలు వెలువడినప్పుడు మాత్రమె అప్పటి సమయం ఏదైనా సరే రెండుపేజీలతో ప్రత్యేక పత్రికలు వెలువడేవి. అంతకు మించి, పిల్లి సమర్తాడితే బ్రేకింగు న్యూస్ అంటూ బజాయించిన దాఖలాలు లేవు పాపం వాళ్ళకు.

ఇక్కడే పెద్ద బేధం ప్రింటుకు ఎలక్ట్రానిక్ మీడియాకు. ప్రింటు మీడియా, వెంటనే ప్రజల ముందుకు రాలేదు, వార్త వ్రాయాలి, అది ఇంకొకరు చూడాలి, దిద్దాలి, ప్రింటు చేయటానికి అక్షర కూర్పు జరగాలి, ఆ కూర్పును మరొకరు దిద్దాలి (ఇప్పటి కంప్యూటర్ యుగంలో కూడ ఇదంతా జరగాల్సినదే). ఇవి జరుగుతున్నప్పుడు ఇంతమంది మధ్యా ఆ వార్త నలిగి, వివేచనా జ్ఞానంతో బయటకు వస్తుంది. మంచి మాటల పొంకంతో వన్నె తేలుతుంది వార్తా కథనం.


కాని టి.వి వారికి ఈ ప్రయాస లేదు. రోడ్డుమీద కెమెరా భుజానేసుకుని బయలుదేరటం, ఎవడో ఒక అరటి తొక్కమీద కాలేసి పడితే చాలు, వెంటనే లైవ్ ప్రసారం ఆ కెమెరా ముందు నిలబడి ఒకటే వాగుడు. ఆ వాగే వాడికి అడ్డూ అదుపూ ఉన్నట్టులేదు. వాడు మాట్టాడిన తక్షణం మన ఇంట్లో మనం చూడటం, వినటం. ఇకెక్కడి విచక్షణ?? కాబట్టి మొట్టమొదట ఈ టి .వి మీడియా వాళ్ళు ఈ "బ్రేకింగు న్యూస్" అన్న హాస్య ప్రసారాలను, స్క్రోలింగులను మానెయ్యాలి. ప్రతిదీ బ్రేకింగు న్యూసేనా? ఇక మామూలు న్యూసు లేదా.

ఆ తరువాత, లైవ్ ప్రోగ్రాం కింద ఎటువంటి సంఘటనలు చూపాలి. అన్న విషయం కూలంకషంగా చర్చించి అందరూ ఒక నిర్ణయానికి రావాలి. ప్రతి సంఘటన లైవ్ చూపాల్సిన పనిలేదు. ముఖ్యంగా, ఒక కిడ్నాపో, టెర్రరిస్టు దాడో జరిగినప్పుడు లైవ్ చూపటం నిషేధించాలి. పట్టుకోవాల్సిన దోషి ఫొటో, కిడ్నాప్‌కు గురైన వ్యక్తి ఫొటో చూపించి ప్రజలను వాళ్ళను పట్టుకోవటానికి సహకరించమని అభ్యర్ధించవచ్చు . అంతేకాని, పోలీసులు ఒక పక్క వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే వాళ్ళ చంకల్లోంచి కెమెరాలు పెట్టి చూపటం వల్ల సామాన్య ప్రజానీకానికి జరిగే మేలు ఏమిటి?? నేరం చేసినవాళ్ళు ఈ టి.వి లు చూస్తూ ఎప్పటికప్పుడు పోలీసులు చేసేది తెలుసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు . ముంబాయిలో 2008 నవంబరులో టెర్రరిస్టు దాడి జరిగినప్పుడు జరిగినది అదే.

ఒకవేళ ఒక గొప్ప సంఘటనను లైవ్ చూపించాల్సిన అవసరం ఉన్నప్పుడు జరుగుతున్న సంఘటనకు, టి.విలో వస్తున్న దానికి కనీసం రెండు నిమిషాలు వ్యవధి ఉండాలి. ఆ వస్తున్న లైవ్ ప్రసారంలో వస్తున్న దృశ్యాలను, ఆ రిపోర్టరు చెప్తున్న విషయాలను, ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తి చెప్తున్న మాటలు ఎంతవరకు ప్రసారం చెయ్యవచ్చు అన్న విషయం, ఈ రెండు నిమిషాలలో నిష్ణాతులైన (మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్న)బేరీజు వేసి నిర్ణయించగల సామర్ధ్యం ఉన్న నిజమైన సంపాదకుల ఆధ్వర్యంలో మాత్రమే ఈ లైవ్ వార్తలను ప్రసారం చెయ్యాలి.

వాళ్ళ ఇంటో పాపం ఆత్మీయుడు మరణించి ఏడుస్తుంటే, వాళ్ళ ఏడుపులన్ని ఎందుకు చూపిస్తారు టి .వి ల్లో పాపం వాళ్ళఏడుపును అందరి ముందు ఏడవాలా. ఎప్పుడైనా చూడండి ఒక హ్రుదయ విదారకమైన సంఘటన జరుగినప్పుడు, కెమరా గాళ్ళు ఎవరు ఏడుస్తున్నారా, ఎవరు ఏడవపోతున్నారా అని పసికట్టే ప్రయత్నంలోనే ఉంటారు. ఏడవపోతున్నారనుకుంటున్నావాళ్ళను దగ్గరకి మరింత దగ్గరకి చూపించి ఒక్క కన్నీటి బోట్టన్నా రాల్చకపోతారాఅన్నట్టుగా వాళ్ళ చుట్టూనే కెమెరాను తిప్పుతూ ఉంటారు. ఆంగ్లంలో వచ్చే ఒక పెద్ద చానెల్ కు వ్యక్తి వ్యక్తి భార్య వీరఆంఖర్లు. వ్యక్తి తండ్రి ఒక ప్రముఖ క్రికెటర్. మధ్య ప్రముఖ క్రికెటర్ పెద్దతనంవల్ల, అనారోగ్యంతో మరణించాడు. మామూలుగా ఇంకెవరైనా చనిపోతే, శవాన్ని తెగ చూపించి, ముక్కుల్లో దూదులను కూడ క్లోజప్లో చూపేఛానేళ్ళన్ని పెద్దాయన పోయినప్పుడు మాత్రం దూరంనుంచి చూపించి ఎంఖరు తమవాడుకదా అని భక్తిగా ఒదిగిఉన్నయి. మరి ఇదే మర్యాద ఇతరుల పట్ల చూపించక్కరలేదా.

