7, మార్చి 2010, ఆదివారం

సురేఖగారి చందమామ జ్ఞాపకం

మన తెలుగు చందమామ-1955-ఆనాటి ఓ కధ-కబుర్లు,వార్తలు

1955.అప్పుడు నేను ఫిఫ్త్ ఫారం చదువుతున్నాను. ఆ నాటి మన చందమామలో మంచి మంచి
కధలతో బాటు పిల్లలకోసం వార్తలు-విశేషాలు అనే శిర్షిక కూడా నిర్వహించేవారు.ఇప్పుడు మీతో 1955
జనవరి నెలలొ ప్రఛురించిన "కాకి అరుపుకు కారణం" అనే కధ(బి.వేణుగోపాలరావు)సంక్షిప్తంగా,ఆ
ఏడాది వచ్చిన కొన్ని వార్తలను చెబుతాను. ముందుగా కధ;"కాకి అరుపుకు కారణం"

భోజరాజు ఆస్త్ధానములొ ఎందరో కవులను ఆదరించి వాళ్ళకి అక్షర లక్షలిచ్చి ఆదరించేవాడు.అతని
రాజ్యంలో దాదాపు అందరూ కవులే,చిన్నపిల్లలతో సహా.అనాదిగా కాశీపండితులకు దేశమంతా గొప్ప
ఖ్యాతి వుండేది కాని భొజరజు కాలంలో ధారానగర పండీతుల ఖ్యాతి పైకి వచ్చింది.
ఇది చూసి కాశీపండితులకు కోపం వచ్చింది.కాశీపండీతులు కొందరు ధారానగరానికి వెళ్ళి అక్కడి
పండితులను బహిరంగ చర్చలో ఓడిస్తేగాని కాశీనగర ప్రతిష్ట్ నిలువదని తీర్మానించి ఓ నలుగురు
పండితులు ధారానగరం వెళ్ళి ఓ సామాన్య గృహస్తు ఇంట బస చేశారు.గృహస్తు వాళ్ళని తన అంతస్తుకు
తగ్గట్టు ఆదరించాడు.ఆయనకు పన్నేండ్ల కూతురు,ఎనిమిదేళ్ళ కొడుకూ ఉన్నారు.పండితులు మరుసటి
ఉదయం వేకువనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చెట్ల మీద కాకులు
విపరీతంగా అరుస్తున్నాయి.అప్పుడు తమ్ముడు అక్కతో"అరుణోదయ వేళ కాకులు ఎందుకు అరుస్తాయే?"
అంటూ అడిగాడు.నీళ్ళు తేవడానికి ఆ పిల్ల బావి దగ్గరకు వెల్తూ,ఈ చిన్న అనుమానాన్ని మన ఇంట
వున్న కాశీ పండితులు చెబుతారులే అంది.అప్పుడు కుర్రవాడు పండితుల దగ్గరకు వెళ్ళి ఆ ప్రశ్న అడిగాడు.
పండితులు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొన్నారు.ఏదో సమాధానం చెప్పాలి కనుక "ప్రొద్దునే లేచి కాకులు
ఒకదాన్ని ఒకటి పలుకరించుకంటాయి"అన్నాడొక పండితుడు.రోజల్లా పలుకరించుకుంటూనే ఉంటాయి.ఉదయాన్నే
ఒక్కసారిగా ఎందుకు అరుస్తాయి? అని అడీగాడు కుర్రవాడు."రాత్రి ముగిసింది కనుక సంతోషంతో అరుస్తాయి"
అన్నాడో పండితుడు."రోజల్లా అరవవేం?" అన్నాడు కుర్రవాడు.మిగిలిన పండితులు ఏవేవో చెప్పారు కాని
కుర్రవాడికి తృప్తి కలుగలేదు.ఇంతలో అక్క తిరిగి రాగానే కుర్రవాడు అదే ప్రశ్నను అక్కను అడిగాడు."కాశీ
పండితులను అడగలేదా?" అంది అక్క."వారికీ సరిగా తెలిసినట్టు లేదక్కా"అన్నాడు తమ్ముడు."అయితే
నేను చెబుతాను విను:సూర్యభగవానుడు చీకటిని నిర్మూలిస్తూ రావటం చూసి, నల్లగా వున్న తమను కూడా
చీకటిగా భావించి నిర్మూలించి పోతాడేమోనని'మేము చీకటిమి కాము,కాకులము,కావు,కావు'అని సూర్య
భగవానుని హెచ్చరిస్తున్నాయి" అంటూ అక్క లోపలికి వెళ్ళి పోయింది.తన సందేహం తీరినందుకు పిల్లవాడు
పరమానందంతో గంతులు వేయసాగాడు."ఇంకా పెళ్ళి కాని ఈ అమ్మాయికే ఇంత ప్రజ్ణ వుంటే, ఇక ఈ దేశపు
పండితుల ముందు మనమెంత?" అనుకొనీ ఆ పూటే కాశీనగరానికి ప్రయాణం కట్టీ వెళ్ళి పోయారు.
శ్రీ శంకర్ వేసిన అద్భుతమైన బొమ్మలతో ఇలాటి కధలను ఎన్ని సార్లు చదివినా కొత్తగానే వుంటుంటాయి!

