26, మార్చి 2010, శుక్రవారం

శ్రీ శంకర్ బొమ్మలతో

చందమామ లో మన అభిమాన చిత్రకారులు శ్రీ శంకర్ గారిని గత శనివారం వారి ఇంటిలో కలవటం జరిగింది. విశేషాలు అతి త్వరలో వ్రాసి ప్రచురించటానికి ప్రయత్నిస్తున్నాము. లోగా ఆయన వేసిన బొమ్మలతో ఆయన పేరు ఒక సారి చూసి ఆనందించండి
పై బొమ్మాక్షరాలను నొక్కి చూడండి

6 వ్యాఖ్యలు:

 1. శివ గారూ !
  మంచి బొమ్మ ఇచ్చారు. అది కూడా శంకర్ గారిదేనా లేక మీరు Compose చేసారా ? శంకర్ గారి దైతే ఆ మహానుభావుడికి ఎలా అభినందనలు తెలపాలో అర్థం కావటంలేదు. మీదైతే మాత్రం నేను కాలర్ ఎగురవేస్తాన,ఇంత అద్భుతంగా చేసినది మా బ్లాగు మిత్రులని. మీ శంకర్ గారి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ...........

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రావుగారూ ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు. మీరు కాలరెత్తండి. ఈ బొమ్మ చేసింది నేనే. శంకర్ గారి మీద ఉన్న గౌరవంతో, ఆయన రామాయణానికి వేసిన బొమ్మలతో ఆయన పేరు వ్రాశాను. ఇది చెయ్యటానికి పిక్చర్ కాలేజి అనే సాఫ్ట్వేర్ వాడాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివరాం గారూ
  ఈ మధ్య బొమ్మాక్షరాలతో కొడుతున్నారు. చాలా బాగుంది. వీలైతే మీకు గతంలో నేను పంపిన శంకర్ గారి అబ్బాయి రామకృష్ణన్ గారి ఈమెయిల్ ఐడీకి మీరు శంకర్ గారిపై ప్రచురించే అన్ని కథనాలు, ఫోటోల లింకులు తప్పక పంపించండి. అలాగే మీ కెమెరానుంచి తీసిన నాణ్యమైన ఫోటోలను కూడా తన మెయిల్ ఐడీకి పంపితే శంకర్ గారికి అవి అందుతాయి. నిజంగా ఆయన చాలా సంతోషిస్తారు. తెలుగు రాని కారణంగా ఆయన గురించి ఇన్నాళ్లుగా తెలుగులో వచ్చిన వస్తున్న బ్లాగ్ ఆర్టికల్స్ లో ఏం రాస్తున్నామో కూడా శంకర్ గారికి తెలియకుండా పోతోంది.ఈ మధ్య పదేళ్ల క్రితం ఓ తమిళపత్రికలో తన గురించి వచ్చిన కథనాన్ని ఇంగ్లీష్ చేయించి పంపి తన సూచనలు అడిగితే ఆ కథనంలో కొన్ని సవరణలు సూచించారు. తనపై సమాచారాన్ని తానే సవరించడం ఎంత బాగుందో మరి. బొమ్మాక్షరాలను కూర్చడం కాల హరణంతో కూడుకున్నదే కదూ.. బాగా శ్రమిస్తున్నట్లుంది.

  చందమామ బ్లాగులో "చందమామ శంకర్ : అరుదైన పత్రం" పేరిట ఈ సాయంత్రమే ఓ కథనం పోస్ట్ చేసాను. దానికి కూడా మీరు పంపిన ఫోటోలే వాడాను. చూడండి.
  blaagu.com/chandamamalu

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ‘బొమ్మాక్షరాలు’- భలే ఉందే ఈ పదం! సాంకేతికంగా చెక్కిన ఆ మూడక్షరాల్లో శంకర్ గారిపై మీకున్న అభిమానమంతా వ్యక్తమవుతోంది. తర్వాత ‘‘చిత్రా’క్షరాల’’ కోసం కూడా మేం ఎదురుచూడొచ్చంటారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వేణూగారూ, ధన్యవాదాలు. చిత్రాక్షరాలు కూడ చెక్కాలండి. త్వరలో. దాసరి పాత్రలతో చేసిన బొమ్మాక్షరాలు అన్ని కూడ చిత్రా గారి బొమ్మలే కదండి. కాకపోతే ఆయన పేరు వ్రాయలేదు. త్వరలో వేరే బొమ్మలతో ఆయన పేరు చెక్కుతాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీ ఘనతను కీర్తించడానికి మాటలు చాలడంలేదు. మీరు రాసిన కధకు శంకర్ గారు ఆ వయసులో బొమ్మలు గీయడమే.. ఎంత గొప్ప విషయం. మీరు చేసిన ఆ ప్రపంచ పటం, శంకర్ గారి పేరు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. మీ ఓపికకి, మీ ఆశక్తికి, మీ అభిరుచులకి వేనవేల జేజేలు.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.