ఇలా వ్రాసుకుంటూ పోటే చాట భారతం అవుతుంది. కాబట్టి ఏతా వాతా చెప్పొచేదేమంటే. ఇప్పటికైనా, మీడియా, ముఖ్యంగా టి .వి వాళ్ళు కొంత సంబాళించుకుని వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోకపోటే, అతి త్వరలో ప్రభుత్వాలు ఇదేసందని, కఠినమైన చట్టాలను తెచ్చి మీడియాను నియంత్రించటం మొదలు పెడితే కాదనే వాడు ఉండడు. సామాన్యప్రజలు అంతగా విసిగి పోయారు టి.వి న్యూస్ చానేళ్ళతో.

ఈ మధ్య విజయవాడలో జరిగిన కిడ్నాపు ఆతరువాత హత్య వార్తలను TV లో చూసి ప్రముఖ బ్లాగరు
ముఖ్యంగా మీడియా మీద వ్రాసే రామూ గారు తమ బ్లాగులో ఇలా వ్రాసారు

రిపోర్టింగ్ లో ఎన్నో మరణాలు చూసిన నాకే...ఈ పాట..ఆ దృశ్యాలు గుండె మీద పని చేసాయి. ఒక్క క్షణం గుండె కలుక్కు మంటే....లేనిపోనిది...మనం కూడా పోతామేమో అని...ఒక ఆటల ఛానల్ పెట్టుకుని విషాదాన్ని దిగమింగుకున్నా. "బాల్యమందే నిన్ను చంపిందా...ఈ పాపిష్టి లోకం తల్లీ," "కొలిమిలో వేసి నను చంపారా తల్లీ.." వంటి విషాదకర చరణాలు ఆ సాంగ్ లో ఉన్నాయి.

అదే వార్తా కథనాలను ఉదాహరిస్తూ మరొక ప్రముఖ బ్లాగరు చందమామ రాజుగారు ఈ విధంగా వ్రాసారు

"........నిన్న సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికొచ్చాక, టీవీ9లో పాట వస్తుంటే విన్నాను, విని ఊరకుండటంచేతకాకుండా నాలాగే లక్షలమంది వీక్షకులు అల్లాడిపోయి ఉంటారు. ఉద్వేగం అలాగే కొనసాగితే ఎక్కడ గుండె పోటువస్తుందో అనే భీతితో, కలవరంతో ఇంట్లోనుంచి బయటకు పరుగెత్తాను. ఒక్కసారి రక్తపోటు పెరిగిపోయింది............"

నేను కూడ వార్తా కథనం చూస్తున్నప్పుడు ఉద్వేగం ఆపుకోలేకపోయాను. భరించలేని బాధ కలిగింది. ఇక చూడలేకటి.వి కట్టేసి పి సి లో ఒక హాస్య సినిమా పూర్తిగా చూసినా కూడ రాత్రి సరిగ్గా నిద్ర పోలేక పోయాను. ఒక్కటే భావన కొలిమి అందులో కాలిపోయిన పాప.

టి వి వాళ్లకు ఇన్ని లక్షల మందిని ఇలా క్షోభ పెట్టె హక్కు ఎవరిచ్చారు. మధ్య ముఖ్య మంత్రి ప్రమాదంలో మరణిస్తేఅనేకమంది ఆత్మ హత్య చేసుకున్నారని విని రాజకీయ పార్టీలు వాళ్ళ తాబెదార్లు పుట్టించిన పుకార్లు ఆడుతున్ననాటకాలని కొట్టిపారేసాను.
కాని, ఇప్పుడు అనిపిస్తున్నది, టి.వి చానెల్ వాళ్ళు వార్తను తెగ చూపిస్తూ, పాటలు పెట్టి , బాక్ గ్రౌండు సంగీతం పెట్టి, ప్రమాద స్థలం, అక్కడి పరిస్థితి ఆయన బతికి ఉండగా తీసిన వీడియోలు, వరుస పెట్టిచూపిస్తుంటే సామాన్య ప్రజానీకం తప్పనిసరిగా ప్రమాదానికి లోనయ్యి ఉంటారు. ఆత్మ హత్యలు చేసుకున్న వాళ్ళుటి.వి వాళ్ళు చూపించిన తీరుకు బలి అయిపోయి ఉంటారు అనుకుంటున్నాను.

తరువాత ఏదైనా మధ్య విజయవాడలో జరిగినటువంటి కిడ్నాపు, హత్య వంటి ఘోరాలు జరిగినప్పుడు, వెనువెంటనే గుమికూడిన జనాలతో ఇంటర్వ్యూలు, అసలే అవేశంలోను, దు:ఖంలోనూ ఉన్న వాళ్ళు మాట్లాడేది లైవ్ లోచూపించటం. ఇళ్ళల్లో ఉండి ఇవి చూస్తున్న వాళ్ళు మరింత ఆవేశపడటం, గుండె నొప్పో తెచ్చుకోవటం. గుంటూరులో కొలిమి దగ్గర అక్కడి పార్లమెంటు సభ్యుడితో లైవ్ ఇంటర్వ్యూ. ఆయన పని చేసిన వాళ్ళని ఎంకౌంటరు చేసిపారేయ్యాలని ఆవేశంగా పదే పదే చెప్పటం. జరిగిన అపహరణ, హత్యలకు బాధ్యులైన వారికి కఠిన శిక్ష వేసి తీరాలిసిందే. కాని సాక్షాత్తూ పార్లమెంటు మెంబరు ఎంకౌంటరు
చేసి పారేయాలనటం మీడియా వారి అత్యుత్సాహం వల్ల కాదూ. ఇదేనాప్రజాభిప్రాయ సేకరణ? ఇలా ఆవేశాలు రెచ్చగొడితే ఏమవుతుంది. ఎవరికి వారు చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని ప్రవర్తిస్తే తద్వారా బాధ పడేది ఎవరు