సురేఖ గారి జ్ఞాపకాలని పూర్తీ చెయ్యటానికి, నా దగ్గర ఉన్న పాత చందమామల కలెక్షన్ నుండి ఈ కథకు సంబంధించిన బొమ్మలను కూడా ఇస్తున్నాను (శివ)


సురేఖగారే పంపిన మరొక జ్ఞాపకం

1955 ఏప్రీయల్ నెలలో "వార్తలు-విశేషాలు" శిర్షికలో వేసిన కొన్ని వార్తలు.
ఫిబ్రవరి మాసంలో ఆంధ్ర అంతటా జరిగిన ఎన్నికలలో 196 స్ధానాలకుగాను 119 మంది కాంగ్రెస్
అభ్యర్ధులలూ, 22 మంది కృషికార్ లోక్ పార్టీ వారూ, 5గురు ప్రజా పార్టీ వారూ,15 మంది
కమ్యూనిస్టులూ,13 మంది ప్రజా సోషలిస్టులూ,22 మంది స్వతంత్రులూ ఎన్నిక అయినారు. 16
మాసాల క్రితం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే తొలి సర్వవ్యాప్త ఎన్నిక.

****************************************

1951 సంవత్సరపు జనభాలెక్కల ప్రకారం, ఇండియా లోని 36 కోట్ల ప్రజలలోనూ 6 కోట్ల మంది
-అనగా నూటికి 16.6 మంది-మాత్రమే చదువుకొన్న వారనీ,తక్కిన 30 కోట్ల మంది చదువే రాదని
తేలింది.చదువుకున్న ఈ 6 కోట్ల మందీ ఏదో ఒక భాషలొ మామూలు ఉత్తరాలు చదువగలిగీ రాయగలిగీ
ఉన్నారు.

*****************************************


1 కామెంట్‌:

  1. సురేఖ గారి చందమామ జ్ఞాపకాలు బాగున్నాయి. కాకి అరుపుకు కారణం కథ చాలా బావుంది. 70ల కాలంలో కూడా ఇలాంటి మంచి కథలనే మేం చదువుకున్నాం. అప్పారావు గారూ మీరు చందమామ వెబ్‌సైట్‌కు కూడా చందమామ జ్ఞాపకాలు రాయవలసి ఉంది. ఇప్పటికే రెండు మూడు సార్లు మీకు గుర్తు చేశాను. కానీ మీరు ఇంకా మీ జ్ఞాపకాలను పంపలేదు. తప్పక పంపగలరని ఆశిస్తూన్నాము.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.