కాబట్టి టి.వి న్యూస్ చానెళ్ళన్ని కూడ నిజమైన ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏది చూపించవచ్చు, ఏదిచూపించకూడదు అన్న ఇంగిత జ్ఞానాన్ని సంపాయించుకోవాలి, రిపోర్టర్ల/ఏడిటర్ల కరీర్ ఓరియంటేషన్ కు జర్నలిజాన్నిపణంగా పెట్టకూడదు. వాళ్ళు చూపించే వార్తలను లక్షలమంది చూస్తుంటారు. చూస్తున్న వాళ్ళందరూ వారుచూపిస్తున్న దృశ్యాలకు, చెప్పే మాటలకు ప్రభావితులౌతుంటారు. విషయాన్ని గమనించుకుని తమను తామునియంత్రించుకోవాలి. లేకపోతే, అతి త్వరలో ప్రభుత్వాలు ప్రత్యక్ష సెన్సారు తీసుకొచ్చి అమలుపరిస్తే, ఎవ్వరూ కూడ చానెళ్ళకు మద్దతు పలకరు సరికదా, అంతే కావాలని మొటికలు విరుస్తారు, ఆనందించి పండుగ చేసుకుంటారు. అటువంటి నీచ స్థాయికి దిగజారిపోయినాయి ఈనాటి న్యూస్ చానేళ్ళు. బాబూ చానేళ్ళ వారూ, జర భద్రం. చూసుకునినడవండి. మీరు నడిచే దారి సరైనది కాదు, కానేకాదు, తప్పుదారిలో పడిపోతున్నారు అని అనెక లక్షలమంది ఏకకంఠంతో చెప్తున్నారు, వినండి,.వినకపోతే మీ ఖర్మానికే పోతారు జాగ్రత్త, కొంతకాలానికి మనకుట అనేక న్యూస్ చానెళ్ళుఉండేవిట, వాళ్ళు తమకు తామే ద్రోహం చేసుకుని, వాళ్ళు చేసిన అకృత్యాలవల్లే కనుమరుగైపోయినాయి అని చరిత్రలోమన తరువాతి తరం పిల్లలు చదువుకుంటారు, ఇప్పటి వార్తా కథనా రీతిని, రాబొయ్యో తరాలలో, జర్నలిజం ఎలాఉండకూడదు అన్న దానికి పరమ చండాలపు ఉదాహరణగా మిగిలిపోతారు.


====================================================================================================================================

ప్రముఖ బ్లాగరు రామూ గారు ఆంధ్ర ప్రదేశ్ మీడియా కబుర్లు అన్న తన బ్లాగులో మీడియా గురీంచి అనేక వ్యాసాలు వ్రాస్తుంటారు. ఆ వ్యాసలలో కొన్నిటికి నా స్పందన, ఇతరుల స్పందనలు, ఈ సందర్భంగా ఈ కింద పేర్కొనటం జరిగింది:

 • Blogger SIVA said...

  First and foremost, who is a Journalist should be defined. Just because somebody is writing something in the papers or coming as a News Anchor is not enough for a person to be called a Journalist.

  Once this is done, the old rule of Journalist ie. knowing the source should be highlighted to all those who are in charge of taking decisions to print/broadcast/telecast "news". The source for any news item should be checked and double checked for authenticity, even if it takes time. Here, the present rat race should not be an excuse to let go of this basic principle of journalistic values.

  Above all, even after a news is carefully collected and collated and the source is very much trustworthy, still there is a bounden pious duty of all the media towards the society. The Editors should know which news can be shown/printed at that juncture. Because, even if some news happens to be true, it may spoil the atmosphere in the society and the existing peace and harmony. Just because news is available it need necessarily always be in the interest of society to be made public.

  Many a time, the news so collected is to be shared with the Police and other such law enforcing agencies first before making it public. Sometimes, it should be just given to Authorities and not broadcast to public.

  These rudiments of sane Editorship should be imbibed by all the people in the media.

  11:17:00 AM

 • చదువరి said...

  "పరమ పవిత్రమైన వృత్తిని కాపాడుకోవడానికి, ఇందులో నైతిక విలువలు పునరుద్ధరించడానికి ఇంతకన్నామంచి తరుణం లేదు." -ఔన్నిజం! మీ అభిప్రాయం విస్పష్టంగా చెప్పారు. .........................."

  5:04:00 అం

 • SIVA said...

  Ramu gaaroo,

  I just wonder is it possible in the present mileu. Is there any good journalists left now among the lot? Like the Cinema world degenerated with pure commercialisation, News papers and TV channels are also polluted with people selling news as a product. The ill effects of commercialising news we are seeing.

  There is very necessity for an Ombudsman system to contain the media. Otherwise, they would ultimately incite people to a level where even brothers would fight.

  If government does something about this Ombudsman system, the so called champions of free press shoult "foul" and the same people do not have any capacity or inclination to cleanse the so called media.

  General public have to use their discretion in whatching channels and discard useless channels. That is the only control.

  6:28:00 అం

 • kvsv said...

  " రేపు మరి యేక్కడినా మాటర్ దొరికితే టివి5 కి దొరికినట్టు ప్రసారం చేయ్యోచ్చ లేదా లేకుంటే..చెయ్యకుంటేనిజాలు బూస్టాపితం అయ్యే అవకాశం లేదంటారా ?యేది నిజం?యేది అబద్దం?దేనిని ప్రసారంచేయకూడదు?చేయకపోవడం వల్ల యన్ని సత్యాలు మరుగున పడిపోతయ్యో?

  1:43:00 పం

 • SIVA said...

  KVSV JEE

  మీడియాలో పని చేస్తున్న ఒకాయన పార్కుకి వెళ్ళాడు. ఊసుపోక శనక్కాయలు కొన్నాడు. అవి తిని కాయితం పారేద్దామనుకున్నాడు. కాని కాయితంలో ఉన్న విషయం అతనిలోని జర్నలిస్టును(!?) నిద్రలేపింది. వెంటనే కాయితాన్ని అల్లాగే పట్టుకుని స్టుడియోకి పరుగు పరుగున వెళ్ళాడు. బ్రేకింగు న్యూస్ అని. కాయితాన్ని జూం చేసి హై లైటు చేసి చూపిస్తూ, మాటలు తడబడుతూ గోల గోలగా మాట్లాడాడు. పల్లి అమ్మినవాణ్ణి లాక్కోచ్చి కాయితం ఎక్కడిది అని వాణ్ణి లైవ్ లో ఆరా తీశారు. కాయితంలో ఉన్న విశేషాలు రకరకాలుగా విశ్లేషించి చర్చలు పెట్టారు. చివరికి చూస్తే, కాయితం పిచ్చాసుపత్రిలో ఉన్న పేషంట్ల కోసం కొద్దికొద్దిగా అప్పుడే తగ్గుతున్న వాళ్ళు తయారు చేస్తున్న గోడ పత్రిక తాలూకుది అని తేలిందిట. ఇదంతా చూసిఎప్పటిమట్టో షాపులు లూటీ చేద్దామనుకునే వాళ్ళు దొరికిందే సందని వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేరు.

  "ఒక్కటి మాత్రం నిజం సార్ ఏది కరెక్ట్ యేది రాంగ్ అన్నది తేల్చుకోలేకపోతున్నాం రేపు మరి యేక్కడినా మాటర్దొరికితే టివి5 కి దొరికినట్టు ప్రసారం చేయ్యోచ్చ" అని మీరు బాధపడుతున్నారు, సంశయం వ్యక్తపరుస్తున్నారు. మెటీరియల్ దొరికినప్పుడు, అదేమిటి, ఎక్కడిది, మనకు వచ్చిన మూలం సరైనదేనా, అన్నిటికి మించి, ఇటువంటిది చూపిస్తే ప్రజల్లో ఎటువంటి ఆవేశాలు వస్తాయి అన్నవి చూసుకోవాలి. ఏదో మటీరియల్దొరికిందికదాని, గోల మొదలుపెడ్తే ఎలా ఒక్కోసారి దొరికిన మటీరియల్ను ప్రసారం చెయ్యకుండా పోలీసులకుపోలీసులకి ఇవ్వాల్సి రావచ్చు.

  ఇప్పుడున్న పత్రికలను వినోదానికి మాత్రమే మార్చిన ఘనత దక్కించుకుని, ప్రాసల గోల హెడ్లైన్లలో మొదలుపెట్టిన పత్రిక ఒకటి 1979లో అనుకుంటా స్కై లాబ్ గురించి చేసిన గోల వల్ల అనేకమంది అమాయక జనం ఎంతతల్లడిల్లిపోయారు. అదే ప్రధమం, మీడియాలో సంచలనాలకి. అప్పుడే కట్టడి చేసుంటే బాగుండేది.

  7:18:00 PM

 • SIVA said...TV5 జర్నలిస్టుల అరెస్టు గురించి

 • పోలీసులు చాలా కాలానికి ఒక పని వాళ్ళంతట వాళ్ళే చేస్నట్టున్నారు. పోలీసులకు అభినందనలు. కొంతకాలంక్రితం వరంగల్లులో అనుకుంటా ఏసిడ్ దాడి చేసినవాణ్ణి ఎంకౌంటర్ చేసి పారేస్తే, ప్రజలు ఆనందించి, పోలీసులనుఅభినందించారు. ఇప్పుడు వీళ్ళను ఎంకౌంటరు చెయ్యమని కాదు కాని, ప్రజలు సంతోసిస్తున్నారు, చానెళ్ళనుకట్టడి చెయ్యటానికి పోలీసులు తీసుకున్న చొరవని.

  ఇదే చొరవ టి వి చానెళ్ళు బూతులు చూపిస్తున్నప్పుడు కూడ చేసి, దానికి కారణం అయిన వాళ్ళను చొక్కాలుఊడదీసి రోడ్డుమీద నడిపిస్తూ తీసుకెళ్ళాలి, ఊరందరూ వాళ్ళమీద కుళ్ళు టమేటాలు అవి విసరటానికి వీలుగా.

  IF THIS IS FREE MEDIA, WE DO NOT WANT FREE MEDIA.

  1:13:00 పం

 • Anonymous said...

  i strongly differ with siva garu... if we once find solace with police on the other day, the police turns violent towards one and all. Let us insist all media people to maintain ethics. All democratic setups should have a sense of ethics. standards fallen in all spheres of society, media is not an exception.

  3:01:00 అం

 • SIVA said...

  My Dear Anonymous,

  Thanks for differing "strongly" with me. Police are praised now only because of the media over action and the resultant arson. If police are not allowed to do their duty there would be chaos. We need good Police than the free media. Ultimately, the so called media has madae us think like that.

  6:23:00 అం

 • kvramana said...

  ................................... it is Reliance's assets. Imagine what would have happened if the channel was doing a similar programme on some other sensitive issue like Hindu-Muslims. Hundreds would have died by the time the channel apologised or the police booked a case.
  Ramana

  8:13:00 AM

 • SIVA said...

  "....luckily Reliance assets..." ???!!!

  To whomsoever the assets belong to, destruction destroys the material. Reliance does not lose anything, they get their insurance and they know how to get more than the value of actual destruction. The point is whether the channel that started this entire uncalled for telecasting was hand in glove with the lumpen elements that started the arson and looting. If such collusion is proved, it would just prove a very grave and macabre situation all these days many of us are apprehensive.

  Yes correct if the channel was in the same fashion was playing with the sentiments of those who are ready to be hurt at the drop of a hat? what would have been the position.

  Along with the erring channels, all those arrested in arson cases should be severely punished and quickly.

  Now TV9 and Sakshi TV are fighting in public shamelessly each other calling names in the their channels. In TV 9 the over smart newscaster was trying egg on Shri Potturi Venkateswara Rao to speak on his behalf and against Sakshi TV, but Sri Potturi is a very old hand and he deftly put the newscaster in his place. I think days are not far off, Reporters would be fighting with mikes bearing their logos as politicians did inside more than one Legislative Assembly.

  What JP said is correct. Ban all news channels for a fortnight or a month and let all Editors, Owners, the politicians sponsoring these channels and "sane" Seniors come together and have discussion for self regulation of media and give assurance to the public (not necessarily to Government)that they would henceforth behave.

  1:20:00 పం

 • SIVA said...

  This is the time that Government should take appropriate action against the erring channels which telecast the "story" without verifying the antecedents, just based on one obscure website, which ultimately resulted in arson in many places.

  Now is the time that these wagabond news Channels are taught a lesson they would never forget.

  10:14:00 PM

 • SIVA said...

  Today Sakshi TV is taking a stand that arresting the TV5 channel people is wrong. In the process they started to aim at Chandrababu Naidu and brought his long forgotten rival Lakshmi Parvathy (Remember her?? Mrs. NTR)to speak on the matter.

  On one hand criticizing the errant channels, other channels are going on talking about the incident showing the YSR's crash site again and again. Whats their idea.

  Shri K.V.Ramana informed with example how illeterate these so called reporters are. I do not understand one thing, while reporting some live incident, why they cannot keep their voice calm and steady. Usually, they stammer, blabber, repeat themselves, speak breathlessly and many times speak in circles and mostly meaningless. When a picture is being shown, is it necessary to go on shooting off their mouth? Can't the viewer see whats happening and understand it? Do we require their golden words?? Is it what the schools (??!!) they studied taught them what is TV journalism?? What a pity, what a pity. There is every need and necessity to define MEDIA and also NEWS. Then lets talk about whether media control is required or not. The present channels and most of the news papers are not media. A new word is to be coined to describe them.

  Now that TV5 people are arrested, the champions of free press shall swing into action and start stuttering incoherently. Where they have been hiding when the channels were misbehaving?? Is it the process an illiterate country (just because we read and write we are not literate)coming to terms with the technology and the attendant issues.

  12:00:00 పం

 • SIVA said...

  What exactly is media? We should define the word media first before the discussion on it. Just because somebody starts a rag for ads or purchases some satillite time again for ads, can we call such "things" as media?? Lets not show professional courtesy to such wagabonds. As a follow up for this, the word "News" also should be defined. What can be termed as news? What cannot be? What is panel discussion, what are the rules for such panel discussion? who should be called for such discussions? All these matters were given a "let go" by the present channels and news papers and if anybody who was quite irritated and getting depressed by the ill effects of the sponsored propaganda through these channels and papers and calls for a ban, we should understand the reasons.

  I will give a flip point to this. May be by over acting and abusing the media, some vested interest groups are trying to force the society at large to come to a conclusion that media is bad and spontaneously demand for banning?!

  There may still be some honourable people left in the news papers/media who should take the lead to clean the rot. What Press Council is doing in all this, just sleeping?? or taking the donations from all the channel owners??

  If any Govt. Dept or politician is behaving against public policy and the spirit of law, we go to news papers to express our views and to condemn. But when media itself is misbehaving, to whom should we go? Thats why even people like JP are propagating extreme steps.

  9:15:00 PM

 • Anonymous said...

  dear ramu,

  i have gone through ur article

  what is jp without media support today

 • SIVA said...

  OK if JP was given exposure in media, JP should keep quite even when media is misbehaving. Is it you scratch my back I shall scratch your back policy!!!!!! Because of such give and take policies only all our institutions are going into comatose position.

  8:26:00 PM

 • మీడియా --అడ్వర్టైజుమెంటు మాఫియా

  తెలుగు టెలివిజన్ ఛానెల్స్ లో బూతు కార్యక్రమాల ప్రసారంపై మేము రాసిన పోస్టులకు...చాలా ఆవేదనతో క్రమంతప్పకుండా స్పందిస్తున్న సదాలోచానపరుల్లో గౌరవనీయులు కప్పగంతు శివరామ ప్రసాద్ గారు ఒకరు. సమాజహితం పట్టని ఈ నీచ నికృష్ట ఛానెల్స్ పై కోర్టుకు వెళ్తే ఎలావుంటుందని కూడా వారు సూచించారు. TV-5 ప్రసారం చేసిన 'నగ్నా'మృతం...మీద పెట్టిన పోస్టుకు స్పందనగా వారు పంపిన వ్యాఖ్యను ఇక్కడ ఇస్తున్నాము. సమాజం గురించి ఆందోళన చెందుతున్న శివ గారికి హృదయపూర్వక అభినందనలు---రాము, హేమ ---------------------------------------------------------
  ఈ విషయం మీద కొంత ఆలోచించిన మీదట నాకు అనిపించినది ఏమంటే, ప్రస్తుతం మన సమాజం అడ్వర్టైజుమెంటు మాఫియా చేతుల్లో నలిగి పోతోంది. ఈ మీడియా గాళ్ళందరూ, ఆ మాఫియా చేతిలో కీలు బొమ్మలే. చాపకింద నీరులాగ, ఈ అడ్వర్టైజుమెంటు మాఫియా అన్ని చోట్లా చేరి మన జీవితాలను భ్రష్టు పట్టించి తమ తమ వ్యాపార పబ్బాలను గడుపుకోవటానికి అన్ని పన్నాగాలను పన్నుతోంది. ఏ చానెల్ కు ఏ రేటిన్గు? ఎందుకు? ఎవడికి ఎంత రేటింగు అయితే అన్ని అడ్వర్టైజుమెంటులు వస్తాయి, దాంతో బాటే డబ్బులు. అది అసలు కథ.

  ఇదివరకు ఎక్కడో ఓ పత్రికలో ఒదిగి ఉండే ఈ అడ్వర్టైజుమెంటులు, ఇప్పుడు కాల సర్పాలలాగ ఆ పత్రికలనే మింగేసి, వాటిల్లో ఉండే కథలను ఇతర శీర్షికలను పక్కకు నెట్టేసి వాటిని ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. దూరదర్శన్ నుండి ఈ రోగం బాగా వంట పట్టించుకున్నయి చానెల్సు అన్ని.

  మనం కూడ అబ్బా బాగుంది బాగుంది... అని ఎగపడి చూస్తున్నాము, వాళ్ళు చెలరేగి పోతున్నారు. మనం చూసే ప్రతి ప్రోగ్రాము, స్పాన్సరుడు, అంటే ఎవడో ఒక వ్యాపారి తన వస్తువులను అమ్ముకోవటానికి ఈ చెత్త ను స్పాన్సరు చేస్తాడు. అది మనం ఎగబడి చూడటం వల్ల తన వస్తువులను (ఎంత పనికిరానివైనా) అమ్ముకోవటానికి ప్రచారం సంపాయించి పదే పదే చూపటం వల్ల మన మీద తెలియకుండా మన కొనుకోలు ప్రవర్తన మీద ప్రభావితం చేస్తారు.

  మనం మన కేబుల్ వాడికి కట్టేదే ఖర్చు అనుకుంటాము. అది సరి కాదు. మనం కొనే ప్రతి వస్తువులోను, మనం చూసే/చదివే ప్రతి చెత్త ఖరీదు పడుతోంది. ఇది తెలుసుకుని, ఇది చూడచ్చు, ఇది చూడకూడదు అని నిర్ణయం తీసుకోగలిగిన పరిణితి మనకు వచ్చి, టీ.వి. తీసేస్తే ఇవన్ని సద్దుమణుగుతాయి. ఇక్కడ బ్లాగుల్లో ఎంత వ్రాసినా అరణ్యరోదనమే. కారణం బ్లాగుల్లో వ్రాసేవారే ఇక్కడ ఎక్కువమంది చదువుతారు, వ్యాఖ్యలు వ్రాస్తారు. జనరల్ పబ్లిక్ కి ఈ బ్లాగుల గురించి తెలుసా?? నాకు అనుమానం.

  ఈ మీడియా వాళ్ళు అస్సలు చూడరు. వాళ్ళకు టైమేది, రేపు మరేమి చెత్త చూపించాలి అన్న విషయం లో చాలా బిజీ. డబ్బులు కోసమే ఈ చానెల్సుకాని, సమాజ శ్రేయస్సు కోసమా? ఈ చానెల్సు పెట్టిన వాళ్ళల్లో ఒక్కడుకూడ సమాజం గురించి అలోచించట్లేదు. సామాజిక స్పృహ (ఈ జర్నలిస్టులమని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఈ మాటను తెగ వాడేస్తుంటారు తమ సౌకర్యం కొద్ది) అనేది మృగ్యం. కాబట్టి ఈ అడ్వర్టైజుమెంటు మాఫియా (అవును మాఫియానే) కోరలలోంచి మనను రక్షించేది ఎవరు? మనకు మనమే.

  అతి వ్యాపార ప్రకటనలు చేశే ఉత్పత్తులను కొనటం మానేయ్యాలి. చండాలపు ప్రోగ్రాములను స్పాన్సరు చేస్తున్న ఈ వ్యాపార సంస్థలకు మన అభిప్రాయాలను తెలియ చెయ్యాలి. ఈ రోజున ఆ పని ఇంటర్నెట్టు ద్వారా చాలా సులభం.
 • SIVA said...టి.విలో కొత్త సంవత్సరం సందర్భంగా బూతు కార్యక్రమాలు ప్రసారం చేసినప్పుడు

  Ramuji,

  Please tell what should we do. Is it possible to petition to Supreme Court to take this kind of TV Channels to task and issue proper guidelines and control the bunch of guys calling themselves media(!) This channel as if its a great social reformer gives slogans of banning caste, confiscating the assets of factionists.What about themselves. I am of the view that the CEO of the channel should be asked to watch the programme alongwith his wife and children(if any) and such viewing by them should be telecast live so that we can see how his children react to the obscenity on the channel with the fellow responsible for it sitting beside them.

  I am of the strong view that there should be Ombudsman system to control these channels. The present Press Council is self serving and it can never act as Ombursman for these rogue channels.

 • SIVA said...

  As a first step, lets ask our cable provider to remove TV9 from the basket of channels.

  Step 2 every body write one post card to the channel condemning what they are doing. If there is a deluge of criticism flooding their post box (not mail box) may be they would come out of their self trance.

  Step 3 file a PIL in courts. I just wonder why any court is not taking suo motto case of these channels! I hope judiciary proactively reacts and put an end to this. Nobody would object if such channels are pulled up. If such channels talk about press freedom its a shame for the cause of freedom of expression.

  9:06:00 AM

 • SIVA said...

  Ramuji,

  What is happening is that if in some area somebody protests in a particular manner, in that area, news hungry cameramen capture it(or they will be forced/asked to cover it) and ever hungry editors in Studios show it (they have to fill up 24 hours!) without giving a second thought as to the sensibilities of people who would be watching. Problem is more with the so called Editors in media rather than with people. We need mature people in the studios. Just because some footage is received, it is not always necessary show it all. Only sensible news (the word sensible should be properly defined and more importantly understood)should be aired. If one cannot find footage to fill the so called 24 hour news channels, better show some bhajans by Anup Jalota or show some Abba music videos, but do not play with the people and their emotions.

6 వ్యాఖ్యలు:

 1. శివ రామ ప్రసాద్ గారు న్యూస్ చన్నల్స్ వాటి అత్యుత్సాహం గురించి, అవి వ్యాపార కంపనీ ల మాఫియా కోరల్లొ చిక్కుకోవటం గురించి మీరు వివరం గా వ్యక్త పరిచిన అభిప్రాయాలు చదివితే, మీడియా బాధ తప్పించుకోవటానికి, నాలోచన మరియు స్పందన కలిగిన ప్రతీ వారూ ఒక సమూహం గా చేరి ఉద్యమించాలేమో అనిపిస్తున్నది. న్యాయ వ్యవస్థ ఎంత గా కట్టడి చెయ్యలని ప్రయత్నించినా, చట్టాలు చేసినా వ్యవస్త లో మిగిలిన యంత్రాంగం వారి వంతు పాత్ర వారు చిత్త సుద్ధి తో నిర్వహిస్తేనే కానీ ప్రయోజనం ఉండదు.

  సామాన్య మానవుని జీవితాన్ని వార్తలు అనే పేరు చెప్పి ఈ మీడియా ఎంత భయంకరంగా చిద్రం చేస్తున్నదో చూస్తుంటే, ఇగ్నోరన్స్ ఈస్ బ్లిస్స్ అనే ఆంగ్ల సామెత గుర్తు వస్తున్నది. ఈ భయంకరమైన క్లిప్పింగ్స్ తో కూడిన ఈ సంచలన వార్తలు తెలుసుకోక పోయినా దైనందిన జీవితం లో మనకి కలిగే నష్టం ఏమీ ఉండదు, ఇంకా మాట్లాడితే ప్రశాంతం గా మన జీవితం గడుస్తుంది.

  ఎప్పుడు వార్తల విశ్లేషణ లో ఏదో ఒక పార్టీ పట్ల సానుభూతి కలిగే విధంగ ప్రెజెంటషన్ ఉంటుంది కానీ నూటికి నూరు శాతం న్యాయా న్యాయ విచారణ జరగదు. ఉదాహరణకి, మొన్నటి వైష్నవి హత్యోదంతం తీసుకుంటె, అందరికి చనిపోయిన బాలిక పట్ల అది విని తనువు చాలించిన ప్రభాకర్ పట్ల సానుభూతి కలుగుతుందే కానీ, ఆ పిల్ల విషయం వదిలేస్తే (అది బాధ పడి గర్హించవలసిన విషయమే)ఆ వ్యక్తి వల్ల అతని మొదటి భార్య జీవితం నలిగి పోయిన విధానం, కొడుకు తండ్రి కి దూరం అయిన విధం, ఇంకా ఇలాంటి అనేక విషయాలు మరుగున పడి పోతాయి.

  నిజానికి ఇందులో నిజా నిజాల తో ఇతరులకి ఏమి సంబంధం. ఇది ఒక రాక్షస చర్య కాబట్టి అందరు సానుభూతి తో మాట్లాదుకుంటున్నారు. ఇలా ప్రతీ వారి వ్యక్తి జీవితాల గురించి విశ్లేషించే అవసరం కానీ, సమయం కానీ మనకి ఉంటాయా?

  ఏదో ప్రపంచం లో ఏమి జరుగుతున్నది అని తెలుసుకోవటానికి టీవీ పెట్టామా ఇక ఈ విష వలయం లో పడి మనశ్శాంతిని పోగొట్టుకోవలసిందే.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివరాం గారూ,
  మీ కథనంలోని అక్షరాక్షరంతో ఏకీభవిస్తున్నా.

  భవిష్యత్తులో మన ఉద్వేగాలను కూడా చంపుకోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చని నా భయం. భావోద్వేగాలు, సహానుభూతులు ఆమాంబాపతు టీవీ ఛానెళ్ల క్రెడిట్ రేటింగ్ పెంపుదల యత్నాలకు సమిధలవుతున్నాయని నా ఆనుమానం.

  650 మంది పైగా వైఎస్ కోసం ప్రాణాలర్పించేశారని నిన్న కూడా సంబంధిత ఛానెల్లో వార్త. కాని ఈ 650 మందిలో ఒక్కరంటే ఒక్క వైఎస్ బంధువు కూడా ప్రాణాలర్పించలేదు. ఒక్కరంటే ఒక్కరు. తన మరణం సందర్భంగా ప్రభుత్వ వ్యవస్థకు, సాక్షాత్తూ వైఎస్ విధానాలకు బద్ధశత్రువులు, రాజకీయ విరోధులు సైతం వైఎస్‌ను ఆకాశానికెత్తేశారు. మామూలుగా మనిషి చనిపోతే నివాళి పలకటం లాంటిది కాదిది.

  గత 50 ఏళ్ల కాలంలో ఇంత పకడ్బందీగా మనిషి మరణాన్ని హైలెట్ చేసి జనాలను, ప్రగతిశీలవాదులని చెప్పుకుంటున్న వారిని కూడా వైఎస్ మాయలో, లేదా ఛానెల్ మాయలో పడేసిన ఘటన మనం ఎప్పుడూ చూసి ఉండం.

  వైఎస్ లోని భూస్వామ్య కోణం, ముఠా కోణం మొత్తంగా పక్కకు పోయి తన సుగుణాల పుట్టమాత్రమే కనిపించేలా జనాన్ని భ్రమింపజేయడంలో 5 నెలల క్రితం ఛానెళ్లు చేసిన వీరంగం ఇంతా అంతా కాదు. క్రైస్తవ మతసంప్రదాయానికి అనుగుణమైన కరుణార్ద్ర గీతాలను, గుండెలు పిండే సంగీతాన్ని వినిపించడం ద్వారానే రాష్ట్రంలో అప్పట్లో చాలామంది ఉద్వేగమరణాల బారినపడ్డారు. అయినా వారిలో ఒక్క వైఎస్ బంధువూ లేడు. ఇది మాత్రం బ్రేకింగ్ న్యూస్ కాదు. కానేకాదు.

  వైష్ణవి హత్యాఘటన అనంతర పరిణామాల్లో గుండెపగిలి పోవడం తండ్రి ప్రభాకర్‌ వంతు మాత్రమే అయ్యింది.త్యాగాన్ని కొలబద్దగా తీసుకుంటే ఎవరు గొప్పో ఎవరు చెప్పాలి?

  మట్నూరి కృష్ణారావుగారు, నార్ల వారు, జి కె రెడ్డిగారు. వీళ్ళ పేర్లు తెలియకుండా ఉంటేనే గదా ప్రస్తుత ఛానెళ్లకు రేటింగులు పెరిగేది. పైగా ఆ క్రైమ్ న్యూస్ యాంకర్లు ఉంటారు చూడండి. సినిమాల్లో, నిత్యజీవితంలో రౌడీలే వీరికంటే కొంచెం నాజూకుగా ఉంటారు.

  క్రైమ్ యాంకర్లను చూసినప్పుడల్లా వీళ్లు ఎవరిని చంపబోతున్నారిప్పుడు అనే భయం.. వెంటనే ఛానెల్ తిప్పేయడం మాత్రమే చేస్తుంటాను నేనయితే.

  సరైన సమయంలో చక్కటి కథనం పోస్ట్ చేశారు. వ్య్కక్తిగతంగా కూడా మీకు తెలిసిన వారందరికీ మీ కథనం లింకును పంపించండి. అది చాలా మంచిది. ఏపీ మీడియా కబుర్లు బ్లాగును నేనూ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నాను. బిట్వీన్ ది లైన్స్ లాగా బిట్వీన్ ది ఛానెళ్ల, జర్నలిస్టు జీవితాల అంతర్గత భాగోతాన్ని దుమ్ము దులుపుతున్నారు కదా ఆ బ్లాగులో. అందుకే తెలిసిన వెంటనే నా బ్లాగులో చేర్చేసుకున్నాను.

  "రోడ్డుమీద కెమెరా భుజానేసుకుని బయలుదేరటం, ఎవడో ఒక అరటి తొక్కమీద కాలేసి పడితే చాలు, వెంటనే లైవ్ ప్రసారం ఆ కెమెరా ముందు నిలబడి ఒకటే వాగుడు. ఆ వాగే వాడికి అడ్డూ అదుపూ ఉన్నట్టులేదు. వాడు మాట్టాడిన తక్షణం మన ఇంట్లో మనం చూడటం, వినటం. ఇకెక్కడి విచక్షణ?"

  సమకాలీన ప్రపంచంలో ఇలా వీరఫోజులు గొడుతున్న వారి గురించి ఇంతకంటే మంచి వ్యాఖ్యను నేను ఎక్కడా చూడలేదు. మీకు అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్రసాద్ గారూ,

  హృదయానికి హత్తుకునేలా చెప్పారు. దేశంలో నానాటికీ హింస పెరిగిపోతున్న ఈ తరుణంలో న్యూస్ చాన్నెల్స్ వాళ్ళకి కావల్సినంత పని. కానీ ఇలా చూపించతగినవీ, చూపకూడనివి అన్న తారతమ్యం లేకుండా భయానక దృశ్యాలు ప్రసారం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బి.పి పెరుగితే, కొన్ని సందర్భాల్లో అసలు ఇలాంటి దేశంలో ఎలా ఉండగలుగుతాం అని ప్రశ్నలు. ఇది అనవసరమైన భయాన్ని ప్రేక్షకుల్లో కలిగించడమే. నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రసారం 2008 లో నోయిడాలో ఆరుషి హత్య కేసు. మళ్ళీ తరువాత ఇదిగో ఈ చిన్నారి వైష్ణవి విషయం. మనం ఏం చేయగలం ఈ టివి చాన్నెళ్ళకి వ్యతిరేకంగా. నేను మాత్రం ఇకపై కేవలం న్యూస్ పేపర్లు మాత్రమే చదివి వార్తలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కొంతలో కొంత నయం కదూ.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఏపీ మీడియా కబుర్లు టపాల్లో మీ ఫోటో చూసి ఎచ్చులోడు అనుకున్నా. మీ బ్లాగ్ చూసి అభిమానినయ్యా. ఆకాశ రామన్న, గుంపులో గోవిందయ్య లాగా అజ్ఞాతంలో ఉంటేనే రచయిత మరింత విశృంఖలంగా, సృజనాత్మకంగా ఉంటాడని ఎక్కడో చదివా. పాటించి చూడండి. చిన్నప్పటి ఫోటో ముచ్చటగా ఉంది. ఇదికేవలం మీరు వ్యక్తిగతంగా చదువుకోవడానికి రాసింది. మార్పు కనిపిస్తే స్పందించారు అనుకుంటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. తాటిమట్టగారూ. (సారీ మీ పేరుతెలియదుమరి). అజ్ఞాతంగా ఉండేమి ఖర్మం! హాయిగా మనపేరుతో వ్రాయాలి లేదా మనెయ్యాలి అంతే. ఎవడో అనామకుడు ఏ ఆంగ్లంలోనో ఏదో ఒక కొటేషన్ లోది ఏ సందర్భంలో అన్నాడో చూసుకోకుండా అదేదో బంగారు మాటలాగ పట్టుకు వెళ్ళటం ఏమంత మంచి పని కాదని నా అభిప్రాయం. ఏమైనా నా బ్లాగు మీకు నచ్చినందుకు సంతోషం.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.